OTT Movies: ఓటీటీలోకి రెండ్రోజుల్లో 15 సినిమాలు.. తెలుగులో 6.. వీకెండ్‌కి చూడాల్సిన బెస్ట్ మూవీస్ 4.. ఎందుకంటే?
OTT Movies Best To Watch This Weekend In Telugu: ఓటీటీలోకి రెండ్రోజుల్లో 15 సినిమాలకు పైగానే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అయితే, వాటిలో కేవలం ఆరు మాత్రమే తెలుగులో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అందులో కూడా ఈ వీకెండ్‌కు చూడాల్సిన బెస్ట్ నాలుగు సినిమాలు ఏంటీ, ఎందుకు అనేది ఇక్కడ తెలుసుకుందాం.
Best OTT Movies To Watch This Weekend Telugu: ఓటీటీలోకి ప్రతివారం సరికొత్త సినిమాలు, వెబ్ సిరీసులు దర్శనం ఇస్తూనే ఉంటాయి. అయితే, వీక్‌లో గురు, శుక్రవారాల్లో ఎక్కువ సినిమాలు ఓటీటీ రిలీజ్ అవుతుంటాయి. అలా గత నెలలో గురువారం (జనవరి 30), శుక్రవారం (జనవరి 31) రెండ్రోజుల్లో 15 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అవేంటో లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
పుష్ప 2 ది రూల్ (తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జనవరి 30
ది రిక్రూట్ సీజన్ 2 (ఇంగ్లీష్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జనవరి 30
ది స్నో గర్ల్ సీజన్ 2 (ఇంగ్లీష్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 31
లుక్కాస్ వరల్డ్ (హాలీవుడ్ ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ సినిమా)- జనవరి 31
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
యూ ఆర్ కోర్డియల్లీ ఇన్వైటెడ్ (ఇంగ్లీష్ కామెడీ చిత్రం)- జనవరి 30
ఫ్రైడే నైట్ లైట్స్ సీజన్ 5 (ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్) -జనవరి 30
బ్రీచ్- (హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- జనవరి 30
ధూం ధాం (తెలుగు రొమాంటిక్ సినిమా)- జనవరి 31
పోతుగడ్డ (తెలుగు రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- ఈటీవీ విన్ ఓటీటీ- జనవరి 30
కాఫీ విత్ ఏ కిల్లర్ (తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- ఆహా ఓటీటీ- జనవరి 31
ది సీక్రెట్స్ ఆఫ్ ది షిలేదార్స్ (తెలుగు డబ్బింగ్ హిందీ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ- జనవరి 31
ఐడెంటిటీ (తెలుగు డబ్బింగ్ మలయాళం క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జీ5 ఓటీటీ- జనవరి 31
పార్ట్‌నర్స్ (మలయాళ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- సైనా ప్లే ఓటీటీ- జనవరి 31
క్వీర్ (ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- ముబి ఓటీటీ- జనవరి 31
బ్యాడ్ జీనియస్ (హిందీ డబ్బింగ్ ఇంగ్లీష్ థ్రిల్లర్ మూవీ) లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- జనవరి 31
తెలుగులో 6
ఇలా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన 15లో పుష్ప 2 ది రూల్, ధూం, ధాం, పోతుగడ్డ, కాఫీ విత్ ఏ కిల్లర్, ఐడెంటిటీ ఐదు సినిమాలు, ఒక వెబ్ సిరీస్ ది సీక్రెట్స్ ఆఫ్ ది షెలేదార్స్‌తో కలిపి మొత్తం ఆరు తెలుగు భాషలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఈ వీకెండ్‌కు చూసేందుకు బెస్ట్ తెలుగు సినిమాలుగా నాలుగు మాత్రమే ఉన్నాయి.
ఒక్కో కారణం
అల్లు అర్జున్, రష్మిక మందన్నా నటించిన పుష్ప 2 మూవీకి రూ. 1800 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించి బన్నీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన హెబ్బా పటేల్ ధూం ధాం యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యే సినిమా. ట్విస్టులు, థ్రిల్లింగ్ సీన్స్‌తో ఇన్వెస్టిగేషన్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఆకట్టుకునే త్రిష, టొవినో థామస్ మలయాళ సినిమా ఐడెంటిటీ.
నిధుల నేపథ్యంలో
ఛత్రపతి శివాజీ నిధుల నేపథ్యంలో ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన వెబ్ సిరీస్ ది సీక్రెట్స్ ఆఫ్ ది షిలేదార్స్. ఈ మూడు సినిమాలు, ఒక వెబ్ సిరీస్‌తో టోటల్‌గా నాలుగు ఈ వీకెండ్‌కు చూసేందుకు బెస్ట్ టైమ్ పాస్ మూవీస్‌గా చెప్పుకోవచ్చు.
సంబంధిత కథనం