ఈ పిల్లాడి స్టోరీ సెలక్షన్ మాములుగా ఉండదు.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్.. తెలుగులో కూడా.. ఎవరో గుర్తు పట్టారా?-this child actor movie story selection next level rithvik jothi raj starrer sardar jailer lucky bhaskar blockbuster hits ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఈ పిల్లాడి స్టోరీ సెలక్షన్ మాములుగా ఉండదు.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్.. తెలుగులో కూడా.. ఎవరో గుర్తు పట్టారా?

ఈ పిల్లాడి స్టోరీ సెలక్షన్ మాములుగా ఉండదు.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్.. తెలుగులో కూడా.. ఎవరో గుర్తు పట్టారా?

Sanjiv Kumar HT Telugu

సరైన కథలను ఎంచుకోవడం కొన్నిసార్లు స్టార్ హీరోల వల్లే కాదు. అలాంటిది ఓ పదకొండేళ్ల పిల్లాడు మాత్రం తన స్టోరీ సెలక్షన్‌తో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. అతనే రిత్విక్ జ్యోతి రాజ్. ఈ పిల్లాడు చేసిన సినిమాలన్నీ దాదాపుగా బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. మరి పిల్లాడిని ఏ సినిమాలో చూశారో గుర్తు పట్టారా?

ఈ పిల్లాడి స్టోరీ సెలక్షన్ మాములుగా ఉండదు.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్.. తెలుగులో కూడా.. ఎవరో గుర్తు పట్టారా?

స్టార్ హీరోలు అయినా సరైన స్టోరీ సెలక్షన్ లేకుంటే బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్‌గా నిలుస్తుంటాయి. అందుకే ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలే నిదర్శనం. ఎంతో అనుభవం ఉండి కూడా గ్రిప్పింగ్ కథలను ఎంచుకోవడంలో అగ్ర కథానాయకులు విఫలం అవుతుంటారు. అలాంటిది ఓ పిల్లాడు మాత్రం అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటున్నాడు.

పదకొండేళ్ల రిత్విక్

అతనే పదకొండేళ్ల రిత్విక్ జ్యోతి రాజ్ (Rithvik Jothi Raj). రిత్విక్ అంటే పెద్దగా ఎవరు గుర్తు పట్టకపోవచ్చు. కానీ, దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి నటించిన లక్కీ భాస్కర్ మూవీలోని చైల్డ్ ఆర్టిస్ట్ అంటే అంతా గుర్తు పడతారు. అంతలా ఆ సినిమాలో తన నటనతో మెప్పించాడు. తన తండ్రి గ్రాండ్‌గా బర్త్ డే సెలబ్రేషన్ గురించి ఏడుస్తూ చెబుతూ ఆడియెన్స్ కళ్ల నుంచి కన్నీళ్లు తెప్పించాడు కార్తీక్ అనే పాత్రలో.

అయితే, నటనతోనే కాకుండా తన స్టోరీ సెలక్షన్‌తో కూడా రిత్విక్ స్మార్ట్ అనిపించుకుంటున్నాడు. కోయంబత్తూర్‌కు చెందిన రిత్విక్ జ్యోతి రాజ్ నటించిన అన్ని సినిమాలన్నీ దాదాపుగా బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ఆ సినిమాలన్నీ తెలుగులో కూడా ఉండటం విశేషం. రిత్విక్ నటించిన లక్కీ భాస్కర్ ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్టో తెలిసిందే.

జియో హాట్‌స్టార్ ఓటీటీలో

లక్కీ భాస్కర్ కంటే ముందు రిత్విక్ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ మూవీ ఓ2తో డెబ్యూ ఎంట్రీ ఇచ్చాడు. నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఓ2 జియో హాట్‌స్టార్ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్)లో తెలుగులో కూడా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఓటీటీలో బాగానే రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఓ2 తర్వాత రిత్విక్ వెండితెరపై కనిపించిన సినిమా సర్దార్. కార్తీ డ్యూయెల్ రోల్‌లో నటించిన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ మూవీలో టిమ్మీగా రిత్విక్ రాజ్ అలరించాడు. క్లైమాక్స్‌లో కార్తీతోపాటు రిత్విక్ సైతం ఆకట్టుకున్నాడు. దీని తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్‌తో రిత్విక్ నటించిన సినిమా జైలర్. ఈ మూవీ ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో తెలిసిందే.

జైలర్ సినిమాలో

జైలర్‌లో రజనీకాంత్ మనవడిగా యూట్యూబర్ రిత్విక్‌గా ఒరిజినల్ పేరుతో అలరించాడు ఈ బాలుడు. ఇక ముత్తయ్య మురళీ ధరన్ బయోపిక్‌గా తెరకెక్కిన సినిమా 800. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపకపోయిన నటీనటుల యాక్టింగ్‌కు గానూ ప్రశంసలు అందుకుంది. ఇందులో చిన్ననాటి ముత్తయ్య మురళీ ధరన్ పాత్రలో రిత్విక్ ఆకట్టుకున్నాడు.

ఇలా రిత్విక్ చేసిన దాదాపు సినిమాలన్ని బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. ముఖ్యంగా సర్దార్, జైలర్, లక్కీ భాస్కర్ 3 సినిమాలు రిత్విక్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచాయి. దీంతో రిత్విక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాడు. ఈ పిల్లాడి స్టోరీ సెలక్షన్ మాములుగా ఉండదంటూ సోషల్ మీడియాలో పలు మీమ్స్ కూడా వైరల్ అయ్యాయి.

యూట్యూబర్‌గా

సర్దార్, జైలర్ పాత్రల్లో తన నటనకు గాను పలు అవార్డ్స్ సైతం అందుకున్నాడు రిత్విక్ జ్యోతి రాజ్. 2021లో యూట్యూబర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన రిత్విక్ జ్యోతి రాజ్ ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలతో, కంటెంట్‌తో అలరించాడు. ఇప్పుడు బాల నటుడిగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు రిత్విక్ జ్యోతి రాజ్.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం