OTT Political Thriller: ఓటీటీలోకి రెండు నెలల తర్వాత వస్తున్న రాశీ ఖన్నా నటించిన పొలిటికల్ థ్రిల్లర్.. మోదీ మెచ్చిన మూవీ
OTT Political Thriller: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ రాబోతోంది. టాలీవుడ్ నటి రాశీ ఖన్నా నటించిన ఈ సినిమా రెండు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ లో చూసి మెచ్చిన సినిమా ఇది కావడం విశేషం.
OTT Political Thriller: ఓటీటీలోకి రెండు నెలల తర్వాత వస్తోంది ది సబర్మతి రిపోర్ట్ మూవీ. గతేడాది నవంబర్ లో రిలీజై సంచలన విజయం సాధించిన ఈ సినిమాను 2002లో గుజరాత్ లోని గోద్రా రైలు ఘటన ఆధారంగా తెరకెక్కించారు. ఏకంగా ప్రధాని మోదీ కూడా ప్రశంసించిన ఈ సినిమా ఇప్పుడు జీ5 ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ మధ్యే నటనకు రిటైర్మెంట్ ప్రకటించిన విక్రాంత్ మస్సేతోపాటు రాశీ ఖన్నా ఈ మూవీలో నటించారు.
ది సబర్మతి రిపోర్ట్ ఓటీటీ రిలీజ్ డేట్
ది సబర్మతి రిపోర్ట్ గతేడాది నవంబర్ 15న థియేటర్లలో రిలీజైంది. సుమారు రూ.30 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.50 కోట్లు వసూలు చేసింది. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాకపోయినా.. పొలిటికల్ గా సంచలనం రేపిన మూవీగా నిలిచింది. ఈ సినిమా శుక్రవారం (జనవరి 10) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
కొన్నాళ్ల కిందటే జీ5 ఓటీటీ ఫిక్స్ కాగా.. ఇప్పుడు స్ట్రీమింగ్ తేదీని కూడా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా ఓ కొత్త మోషన్ పోస్టర్ ను కూడా మేకర్స్ లాంచ్ చేశారు. "దేశంలోని అతిపెద్ద కవరప్ స్టోరీ బయటకు వచ్చింది. నిజమేంటో మీ జీ5లో చూడండి. ది సబర్మతి రిపోర్ట్ జనవరి 10 నుంచి కేవలం మీ జీ5లో" అనే క్యాప్షన్ తో మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని తెలిపింది.
ది సబర్మతి రిపోర్ట్.. రియల్ స్టోరీ
2002లో ఇప్పటి ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన గోద్రా సబర్మతి రైలుకు నిప్పంటించిన ఘటన ఆధారంగా తెరకెక్కిన మూవీ ఈ ది సబర్మతి రిపోర్ట్. ఈ సినిమాలో విక్రాంత్ మస్సే, రాశీ ఖన్నా, రిద్ధి డోగ్రా ముఖ్యమైన పాత్రలు పోషించారు. రాశీ ఖన్నా.. అమృతా గిల్ అనే ఓ జర్నలిస్టు పాత్రలో నటించింది.
ఈ సినిమా నవంబర్ 15న రిలీజ్ కాగా.. చాలా మంది ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. మస్ట్ వాచ్ మూవీ అంటూ కొందరు కామెంట్స్ చేశారు. ధీరజ్ సర్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, అముల్ వీ మోహన్, అన్షున్ మోహన్ నిర్మించారు.
ఈ సినిమాను ప్రధాని నరేంద్ర మోదీ కూడా చూశారు. నిజమేంటో ఈ మూవీ ద్వారా సాధారణ ప్రజలు కూడా తెలుసుకునేలా ఉందని కొనియాడారు. "ఈ నిజం బయటకు వస్తుండటం మంచిదే. సాధారణ ప్రజలు కూడా చూసేలా ఉంది. తప్పుడు కథనాలు ఎక్కువ కాలం నిలవలేవు.
ఎప్పటికైనా నిజాలు బయటకు రావాల్సిందే" అని మోదీ ట్వీట్ చేశారు. ఈ మూవీని పార్లమెంట్ లో చూశారు. అప్పట్లో రాశీ ఖన్నా కూడా తమ సినిమాను మోదీ ప్రశంసించినందుకు థ్యాంక్స్ చెబుతూ ఓ పోస్ట్ చేసింది. మొత్తానికి సుమారు రెండు నెలల తర్వాత జనవరి 10 నుంచి జీ5 ఓటీటీలోకి ది సబర్మతి రిపోర్ట్ రాబోతోంది.