Producers: ఒక్క సినిమాతో పోగొట్టుకున్న డబ్బంతా సంపాదించుకున్న నిర్మాతలు.. వారిలో ఓ స్టార్ హీరో కూడా ఉన్నాడు!
Producers Earned All Lost Money With One Movie: సినీ నిర్మాతలు సినిమాలతో కొన్నిసార్లు ఊహించని డబ్బు సంపాదిస్తే.. మరికొన్ని చిత్రాలతో ఉన్నదంతా పోగొట్టుకుంటారు. అయితే, అలా పోగొట్టుకున్న డబ్బంతా ఒకే ఒక్క సినిమాతో సంపాదించిన నిర్మాతలు ఉన్నారు. మరి వారెవరో ఇక్కడ తెలుసుకుందాం.
Producers Earned All Lost Money With One Movie: సినీ నిర్మాతలకు ఎప్పుడు లాభాలు వస్తాయో, నష్టాలు చవిచూస్తారో చెప్పలేం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించే సినిమాలు డిజాస్టర్స్‌గా మారితే.. చిన్న చిత్రాలు ఊహించని కలెక్షన్స్ రాబడతాయి. అలా, వరుస మూవీస్‌తో ఉన్నదంతా పోగొట్టుకున్న డబ్బునంతా ఒకే ఒక్క సినిమాతో సంపాదించిన నిర్మాతలు ఉన్నారు. వారిలో ఓ స్టార్ హీరో కూడా ఉండటం విశేషం. మరి ఆ నిర్మాతలు ఎవరు, వారు డబ్బు రాబట్టుకున్న సినిమా ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్ర నిర్మాతగా వెలుగొందారు ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి. మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సినిమాలే కాకుండా పలు టీవీ షోలతో కూడా చాలా పాపులర్ అయ్యారు. తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, అమ్మోరు వంటి సాలిడ్ అండ్ ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ హిట్స్ సినిమాలను నిర్మించిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి అంజి సినిమాతో నష్టాల్లో కూరుకుపోయారు.
2009లో వచ్చిన అరుంధతి మూవీ తర్వాత మళ్లీ ఏ సినిమాను ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించలేదు. అయితే, అంజి, అరుంధతి రెండు సినిమాలను ఒకే దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించడం విశేషం.
అశ్వనీదత్
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్‌లో సి అశ్వనీదత్ ఒకరు. గతేడాది ప్రభాస్‌తో కల్కి 2898 ఏడీ సినిమాను అశ్వనీదత్ నిర్మించిన విషయం తెలిసిందే. అయితే, వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో జగదేక వీరుడు అతిలోక సుందరి, ఇంద్ర, మహానటి, సీతారామం వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన అశ్వనీదత్ పలు ప్లాప్ మూవీస్ కూడా నిర్మించారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన శక్తి మూవీతో చాలా వరకు నష్టాలపాలయ్యారు సి అశ్వనీదత్. ఆ మూవీ తర్వాత ఎలాంటి సినిమా చేయడానికి ఆయన ఒప్పుకోలేదు. కానీ, ఆయన కుమార్తెలు ప్రియాంక దత్, స్వప్న దత్ కలిసి ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాను నిర్మించేందుకు చాలా కష్టపడి ఒప్పించారు.
18 కోట్ల కలెక్షన్స్
ఉన్న నష్టాల్లో ఇది ఒక నష్టం అనుకుని సుమారుగా రూ. 3 కోట్ల బడ్జెట్ పెట్టి ఎవడే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాను ప్రొడ్యూస్ చేశారు అశ్వనీదత్. అయితే, 2015లో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం బాక్సాఫీస్ వద్ద రూ. 18 కోట్ల కలెక్షన్స్ రాబట్టి అశ్వనీదత్‌నే ఆశ్చర్యపరిచింది. అనంతరం అశ్వనీదత్ తన కూతుళ్లతో కలిసి సినిమాలను నిర్మిస్తున్నారు.
కమల్ హాసన్
హీరోగా, నిర్మాతగా కమల్ హాసన్ చేసిన సినిమాలు ఒక సమయంలో వరుసగా ప్లాప్ అవుతూ వచ్చాయి. దాంతో కమల్ హాసన్ చాలా నష్టపోయారు. అప్పుడు 2022లో విడుదలైన విక్రమ్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా నాలుగేళ్ల తర్వాత సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చారు లోకనాయకుడు. ఒక్క విక్రమ్ సినిమాతో తన అప్పులన్నీ తీర్చేసినట్లు కమల్ హాసన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
సంబంధిత కథనం