Crime Drama OTT: ఓటీటీలోకి ట్విస్ట్‌ల‌తో వ‌ణికించే కోలీవుడ్ క్రైమ్ డ్రామా మూవీ - ఎందులో చూడాలంటే?-the smile man ott release date when and where to watch sarath kumar tamil crime drama thriller movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Crime Drama Ott: ఓటీటీలోకి ట్విస్ట్‌ల‌తో వ‌ణికించే కోలీవుడ్ క్రైమ్ డ్రామా మూవీ - ఎందులో చూడాలంటే?

Crime Drama OTT: ఓటీటీలోకి ట్విస్ట్‌ల‌తో వ‌ణికించే కోలీవుడ్ క్రైమ్ డ్రామా మూవీ - ఎందులో చూడాలంటే?

Nelki Naresh Kumar HT Telugu
Jan 18, 2025 02:23 PM IST

Crime Drama OTT: శ‌ర‌త్ కుమార్ హీరోగా న‌టించిన కోలీవుడ్ మూవీ ది స్మైల్ మ్యాన్ ఓటీటీలోకి వ‌చ్చేది ఎప్పుడ‌న్న‌ది క్లారిటీ వ‌చ్చింది. క్రైమ్ డ్రామా థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమా ఆహా త‌మిళ్ ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు శ్యామ్ ప్ర‌వీణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

క్రైమ్ డ్రామా ఓటీటీ
క్రైమ్ డ్రామా ఓటీటీ

Crime Drama OTT: శ‌ర‌త్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన త‌మిళ మూవీ ది స్మైల్ మ్యాన్ ఓటీటీ రిలీజ్ డేట్ క‌న్ఫామ్ అయ్యింది. క్రైమ్ డ్రామా థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు శ్యామ్ ప్ర‌వీణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ కోలీవుడ్ మూవీలో శ‌ర‌త్‌కుమార్‌తో పాటు ఇనియా, సిజా రోజ్‌, జార్జ్ మ‌రియ‌మ్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు.

నెల రోజుల్లోపే...

డిసెంబ‌ర్ నెలాఖ‌రున త‌మిళంలో థియేట‌ర్ల‌లో రిలీజైన ది స్మైల్ మ్యాన్ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. తాజాగా థియేట‌ర్ల‌లో రిలీజై నెల రోజులు కూడా కాక ముందే ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఓటీటీలోకి వ‌స్తోంది. ది స్మైల్ మ్యాన్ డిజిట‌ల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఆహా ఓటీటీ సొంతం చేసుకున్న‌ది. జ‌న‌వ‌రి 24న ఈ మూవీ విడుద‌ల కాబోతోంది.

సీరియ‌ల్ కిల్ల‌ర్‌...

ఓ సీరియ‌ల్ కిల్ల‌ర్‌ను అల్జీమ‌ర్స్‌తో బాధ‌ప‌డుతోన్న రిటైర్డ్ పోలీస్ ఆఫీస‌ర్ ఎలా ప‌ట్టుకున్నాడ‌నే పాయింట్‌తో డైరెక్ట‌ర్ ఈ మూవీని తెర‌కెక్కించాడు. , ట్విస్ట్‌ల‌తో పాటు శ‌ర‌త్‌కుమార్ యాక్టింగ్ బాగున్నా స్టోరీ, స్క్రీన్‌ప్లేలో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డంతో ది స్మైల్ మ్యాన్‌ మూవీ ఆశించిన స్థాయిలో విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది.

సీరియ‌ల్ కిల్ల‌ర్ క‌థ‌తో...

ఇన్వేస్టిగేటివ్ పోలీస్ ఆఫీస‌ర్‌గా చిదంబ‌రానికి (శ‌ర‌త్ కుమార్‌) డిపార్ట్‌మెంట్‌లో మంచి పేరు ఉంటుంది. ఎన్నో క్లిష్ట‌మైన కేసుల‌ను ఈజీగా సాల్వ్ చేస్తాడు. అల్జీమ‌ర్స్ వ్యాధి కార‌ణంగా అత‌డి జీవితం పూర్తిగా త‌ల‌కిందుల‌వుతుంది. గ‌తం మొత్తం మ‌ర్చిపోయే ప‌రిస్థితి నెల‌కొంటుంది.

అలాంటి టైమ్‌లోనే స్మైల్ మ్యాన్ పేరుతో ఓ సీరియ‌ల్ కిల్ల‌ర్ సిటీలో వ‌రుస హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతుంటాడు. అత‌డి ప‌ట్టుకోవ‌డం పోలీసుల‌కు ఛాలెంజింగ్‌గా మారుతుంది. ఈ సీరియ‌ల్ కిల్ల‌ర్‌ను ప‌ట్టుకోవ‌డానికి చిదంబ‌రం ఎందుకు రంగంలోకి దిగాల్సివ‌చ్చింది? అల్జీమ‌ర్స్ స‌మ‌స్య‌ను అధిగ‌మిస్తూ ఆ కిల్ల‌ర్‌ను చిదంబ‌రం ప‌ట్టుకున్నాడా? లేదా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

150వ సినిమా

యాక్ట‌ర్‌గా శ‌ర‌త్ కుమార్ 150వ సినిమా ఇది. ది స్మైల్ మ్యాన్ మూవీకి గ‌వాస్క‌ర్ అవినాష్ మ్యూజిక్ అందించాడు. ఈ క్రైమ్ డ్రామా మూవీ ఐదు కోట్ల‌కుపైనే క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టిన‌ట్లు స‌మాచారం. గ‌త ఏడాది త‌మిళంలో నాలుగు సినిమాలు చేశాడు. జ‌ర్నీ వెబ్‌సిరీస్‌లో న‌టించాడు. ప్ర‌స్తుతం తెలుగులో మంచు విష్ణు క‌న్న‌ప్ప మూవీలో శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు.

Whats_app_banner