OTT Review: ఓటీటీ రివ్యూ.. రక్తపాతం, హింస, సెమీ న్యూడ్ సీన్స్.. 10 దేశాల్లో బ్యాన్ అయిన ఓటీటీ మూవీ ఎలా ఉందంటే?-the shadow strays review in telugu netflix ott release banned action thriller movie the shadow strays explained telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Review: ఓటీటీ రివ్యూ.. రక్తపాతం, హింస, సెమీ న్యూడ్ సీన్స్.. 10 దేశాల్లో బ్యాన్ అయిన ఓటీటీ మూవీ ఎలా ఉందంటే?

OTT Review: ఓటీటీ రివ్యూ.. రక్తపాతం, హింస, సెమీ న్యూడ్ సీన్స్.. 10 దేశాల్లో బ్యాన్ అయిన ఓటీటీ మూవీ ఎలా ఉందంటే?

Sanjiv Kumar HT Telugu

OTT Movie The Shadow Strays Review In Telugu: ఓటీటీలో మోస్ట్ వయోలెంట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ది షాడో స్ట్రేస్ స్ట్రీమింగ్‌కు వచ్చిన తొలి నాళ్లలో ట్రెండింగ్‌లో దూసుకుపోయింది. ఏకంగా పది దేశాలు బ్యాన్ చేసిన ఈ ఓటీటీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందో ది షాడో స్ట్రేస్ రివ్యూలో తెలుసుకుందాం.

ఓటీటీ రివ్యూ.. రక్తపాతం, హింస, సెమీ న్యూడ్ సీన్స్.. 10 దేశాల్లో బ్యాన్ అయిన ఓటీటీ మూవీ ఎలా ఉందంటే?

OTT Movie The Shadow Strays Review Telugu: ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చిన మోస్ట్ వయోలెంట్ క్రైమ్ యాక్షన్ సినిమా ది షాడో స్ట్రేస్. ఇందులోని హింస, రక్తపాతం ఏమాత్రం తట్టుకోలేనివిధంగా ఉంటుంది. అందుకే ఏకంగా 10 దేశాలు ఈ సినిమాను బ్యాన్ చేసేశాయి. కానీ, నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలోకి వచ్చిన తర్వాత అంతకుమించి 85 దేశాల్లో ది షాడో స్ట్రేస్ ట్రెండింగ్‌లో నిలిచి సత్తా చాటింది.

91 శాతం ఫ్రెష్ కంటెంట్

రక్తపాతం, ఊహించని వయోలెంట్ యాక్షన్ సీన్లతో ది షాడో స్ట్రేస్ సినిమాను టిమో త్జాజాంటో తెరకెక్కించారు. 10కి 6.5 ఐఎమ్‌డీబీ రేటింగ్, రొటెన్ టొమోటోస్ నుంచి 91 శాతం ఫ్రెష్ కంటెంట్‌గా నిలిచిన ది షాడో స్ట్రేస్ సినిమాలో అరోరా రిబేరో మెయిన్ లీడ్ రోల్ చేసింది.

ఇంకా హనా ప్రినాంటినా, టస్క్య నమ్యా, ఆండ్రీ మషాది, ఆగ్రా పిలైంగ్, క్రిస్టో ఇమ్మాన్యూయెల్, అలీ ఫిక్రీ, అదిపతి డొల్కెన్, జెసీకా మర్లెన్ కీలక పాత్రలు పోషించారు. జాన్ విక్, కిల్, మార్కో సినిమాలకు మంచిన రక్తపాతం, వయోలెన్స్ ఉన్న ఈ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందో నేటి ది షాడో స్ట్రేస్ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

13 (అరోరా రిబేరో) ఒక షాడో సంస్థలో 17 ఏళ్ల టీనేజ్ కాంట్రాక్ట్ కిల్లర్. ఇచ్చిన టార్గెట్‌ను చంపి వచ్చే కిరాయి హంతకురాలు. ఓ మిషన్‌లో టార్గెట్‌ను చంపిన కూడా ఓ కారణంగా పూర్తిగా సక్సెస్ కాలేకపోతుంది. ఆ మిషన్ నుంచి 13ను తన ఇన్‌స్ట్రక్టర్ ఉంబ్రా (హనా ప్రినాంటినా) కాపాడి బయటకు తీసుకొస్తుంది. తర్వాత 13ను రెస్ట్ తీసుకోమంటుంది ఉంబ్రా. రెండు వారాలు గడుస్తాయి. కానీ, 13కి ఎలాంటి మిషన్ రాదు. దాంతో విపరీతమైన కోపం తెచ్చుకుంటుంది.

ఈ క్రమంలోనే తన పక్కింట్లో ఉండే పదేళ్ల మోంజీ అలీ (ఫిక్రీ) తల్లి మిరాస్తీ (జెసీకా మర్లెన్)ని కొంతమంది చంపుతారు. తర్వాత మోంజోతో రెండు రోజులు ట్రావెల్ చేసిన 13కి బాగా స్నేహం ఏర్పడుతుంది. ఇంతలో మోంజీ కనిపించకుండా పోతాడు. మోంజీ తల్లిని చంపిన వాళ్లే ఎత్తుకెళ్లి ఉంటారని అనుమానించిన 13 అతనికోసం వెతికే పని పెట్టుకుంటుంది.

ట్విస్టులు

మరి మోంజీని ప్రాణాలతో 13 కాపాడగలిగిందా? మోంజీని ఎవరు కిడ్నాప్ చేశారు? వారికి మోంజీకి సంబంధం ఏంటీ? వారికి ఉన్న నేపథ్యం ఏంటీ? అసలు 13 పేరు ఏంటీ? 13 జపాన్ ఆపరేషన్‌లో ఎందుకు సక్సెస్ కాలేకపోయింది? షాడో సంస్థ ఏంటీ? వంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ తెలియాలంటే? ది షాడో స్ట్రేస్ చూడాల్సిందే.

విశ్లేషణ:

తట్టుకోలేనంత, ఊహించలేనంత అత్యంత కిరాతకమైన యాక్షన్ సీన్స్, రక్తపాతం, హింస ఉన్న సినిమా కావాలనుకునేవారు ది షాడో స్ట్రేస్‌ను కచ్చితంగా ట్రై చేయొచ్చు. కథ పెద్దగా ఏముండదు. 17 ఏళ్ల టీనేజ్ కాంట్రాక్ట్ కిల్లర్‌కు తన మిషన్ తర్వాత ఓ పదేళ్ల అబ్బాయితో స్నేహం ఏర్పడుతుంది. అతని కిడ్నాప్ అయ్యాడని తెలుసుకుని కాపాడేందుకు ఓ పెద్ద ముఠాకే ఎదురెళ్లుతుంది. మరి ఆ పిల్లాడని కాపాడిందా లేదా అనేదే కథ.

అదిరిపోయే యాక్షన్ సీన్స్

కథ ఎలా ఉన్నా డిఫరెంట్ యాక్షన్ సీన్స్, కొన్ని ట్విస్టులు బాగుంటాయి. చివరి అరగంట ముందే క్లైమాక్స్ అయిపోయిందనుకుంటాం. కానీ, ఆ తర్వాత వచ్చే యాక్షన్ ఎపిసోడ్ కూడా అదిరిపోతుంది. మొదటి నుంచి క్లైమాక్స్ వరకు యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. అయితే, రక్తపాతం, హింస మరి దారుణంగా ఉంటుంది. కొన్నిసార్లు తట్టుకోలేనంతగా, చూడలేనంతగా సీన్స్ కంపోజ్ చేశారు.

అక్కడక్కడ కాస్తా అడల్ట్ కంటెంట్, శృంగార సీన్ ఉంది. అయితే, అబ్బాయిలు మాత్రమే సెమీ న్యూడ్, బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తారు. డ్రగ్స్, క్రైమ్, చిన్నపిల్లలపై హింస విపరీతంగా చూపించారు. సున్నితమనస్కులు చూడటం కష్టమే. బీజీఎమ్ ఓకే ఓకే అనేలా ఉంది. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా పర్లేదు. సీక్వెల్ ఉన్నట్లుగా హింట్ ఇచ్చారు. సినిమాకు మెయిన్ ప్లస్ యాక్షన్ కొరియోగ్రఫీనే. చాలా బాగా డిజైన్ చేశారు. చూసిన యాక్షన్ సీన్స్ మళ్లీ రిపీట్ అవ్వవు. కొత్తగా ఉంటాయి.

ఫైనల్‌గా చెప్పాలంటే?

ఇక ప్రతి ఒక్కరు యాక్షన్ సీన్స్‌లో ఇరగదీశారు. అరోరా రిబేరో పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది. కోపం, ఆప్యాయత, బ్రూటాలిటీ బాగా చూపించింది. ఫైనల్‌గా చెప్పాలంటే నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న రెండున్నర గంటల ది షాడో స్ట్రేస్ పక్కా యాక్షన్ థ్రిల్లర్స్ ఎంజాయ్ చేసేవారికి మాత్రమే. మార్కో, కిల్ ఇష్టపడినవారికి ఈ మూవీ కూడా నచ్చొచ్చు.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం