Vishwak Sen: విశ్వక్ సేన్ ఇంట్లో దొంగతనం.. 20 నిమిషాల్లోనే పూర్తి.. నేరుగా సోదరి రూమ్‌లోకి వెళ్లి బంగారు ఆభరణాలు మాయం!-theft occurred in vishwak sen home at film nagar and gold jewelry lost hero father karate raju give complaint to police ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vishwak Sen: విశ్వక్ సేన్ ఇంట్లో దొంగతనం.. 20 నిమిషాల్లోనే పూర్తి.. నేరుగా సోదరి రూమ్‌లోకి వెళ్లి బంగారు ఆభరణాలు మాయం!

Vishwak Sen: విశ్వక్ సేన్ ఇంట్లో దొంగతనం.. 20 నిమిషాల్లోనే పూర్తి.. నేరుగా సోదరి రూమ్‌లోకి వెళ్లి బంగారు ఆభరణాలు మాయం!

Sanjiv Kumar HT Telugu

Theft In Vishwak Sen Home Gold Jewelry Gone: హీరో విశ్వక్ సేన్ ఇంట్లో చోరీ జరిగింది. హైదరాబాద్ ఫిలింనగర్‌లో ఉన్న హీరో నివాసంలోకి ఆదివారం (మార్చి 16) తెల్లవారు ఓ దుండగుడు చొరబడ్డాడు. చేతికందిన సొత్తు దోచుకుని పరారయ్యాడు. దీంతో విశ్వక్ సేన్ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

విశ్వక్ సేన్ ఇంట్లో దొంగతనం.. 20 నిమిషాల్లోనే పూర్తి.. నేరుగా సోదరి రూమ్‌లోకి వెళ్లి బంగారు ఆభరణాలు మాయం!

Theft In Vishwak Sen Home Gold Jewelry Gone: మాస్ కా దాస్, టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో ఆదివారం (మార్చి 16) తెల్లవారు జామున భారీ దొంగతనం జరిగింది. హైదరాబాద్ ఫిలింనగర్‌ రోడ్డు నెంబర్‌- 8లోని విశ్వక్ సేన్ ఇంట్లోకి చొరబడిన ఓ దుండగుడు చేతికందిన సొత్తను తీసుకుని పరారయ్యాడు.

దుండగుడి కోసం గాలింపు చర్యలు

తమ ఇంట్లో చోరీ జరిగినట్టు విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు ఫిలింనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దుండగుడి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. కాగా విశ్వక్ సేన్ కుటుంబమంతా ఒకే ఇంట్లో ఉంటోంది. విశ్వక్ సేన్ సోదరి వన్మయి బెడ్ రూమ్ మూడో అంతస్తులో ఉంటుంది.

బంగారు ఆభరణాలు మాయం

అయితే ఆదివారం తెల్లవారుజామున వన్మయి గదిలో వస్తువులన్ని చిందరవందరగా పడి ఉన్నాయి. అనుమానం వచ్చిన ఆమె రూమ్‌లోని ఆల్మారాలను పరిశీలించింది. కానీ, అక్కడ ఉండాల్సిన బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. దీంతో దొంగతనం జరిగినట్లు గుర్తించిన వన్మయి ఈ విషయాన్ని తండ్రి దృష్టికి తీసుకెళ్లింది. ఆయన వెంటనే ఫిలింనగర్‌ పోలీసులకు సమాచారం అందించారు.

సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి

కరాటే రాజు ఫిర్యాదుతో పోలీసులు వెంటనే ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. క్లూస్‌ టీం సహాయంతో ప్రాథమిక ఆధారాలు, వేలిముద్రలు సేకరించారు. అనంతరం ఇంటి పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. తెల్లవారుజామున 5.50 నిమిషాల ప్రాంతంలో.. ఒక గుర్తుతెలియని వ్యక్తి బైక్‌ మీద వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు.

బంగారు ఆభరణాల విలువ ఎంత?

సదరు వ్యక్తి విశ్వక్ సేన్ ఇంటి గేటు తీసుకుని డైరెక్టుగా మూడో అంతస్తుకు వెళ్లాడని, వెనుక డోర్‌ నుంచి విశ్వక్ సేన్ సోదరి వన్మయి బెడ్‌రూంలోకి వెళ్లి.. అల్మరాలో నుంచి బంగారు ఆభరణాలు చోరీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇదంతా కేవలం 20 నిమిషాల్లోనే జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. చోరీకి గురైన బంగారు ఆభరణాల విలువ ఎంతనేది తెలియాల్సి ఉంది.

లేడి గెటప్‌తో కొత్త ప్రయోగం

ఇదిలా ఉంటే, హీరోగా, డైరెక్టర్‌గా తెలుగు సినీ ఇండస్ట్రీలో అలరిస్తున్నాడు విశ్వక్ సేన్. ఇటీవలే లైలా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో లేడి గెటప్ వేసుకుని కొత్త ప్రయోగం చేశాడు విశ్వక్ సేన్. అయితే, లైలా మూవీ మాత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌గా నిలిచింది. విశ్వక్ సేన్ లేడి గెటప్, యాక్టింగ్ బాగున్నప్పటికీ రొటీన్ కాన్సెప్ట్ అని, టేకింగ్ అంతగా బాగోలేదని రివ్యూస్ వచ్చాయి.

నెల రోజులు కాకుండానే

రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన లైలా మూవీ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైంది. ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా సందడి చేసిన లైలా మూవీ నెల రోజులు పూర్తి కాకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో లైలా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం