వారం వారం ఓటీటీలోకి ప్రెష్ కంటెంట్ వస్తూనే ఉంటుంది. ఈ వీక్ కూడా ఓటీటీ రిలీజ్ లు అదిరిపోయాయి. ఇందులో తెలుగు సినిమాలు మరింత స్పెషల్ గా ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మల్టీ స్టారర్ నుంచి తేజ సజ్జా మిరాయ్ వరకు చాలా సినిమాలే వచ్చాయి. ఈ వారం ఓటీటీలోకి వచ్చిన తెలుగు స్పెషల్ మూవీస్ పై ఓ లుక్కేయండి.
ఎప్పుడెప్పుడా అని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నా వార్ 2 ఓటీటీలోకి వచ్చింది. తారక్, హృతిక్ రోషన్ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ దగ్గర అంచనాలు అందుకోలేకపోయింది. జూనియర్ ఎన్టీఆర్ కు బాలీవుడ్ లో ఇదే ఫస్ట్ మూవీ. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యాక్షన్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన వార్ 2 అక్టోబర్ 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
లేటెస్ట్ తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ మిరాయ్. ఈ ఫాంటసీ అడ్వెంచరస్ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. తేజ సజ్జా హీరోగా, మంచు మనోజ్ విలన్ గా నటించారు. అశోకుని 9 గ్రంథాల చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ఆ గ్రంథాలను సొంతం చేసుకుని, ప్రపంచాన్ని నాశనం చేయాలని మహాబీర్ లామా చూస్తాడు. అతణ్ని వేద అడ్డుకుంటాడు. ఈ ఫాంటసీ థ్రిల్లర్ అక్టోబర్ 10 నుంచి జియోహాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.
తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ త్రిబాణధారి బార్బరిక్. తన మనవరాలు మిస్సింగ్ కేసును ఛేదించే తాతయ్య క్యారెక్టర్ లో సత్యరాజ్ నటించాడు. ఇందులో ఉదయభాను లేడీ విలన్. ఈ సినిమా అక్టోబర్ 10 నుంచి ప్రైమ్ వీడియోతో పాటు సన్ నెక్ట్స్ ఓటీటీ యాప్ లోకి అడుగుపెట్టింది. మహాభారతంలో ఘటోత్కచుడి కొడుకు పేరు బార్బరిక్. ఆ పేరుతో వచ్చిన ఈ సినిమా మంచి థ్రిల్ పంచుతోంది.
మహాభారతంలో 18 రోజుల పాటు కురుక్షేత్ర యుద్ధం జరిగింది. పాండవులు, కౌరవుల మధ్య భీకర పోరు జరిగింది.ఈ యుద్ధాన్ని యానిమేటెడ్ సిరీస్ రూపంలో నెట్‌ఫ్లిక్స్ లోకి తీసుకొచ్చారు మేకర్స్. ఈ రోజు నుంచే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఈ యానిమేటెడ్ సిరీస్ అందుబాటులో ఉంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో దీన్ని రూపొందించారు.
ఇవే కాకుండా సెర్చ్ (జియోహాట్‌స్టార్) అనే హిందీ సిరీస్, గది (ప్రైమ్ వీడియో) సినిమా కూడా తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
సంబంధిత కథనం