OTT Ban Movie: ఓటీటీలోకి 10 దేశాల్లో బ్యాన్ అయిన మూవీ స్ట్రీమింగ్- అదిరిపోయే యాక్షన్, రక్తపాతం- ఇక్కడ మాత్రమే చూసేయండి!-the shadow strays ott streaming on netflix that banned in 10 countries for violence and top 10 trending in 85 countries ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Ban Movie: ఓటీటీలోకి 10 దేశాల్లో బ్యాన్ అయిన మూవీ స్ట్రీమింగ్- అదిరిపోయే యాక్షన్, రక్తపాతం- ఇక్కడ మాత్రమే చూసేయండి!

OTT Ban Movie: ఓటీటీలోకి 10 దేశాల్లో బ్యాన్ అయిన మూవీ స్ట్రీమింగ్- అదిరిపోయే యాక్షన్, రక్తపాతం- ఇక్కడ మాత్రమే చూసేయండి!

Sanjiv Kumar HT Telugu
Jan 06, 2025 12:56 PM IST

The Shadow Strays OTT Streaming: ఓటీటీలో ఏకంగా పది దేశాల్లో బ్యాన్ అయిన ది షాడో స్ట్రేస్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను 10 దేశాల్లో బ్యాన్ చేయడానికి గల కారణాలు, ది షాడో స్ట్రేస్‌ను ఏ ఓటీటీలో చూడొచ్చు అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలోకి 10 దేశాల్లో బ్యాన్ అయిన మూవీ స్ట్రీమింగ్- అదిరిపోయే యాక్షన్, రక్తపాతం- ఇక్కడ మాత్రమే చూసేయండి!
ఓటీటీలోకి 10 దేశాల్లో బ్యాన్ అయిన మూవీ స్ట్రీమింగ్- అదిరిపోయే యాక్షన్, రక్తపాతం- ఇక్కడ మాత్రమే చూసేయండి!

The Shadow Strays OTT Release: అప్పుడప్పుడు కొన్ని సినిమాలు నిషేధానికి గురి అవుతుంటాయి. అందులో ఉండే సన్నివేశాలు, వాడే డైలాగ్స్ అభ్యంతరకరంగా ఉండటం, లేదా పరిమితికి మించిన అశ్లీలత వంటి పలు కారణాలు సినిమాల బ్యాన్‌‌కు కారణాలు అవుతుంటాయి. అలానే ఓ సినిమా దాదాపుగా 10 దేశాల్లో బ్యాన్ అయింది.

yearly horoscope entry point

బీభత్సమైన వయెలెన్స్

అలా పది దేశాల్లో బ్యాన్ అయిన మూవీ ఇప్పుడు ఒకే ఒక్క ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దాన్ని ఇండియాలో కూడా చూడొచ్చు. ఆ సినిమానే ది షాడో స్ట్రేస్. ఇది ఒక లేడి ఒరియెంటెడ్ క్రైమ్ యాక్షన్ ఫిల్మ్. పేరుకు లేడి ఒరియెంటెడ్ సినిమా అయిన వయెలెన్స్ మాత్రం బీభత్సంగా ఉంటుంది. మోస్ట్ వయెలెంట్ సినిమాలు అయిన యానిమల్, కిల్, జాన్ విక్‌కు మించి ది షాడో స్ట్రేస్ ఉంటుంది.

6.5 రేటింగ్-91 శాతం ఫ్రెష్ కంటెంట్

ఇండోనేషియన్ భాషలో తెరకెక్కిన ది షాడో స్ట్రేస్ సినిమాలో అరోరా రిబెరో, హనా మాలసన్, టస్క్య నమ్యా, ఆండ్రీ మషాది, ఆగ్రా పిలైంగ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను టిమో త్జాజాంటో దర్శకత్వంతోపాటు నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి 6.5 రేటింగ్ రాగా.. మూవీ ఎంత ఫ్రెష్‌గా ఉందో చెప్పే వెబ్‌సైట్ రొట్టెన్ టొమాటోస్ ఏకంగా 91 శాతం ఇచ్చింది.

అంటే, ది షాడో స్ట్రేస్ సినిమాలోని కంటెంట్ ఎంత ఫ్రెష్‌గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మోస్ట్ వయెలెంట్ మూవీ కాబట్టే ఈ సినిమాను పది దేశాలు బ్యాన్ చేశాయి. అంతల ఇందులో ఉండే సీన్స్ ఒల్లు గగుర్పొడిచేలా ఉంటాయి. జాన్ విక్, యానిమల్, కిల్, మార్కో వంటి సినిమాల్లో వయెలెన్స్, రక్తపాతం ఉన్నప్పటికీ ఇంతలా నిషేధానికి గురి కాలేదు.

డైరెక్ట్ ఓటీటీ రిలీజ్

మూవీలో ఎంతో రక్తపాతం ఉంటే తప్పా ఇంతలా బ్యాన్ కాదు. పలు దేశాలు హింస, రక్తపాతంను ఏమాత్రం సమర్థించవు. అలాంటి దేశాలు ది షాడో స్ట్రేస్ మూవీలాంటి వయెలెంట్ సినిమాలను బ్యాన్ చేస్తాయి. అందుకే ది షాడో స్ట్రేస్ మూవీ కూడా బ్యాన్‌కు గురైంది. అందుకే ది షాడో స్ట్రేస్ మూవీని డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేశారు.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో

ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ది షాడో స్ట్రేస్ డైరెక్ట్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. 2024 అక్టోబర్ 17 నుంచి ఇండోనేషయన్‌తోపాటు ఇంగ్లీష్ భాషల్లో ఇండియాలో ది షాడో స్టేస్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. అయితే, రెండున్నర గంటల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాను మొదట గతేడాది సెప్టెంబర్‌లో రిలీజ్ చేశారు. ఆ వెంటనే ఈ సినిమా బ్యాన్‌కు గురి అయింది.

85 దేశాల్లో ట్రెండింగ్

ఓటీటీ రిలీజ్‌ అయిన తర్వాత ది షాడో స్ట్రేస్ మూవీ ఏకంగా 85 దేశాల్లో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్ లిస్ట్‌లో చేరింది. పది దేశాల్లో బ్యాన్‌కు గురి అయిన ది షాడో స్ట్రేస్ మూవీ అవి కాకుండా 83 దేశాల్లో టాప్ 10 ఓటీటీ ట్రెండింగ్ సినిమాల్లోకి రావడం విశేషం.

Whats_app_banner