The Royals OTT Release Date Announced: ఓటీటీలోకి సరికొత్తగా రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రానుంది. అదే ది రాయల్స్ వెబ్ సిరీస్. బాలీవుడ్ పాపులర్ హీరోయిన్ భూమి పెడ్నెకర్, యంగ్ హీరో ఇషాన్ ఖట్టర్ జోడీగా నటించారు.
తనకు సుమారు ఆరేళ్ల చిన్నవాడు అయిన ఇషాన్ ఖట్టర్ (29)తో భూమి పెడ్నెకర్ (35) ది రాయల్స్ ఓటీటీ వెబ్ సిరీస్‌లో రొమాన్స్ చేయనుందనే టాక్ బాలీవుడ్‌లో రావడంతో దీనిపై క్రేజ్ నెలకొంది. ఇదివరకు రిలీజ్ చేసిన ది రాయల్స్ టీజర్ మరింత ఆసక్తిని పెంచేసింది. రొమాంటిక్ సీన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఎమోషనల్ సన్నివేశాలతో ది రాయల్స్ టీజర్ సాగింది.
ఇక తాజాగా ది రాయల్స్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఇవాళ (ఏప్రిల్ 17) నెట్‌ఫ్లిక్స్‌లో ది రాయల్స్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మే 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ది రాయల్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అయితే, ప్రస్తుతం కేవలం హిందీ భాషలో మాత్రమే ది రాయల్స్ సిరీస్ ఓటీటీ రిలీజ్ కానుందని తెలుస్తోంది.
ఓటీటీ రిలీజ్ డేట్ దగ్గరపడే సమయంలో ది రాయల్స్ తెలుగు స్ట్రీమింగ్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ది రాయల్స్ సిరీస్‌ను రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా మలిచారు. ఈ సిరీస్‌లో భూమి పెడ్నేకర్, ఇషాన్ ఖట్టర్‌తోపాటు బాలీవుడ్ పాపులర్ యాక్టర్స్ నటించారు.
బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి, మిలింద్ సోమన్, చుంకీ పాండే, జీనత్ అమాన్, సాక్షి తన్వర్, డినో మోరియా, విహాన్ సమత్, సుముఖి సురేష్, మోహిత్ వర్మ వంటి స్టార్ క్యాస్ట్ ది రాయల్స్‌లో నటించింది. ది రాయల్స్ వెబ్ సిరీస్‌కు ప్రియాంక ఘోష్, నుపుర్ అస్థానా దర్శకత్వం వహించారు. ఆరు ఎపిసోడ్స్‌ను ప్రియాంక ఘోష్ డైరెక్ట్ చేస్తే 2 ఎపిసోడ్లను నుపుర్ అస్థానా తెరకెక్కించారు.
అంటే, ది రాయల్స్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ మొత్తంగా 8 ఎపిసోడ్స్‌తో ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రానుంది. నేహా శర్మ, విష్ణు సిన్హా కథ అందించారు. ఇక ది రాయల్స్ కథ విషయానికొస్తే.. ఒక ప్రిన్స్, టెక్ స్టార్టప్ ఎంటర్‌ప్రీన్యూయర్ అమ్మాయి మధ్య జరిగే లవ్ స్టోరీగా ఉంది. ఒక స్టార్టప్ ప్రారంభిద్దామనుకునే యువతికి గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్న రాజకుమారుడుతో పరిచయం అవుతుంది.
రాజ వంశానికి చెందిన అతనితో ఆ అమ్మాయి ప్రేమలో పడుతుంది. మరి వీరి ప్రేమను ప్రిన్స్ కుటుంబీకులు ఒప్పుకుంటారా, అతనే వారసుడని నమ్మిన ఆ వంశస్థులు ఏం చేశారు అనేది ది రాయల్స్ సిరీస్ కథగా టీజర్ చూస్తుంటే తెలుస్తోంది.
కాగా, ది రాయల్స్ టీజర్‌లో భూమి పెడ్నేకర్, ఇషాన్ ఖట్టర్ మధ్య రొమాన్స్, కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయినట్లుగా కనిపిస్తోంది. ఎమోషన్, లవ్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామాతో ది రాయల్స్ తెరకెక్కింది. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ అయిన ది రాయల్స్‌ను ఓటీటీలో మే 9 నుంచి వీక్షించవచ్చు.
సంబంధిత కథనం
టాపిక్