Telugu News  /  Entertainment  /  These Are The Ott And Theaters Release Movies For Dussehra 2022
దసరాకు ఓటీటీ, థియేటర్లలో విడుదలయ్యే సినిమాలివే
దసరాకు ఓటీటీ, థియేటర్లలో విడుదలయ్యే సినిమాలివే

OTT and Theater Releases for Dussehra 2022: ఈ దసరాకు రెట్టింపు వినోదం.. మీ ముంగిట అదిరిపోయే చిత్రాలు..!

30 September 2022, 20:18 ISTMaragani Govardhan
30 September 2022, 20:18 IST

Dussehra Special Movies: దసరా సందర్భంగా కుటుంబంతో కలిసి ఆనందంగా గడపడానికి అదిరిపోయే సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటిలో గాడ్‌ఫాదర్, ది ఘోస్ట్ లాంటి సినిమాలు ఉన్నాయి.

Dussehra 2022 Releases: దసరా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ దేశవ్యాప్తంగా అందరూ చేసుకునే పండుగల్లో అతి ముఖ్యమైంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఉల్లాసంగా జరుపుకునే ఈ పండుగ హడావిడి నవరాత్రలతో ఆరంభంతోనే మొదలవుతుంది. అందరూ కలిసి నాణ్యమైన సమయం గడపడానికి ఈ పండుగ అతి ముఖ్యమైంది. దసరా సందర్భంగా కుటుంబంతో కలిసి సరదాగా గడిపేందుకు బోలేడంత వినోదం కూడా ఈ సారి రానుంది. దసరా కానుకాగా ఈ సారి థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు చాలా సినిమాలు అందుబాటులో రానున్నాయి. ఇందులో మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్, నాగార్జున నటించిన ది ఘోస్ట్ లాంటి స్టార్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

గాడ్‌ఫాదర్..

మెగాస్టార్ చిరంజీవి నటించిన సరికొత్త చిత్రం గాడ్‌ఫాదర్. ఇందులో బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబరు 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నయనతార ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది సత్యదేవ్ కూడా ముఖ్యమైన క్యారెక్టర్ చేశారు. నిరవ్ షా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తోన్న ఈ సినిమాలో టాప్ క్లాస్ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. తమన్ సంగీత సారథ్యం వహిస్తుండగా.. సురేశ్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , కొణిదెల ప్రొడక్షన్స్ పతాకాలపై ఆర్బీ చైదురీ, ఎన్వీ ప్రసాద్, సురేఖ కొణిదెల నిర్మిస్తున్నారు.

ది ఘోస్ట్..

ఈ ఏడాది ఇప్పటికే బంగార్రాజు చిత్రంతో మంచి హిట్ అందుకున్న కింగ్ నాగార్జున.. తాజాగా మరో సరికొత్త కథతో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నాడు. అదే ది ఘోస్ట్ చిత్రం. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబరు 5న థియేటర్లలో సందడి చేయనుంది. ఇందులో నాగ్ సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా చేస్తోంది. ఇంటర్ పోల్ ఆఫీసర్లుగా వీరిద్దరూ కనిపించనున్నారు. ఓ మెషిన్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని తెలుస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై సోనాలి నారంగ్, పుశ్కర్ రామ్ మోహనరావు, శరత్ మారార్ నిర్మిస్తున్నారు.

స్వాతిముత్యం..

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేశ్ మరో కుమారుడు బెల్లంకొండ గణేశ్ అరంగేట్రం చేస్తున్న సినిమా స్వాతిముత్యం. సితార బ్యానర్‌తో కలిసి త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గణేశ్‌ సరసన వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా చేస్తోంది. దసరా కానుకగా అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. రెండు స్టార్ హీరోల నడుమ ఈ చిన్న హీరో ఏ మేరకు అలరిస్తాడో వేచిచూడాలి.

గుడ్‌బై..

తెలుగు సినిమాలతో పాటు కొన్ని హిందీ చిత్రాలు కూడా ఈ దసరాకు బాక్సాఫీస్ ముందు సందడి చేయనుంది. నేషనల్ క్రష్ రష్మికా మందన్నా, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం గుడ్ బై. వికాస్ బాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఏక్తా కపూర్, శోభా కపూర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబరు 7వ తేదీని రాబోతుంది.

హిందుత్వ..

ఆశీశ్ శర్మ దర్శకత్వం వహించిన చిత్రం హిందుత్వ. ఈ సినిమా అక్టోబరు 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కరన్ రజ్దాన్, సోనారిక భాండోరియా, అనుప్ జలోతా, అంకిత్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఓటీటీ వేదికగా విడుదలయ్యే చిత్రాలు..

కార్తికేయ-2..

నిఖిల్ సిద్ధార్థ హీరోగా రూపొందిన చిత్రం కార్తికేయ. చందుమొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వందకోట్ల పైచిలుకు వసూళ్లుతో బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం జీ5 వేదికగా అక్టోబరు 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేసింది. ఇందులో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా కీలక పాత్రలో నటించారు. కాలభైరవ సంగీతాన్ని సమకూర్చారు.

బింబిసార..

కల్యాణ్ రామ్ హీరోగా రూపొందిన చిత్రం బింబిసార. ఆగస్టులో విడుదలైన ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. సోషియో ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో కేథరిన్ థెరిసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా చేశారు. చింతరామన్ భట్ ఈ చిత్రానికి పాటలు అందించగా.. ఎంఎం కీరవాణి నేపథ్య సంగీతాన్ని సమకూర్చారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తూ నటించారు. మల్లిడి వశిష్ట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇది కూడా జీ5 వేదికగా అక్టోబరు 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

మజా మా..

మాధురీ దీక్షిత్ ప్రధాన పాత్రను పోషించిన ఈ బాలీవుడ్ చిత్రంలో అక్టోబరు 6న అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది ఈ చిత్రానికి ఆనంద్ తివారీ దర్శకత్వం వహించారు. రిత్విక్ భౌమిక్, శివ చడ్డా కీలక పాత్రలు పోషించారు.

ప్రే..

ప్రిడేటర్ ఫ్రాంఛైజీలో రానున్న ఐదో సిరీస్ ప్రే. ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా దసరా కానుకగా అక్టోబరు 7న విడుదల కానుంది. ఈ బాలీవుడ్ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. దీంతో ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.