OTT Family Drama Movie: నెలలోపే ఓటీటీలోకి సముద్రఖని ఫ్యామిలీ డ్రామా మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..-thiru manickam ott release date on zee5 platform where to watch samuthirakani family drama movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Family Drama Movie: నెలలోపే ఓటీటీలోకి సముద్రఖని ఫ్యామిలీ డ్రామా మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

OTT Family Drama Movie: నెలలోపే ఓటీటీలోకి సముద్రఖని ఫ్యామిలీ డ్రామా మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 21, 2025 02:21 PM IST

OTT Family Drama Movie: తిరు మాణికం చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ అధికారికంగా ఖరారైంది. సముద్రఖని నటించిన ఈ చిత్రం నెలలోగానే స్ట్రీమింగ్‍కు వస్తోంది.

OTT Family Drama Movie: నెలలోపే ఓటీటీలోకి సముద్రఖని ఫ్యామిలీ డ్రామా మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
OTT Family Drama Movie: నెలలోపే ఓటీటీలోకి సముద్రఖని ఫ్యామిలీ డ్రామా మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

తమిళ సీనియర్ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో తిరు మాణికం చిత్రం వచ్చింది. గత డిసెంబర్ 27వ తేదీన తమిళంలో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఈ ఫ్యామిలీ డ్రామా చిత్రానికి నందా పెరియస్వామి దర్శకత్వం వహించారు. తిరు మాణికం చిత్రం అనుకున్న దాని కంటే ముందే ఓటీటీలోకి వచ్చేయనుంది. స్ట్రీమింగ్ డేట్ ఆఫీషియల్‍గా వెల్లడైంది.

స్ట్రీమింగ్ డేట్ ఇదే

తిరు మాణికం సినిమా జనవరి 24వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని నేడు (జనవరి 21) ఆ ప్లాట్‍ఫామ్ వెల్లడించింది. తమిళ సినిమాల్లో అరుదైన వజ్రం లాంటి తిరు మాణికం చిత్రం జనవరి 24న స్ట్రీమింగ్‍కు వస్తుందంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తమిళంతో పాటు కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్‍కు రానుందని వెల్లడించింది.

తెలుగుపై నో క్లారిటీ!

తిరు మాణికం చిత్రం జనవరి 24న తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో వస్తుందని జీ5 వెల్లడించింది. అయితే, తెలుగు వెర్షన్‍పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మరి ఈ చిత్రానికి తెలుగు డబ్బింగ్ ఆడియో వస్తుందా లేదో చూడాలి.

తిరు మాణికం మూవీలో సముద్రఖనితో పాటు అనన్య, భారతీ రాజా, ఛామ్స్, తంబి రామయ్య, కరుణాకరన్, వాడివుకరాసి, ఇళవరసు, చిన్ని జయంత్, సునీల్ కుమార్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఫీల్ గుడ్ ఫ్యామిలీ మూవీని డైరక్టర్ నందా పెరియసామి తెరకెక్కించారు. ఈ చిత్రానికి ప్రశంసలు దక్కాయి.

తిరు మాణికం చిత్రాన్ని జీపీఆర్కే సినిమాస్ పతాకంపై రవికుమార్, గోపాలకృష్ణా రెడ్డి, రాజా సెంథిల్ నిర్మించారు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందించారు. ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి గణ ఎడిటింగ్ చేశారు.

తిరు మాణికం స్టోరీలైన్

కేరళ - తమిళనాడు సరిహద్దుల్లో ఉండే ఊరిలో మధ్య తరగతి వ్యక్తి మాణికం (సముద్రఖని) ఓ ల్యాటరీ షాప్ నడుపుతుంటాడు. అందరితో మంచిగా ఉంటాడు. కుటుంబంతో సంతోషంగా గడుపుతుంటాడు. ఆర్థిక కష్టాలు చాలా ఉన్నా ఆనందంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో ఆ లాటరీ షాప్‍లో కొన్ని టికెట్లను వృద్ధుడు ఎంపిక చేసుకుంటాడు. అయితే వెంట తీసుకెళ్లడు. అందులోని ఓ లాటరీ టికెట్‍కు రూ.1.5కోట్ల లాటరీ తగులుతుంది. కానీ ఆ వృద్ధుడు మాణికం దగ్గరికి రాడు. కానీ ఆ డబ్బు తాను తీసుకోకుండా ఆ వృద్ధుడికే తిరిగి ఇవ్వాలని అనుకుంటాడు. ఆ డబ్బు మనమే తీసుకుందామని మాణికం కుటుంబం వారిస్తుంది. మరోవైపు ఆర్థిక కష్టాలు ఉంటాయి. ఆ తర్వాత మాణికం చేశాడు.. ఏం జరిగిందనే అంశాల చుట్టూ తిరు మాణికం చిత్రంలో ఉంటాయి.

Whats_app_banner

సంబంధిత కథనం