ఓటీటీలో డిఫరెంట్ హారర్ థ్రిల్లర్.. మగాళ్లను ట్రాప్ చేసి ప్రెగ్నెంట్ చేసేలా స్కెచ్.. తెలుగుతోపాటు 4 భాషల్లో స్ట్రీమింగ్!-the seeding ott streaming on amazon prime in 4 languages ott horror thriller the seeding review telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలో డిఫరెంట్ హారర్ థ్రిల్లర్.. మగాళ్లను ట్రాప్ చేసి ప్రెగ్నెంట్ చేసేలా స్కెచ్.. తెలుగుతోపాటు 4 భాషల్లో స్ట్రీమింగ్!

ఓటీటీలో డిఫరెంట్ హారర్ థ్రిల్లర్.. మగాళ్లను ట్రాప్ చేసి ప్రెగ్నెంట్ చేసేలా స్కెచ్.. తెలుగుతోపాటు 4 భాషల్లో స్ట్రీమింగ్!

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలో ఓ డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ మూవీ ది సీడింగ్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు నాలుగు భాషల్లో ది సీడింగ్ ఓటీటీ రిలీజ్ అయింది. మగాళ్లను ఓ లోయలో ట్రాప్ చేసి వారితో అమ్మాయిలు ప్రెగ్నెంట్ అయ్యేలా చేస్తారు. మరి ఈ ది సీడింగ్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలో డిఫరెంట్ హారర్ థ్రిల్లర్.. మగాళ్లను ట్రాప్ చేసి ప్రెగ్నెంట్ చేసేలా స్కెచ్.. తెలుగుతోపాటు 4 భాషల్లో స్ట్రీమింగ్!

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు విభిన్నమైన జోనర్స్, డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతూ అలరిస్తుంటాయి. ముఖ్యంగా ఓటీటీ ప్రియులకు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లలో వచ్చే కంటెంట్ అమితంగా ఆకట్టుకుంటోంది. ఇక హారర్ థ్రిల్లర్స్‌కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు.

ఓటీటీ హారర్ థ్రిల్లర్

హారర్ ఎలిమెంట్స్‌తో ఒక డిఫరెంట్ స్టోరీని ఎంగేజింగ్‌గా చూపిస్తే ఓటీటీ ఆడియెన్స్ అతుక్కుపోతారు. అలాంటి ఓటీటీ హారర్ థ్రిల్లర్ మూవీనే ది సీడింగ్. ఓ ఎడారిలో ఒక ఫొటోగ్రాఫర్ ఫొటోలు తీస్తూ ఉంటాడు. అతనికి ఒక పిల్లాడు కనిపిస్తాడు. అతని దగ్గరికి ఫొటోగ్రాఫర్ వెళ్లగా తన తల్లిదండ్రులు తప్పిపోయారని ఆ పిల్లాడు చెబుతాడు.

అందమైన మహిళ

దాంతో ఆ పిల్లాడిని వెంటబెట్టుకుని ఫొటోగ్రాఫర్ కొంతదూరం వెళ్తాడు. అప్పుడు ఆ ఫొటోగ్రాఫర్ దారి తప్పిపోతాడు. ఆ పిల్లాడు కూడా కనిపించడు. ఇక రాత్రి అయి చీకటి పడటంతో ఓ లోయలో పడిపోతాడు ఫొటోగ్రాఫర్. ఆ లోయలో ఓ అందమైన మహిళ కూడా జీవిస్తు ఉంటుంది. వీరికి కొండపై నుంచి కొంతమంది ఆహారం విసిరేస్తుంటారు.

శారీరకంగా ఒక్కటై

అదంతా మొదట్లో అర్థం కాని ఫొటోగ్రాఫర్ ఆ లోయలోనే జీవించడానికి అలవాటు పడతాడు. కొన్ని పంటలు పండిస్తాడు. ఈ క్రమంలో ఆ మహిళతో సాన్నిహిత్యం పెరిగి ఇద్దరు శారీరకంగా ఒక్కటవుతారు. దాంతో ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది. అయితే, ఆ ప్రాంతానికి వచ్చే మగాళ్లను ట్రాప్ చేసి అక్కడున్న అమ్మాయిలను ప్రెగ్నెంట్ చేసేలా స్కెచ్ వేస్తారు కొంతమంది.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

అలా కొన్ని ఏళ్లు గడిచిపోతాయి. మరి అక్కడి నుంచి ఆ ఫొటోగ్రాఫర్ బయటపడ్డాడా? ఆ అమ్మాయి ఎవరు? వారిని ఎవరు ట్రాప్ చేశారు?, ఎందుకు చేశారు? అనేదే ది సీడింగ్ సినిమా స్టోరీ. 2023లో వచ్చిన ఈ అమెరికన్ హారర్ థ్రిల్లర్ మూవీ ది సీడింగ్ అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ రిలీజ్ అయింది.

ది సీడింగ్ ఓటీటీ రిలీజ్

ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, తమిళం, హిందీ వంటి నాలుగు భాషల్లో ప్రైమ్ వీడియోలో ది సీడింగ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఒక డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ ఎక్స్‌పీరియెన్స్ కోసం అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ రిలీజ్ అయిన ది సీడింగ్ మూవీని ఎంచక్కా చూడొచ్చు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం