ఈ వారం ఓటీటీలోని తెలుగు సినిమాలు.. అనుష్క ఘాటి నుంచి శ్రీలీల జూనియర్ వరకు.. థ్రిల్లర్, రొమాన్స్.. ఓ లుక్కేయండి-this week ott telugu movies must watch film on ott this weekend from anushka ghaati to sreeleela junior thriller romance ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఈ వారం ఓటీటీలోని తెలుగు సినిమాలు.. అనుష్క ఘాటి నుంచి శ్రీలీల జూనియర్ వరకు.. థ్రిల్లర్, రొమాన్స్.. ఓ లుక్కేయండి

ఈ వారం ఓటీటీలోని తెలుగు సినిమాలు.. అనుష్క ఘాటి నుంచి శ్రీలీల జూనియర్ వరకు.. థ్రిల్లర్, రొమాన్స్.. ఓ లుక్కేయండి

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలో కొత్త సినిమాలు, సిరీస్ లు వచ్చాయి. అదిరిపోయే కంటెంట్ తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. మరి ఈ వారం ఓటీటీలోని తెలుగు సినిమాలు ఏవి? అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేయండి.

ఓటీటీలో ఈ వారం తెలుగు సినిమాలు (X)

ఈ వారం ఓటీటీలో తెలుగు సినిమాలు అదరగొడుతున్నాయి. స్పెషల్ మూవీస్ స్ట్రీమింగ్ కు వచ్చాయి. అనుష్క ప్రధాన పాత్ర పోషించిన ఘాటి మూవీ నుంచి శ్రీలీల రొమాంటిక్ సినిమా జూనియర్ వరకు ఈ వారం ఓటీటీలో ఆడియన్స్ ను అలరిస్తున్నాయి.

ఘాటి

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని తూర్పు కనుమలలో స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే మూవీ ఘాటి. క్రూరమైన నాయుడు సోదరుల ఆధ్వర్యంలో జరిగే అక్రమ రవాణాలో చిక్కుకున్న అట్టడుగు సమాజం 'ఘాటీలు' పోరాటాలను ఇది చూపిస్తుంది. కుందుల్ నాయుడు, కాస్తాల నాయుడు నేతృత్వంలోని సిండికేట్ కు వ్యతిరేకంగా షీలావతి, దేశీరాజు ఒక శక్తివంతమైన కథలో నిలబడతారు. ఇందులో అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు, చైతన్య రావు, జగపతిబాబు తదితరులు నటించారు. ఇవాళ (సెప్టెంబర్ 26) ఓటీటీలోకి రిలీజైంది మూవీ. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

సుందరకాండ

తమిళంలో కూడా అందుబాటులో ఉన్న తెలుగు ఒరిజినల్ చిత్రం సుందరకాండ. ఇది ప్రేమను కోరుకునే మధ్య వయస్కుడి కథను చెబుతుంది. తల్లి, అమ్మాయితో ప్రేమను నడిపే హీరో స్టోరీతో రొమాంటిక్ కామెడీగా సినిమా సాగుతుంది. అనుకోకుండా ఓ కాలేజీ అమ్మాయితో ప్రేమలో పడటంతో అతని జీవితం తలకిందులుగా మారుతుంది. నారా రోహిత్, శ్రీదేవి విజయ్ కుమార్, విర్తి వాఘాని తదితరులు నటిచారు. సెప్టెంబర్ 23న జియోహాట్‌స్టార్‌లోకి వచ్చింది ఈ మూవీ.

జూనియర్

జూనియర్ అనేది అభినవ్ అనే కళాశాల విద్యార్థి ప్రయాణం ఆధారంగా రూపొందించిన ఫ్యామిలీ డ్రామా. ఇందులో టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్. గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటీ హీరోగా డెబ్యూ చేశాడు. ఇందులో కిరిటీతో రొమాన్స్ చేసింది శ్రీలీల. ఈ సినిమాతో జెనీలియా తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది. అతి ప్రేమ చూపించే తండ్రికి దూరంగా ఉండాలనుకునే కొడుకు కథ ఇది. సెప్టెంబర్ 30న ఇది ఓటీటీలోకి రానుంది. ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ రెండు కూడా

ఘాటి, సుందరకాండ, జూనియర్ కాకుండా మరో రెండు చిన్న తెలుగు సినిమాలు కూడా ఆ వారం ఓటీటీలో ఉన్నాయి. మేఘాలు చెప్పిన ప్రేమకథ మూవీ ఏమో సన్ నెక్ట్స్ లో, లీగల్లీ వీర్ సినిమా ఏమో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ఇవి కాకుండా మలయాళం సినిమాలు హృద‌య‌పూర్వం (జియో హాట్ స్టార్), ఒడుమ్ కుతిర చాడుమ్ కుతిర (నెట్ ఫ్లిక్స్), సుమతి వలవు (జీ5) కూడా తెలుగులో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉన్నాయి.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం