Thiruveer: వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్‌గా మారిన తిరువీర్ - ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో మసూద హీరో నెక్స్ట్ మూవీ!
Thiruveer: మసూద ఫేమ్ తిరువీర్ ప్రస్తుతం తెలుగులో ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, భగవంతుడుతో పాటు మరో మూవీ చేస్తోన్నాడు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోలో ఫొటోగ్రాఫర్ పాత్రలో నటిస్తున్నట్లు తీరువీర్ చెప్పాడు. భగవంతుడు మూవీ పొలిటికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో రూపొందుతోంది.

తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా వెర్సటైల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు తిరువీర్. మసూద, పరేషాన్ సినిమాలతో విజయాల్ని అందుకున్న తిరువీర్ వెరైటీ కాన్సెప్ట్‌లతో తదుపరి సినిమాలు చేయబోతున్నాడు. ప్రస్తుతం తెలుగులో తిరువీర్ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, భగవంతుడుతో పాటు మరో సినిమాలో నటిస్తోన్నాడు.
ఫొటోగ్రాఫర్‌గా...
ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీలో ఫొటోగ్రాఫర్ క్యారెక్టర్‌లో తిరువీర్ కనిపించబోతున్నాడు. ఈ సినిమా కాన్సెప్ట్‌తో పాటు తన క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయని తిరువీర్ అన్నాడు. “మొబైల్‌తో చాలాసార్లు ఫోటోలు తీశాను. కానీ ఇలా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌గా నటించడం చాలా కొత్తగా, ఛాలెంజింగ్‌గా అనిపిస్తోందని తిరువీర్ చెప్పాడు. ఫొటోగ్రాఫర్ క్యారెక్టర్ కోసం కెమెరా స్టిల్స్ ఎలా పెట్టించాలి? కెమెరాను ఎలా పట్టుకోవాలి? ఇలా చాలా విషయాల్లో ట్రైనింగ్ తీసుకున్నారు. కామెడీ, రొమాన్స్‌తో పాటు చిన్న మెసేజ్ కూడా ఈ మూవీలో ఉంటుందని” తెలిపాడు.
రెమ్యునరేషన్ లేకుండా...
ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ కోసం తీరువీర్ రెమ్యునరేషన్ తీసుకోలేదని సమాచారం. ఈ సినిమా నిర్మాణంలో అతడు కూడా ఓ భాగస్వామిగా వ్యవహరిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పలువురు స్టార్ హీరోలు రెమ్యునరేషన్ లేకుండా ఈ విధానంగానే సినిమాలు చేస్తోన్నారు. వారి బాటలో ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీతో తిరువీర్ అడుగులు వేయబోతున్నాడు. మూవీ స్టోరీ నచ్చడంతోనే అతడు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతోన్నారు.
కామెడీ డ్రామా...
ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ షూటింగ్ రీసెంట్‌గా అరకులో జరిగింది. కామెడీ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. టీనా శ్రావ్య, రోహన్ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఫరియా అబ్దుల్లా హీరోయిన్...
ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోతో పాటు పాటుగా భగవంతుడు అనే మరో మూవీ కూడా చేస్తోన్నాడు తిరువీర్.పీరియాడికల్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ నటుడు రిషి కీలక పాత్రలో నటిస్తోన్న ఈ మూవీకి గోపి జి దర్శకత్వం వహిస్తున్నాడు.
మసూద తర్వాత...
మసూద తర్వాత చాలా సెలెక్టివ్‌గా సినిమాల్ని, కథల్ని ఎంచుకుంటున్నట్లు తీరువీర్ చెప్పాడు. "నాకు సరిపోయే కథల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను స్టేజ్ ఆర్టిస్ట్‌ని కావడంతో ఆయా పాత్రలకు న్యాయం చేయగలుగుతున్నాను. దర్శకనిర్మాతలు నా కోసం పాత్రలు, కథలు రాస్తుండటం ఆనందంగా ఉంది. ఇదే ఓ నటుడికి గొప్ప విజయం’ అని అన్నారు.
బొమ్మలరామారంతో..
బొమ్మలరామారం మూవీతో యాక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు తిరువీర్, ఘాజీ, జార్జ్ రెడ్డి, పలాస 1978 సినిమాలతో నటుడిగా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. నాని టక్ జగదీష్‌లో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో కనిపించాడు.