ఫ్యాన్స్ వెయిటింగ్ కు ఎండ్ కార్డు పడింది. రెబల్ మేనియాకు తెరలేచింది. అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రాజాసాబ్ నుంచి స్పెషల్ సర్ ప్రైజ్ వచ్చేసింది. ప్రభాస్ లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్ టీజర్ రిలీజైంది. సోమవారం (జూన్ 16) ఉదయం గ్రాండ్ ఈవెంట్ లో ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ టీజర్ రిలీజ్ చేశారు.
వరుసగా యాక్షన్ సినిమాలతో అదరగొడుతున్నారు ప్రభాస్. కత్తులు, గన్లు, ఫైటింగ్.. ఇలాగే మాస్ యాక్షన్ లో ప్రభాస్ కనిపిస్తున్నారు. కానీ ఇప్పుడు రాజాసాబ్ లో ఆయన లుక్ డిఫరెంట్ గా ఉంది. డార్లింగ్ వింటేజ్ లుక్ లో కనిపిస్తున్నారు. చీకటి భవనంతో టీజర్ స్టార్ట్ అవుతుంది. ‘ఈ ఇల్లు నా దేహం. ఈ సంపద నా ప్రాణం. నా తదనాంతరం దీన్ని నేను మాత్రమే అనుభవిస్తాను’ అనే డైలాగ్ తో టీజర్ ఇంట్రెస్టింగ్ గా మొదలైంది. ఇందులో ప్రభాస్ కామెడీ టైమింగ్, హారర్ విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయి.
ప్రభాస్ లుక్ అదిరిపోయింది. ‘బండి కొంచెం మెల్లగా’ అంటూ టీజర్ లో మెరిశారు డార్లింగ్. నేరాలు, పాపాలు ఏంటండీ, డిగ్నిఫైడ్ గా లవ్ చేస్తేనే.. అంటూ తన స్టైల్లో ప్రభాస్ డైలాగ్ అలరించింది. హే జగన్నాథ ప్రభూ క్యా హువారే అనే మీమ్ డైలాగ్ నూ చెప్పారు. ఆ భవనంలో అంతా తలకిందులుగా ఉంటుంది. హారర్ విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోయాయి.
రాజాసాబ్ లో నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహన్ హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. ముగ్గురు భామల అందంతో పాటు యాక్షన్ కూడా టీజర్ లో కనిపించింది. రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ గా రాజాసాబ్ ను డైరెక్టర్ మారుతి తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. టీజర్ లో తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.
రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ గా వస్తున్న రాజాసాబ్ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ కాబోతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మించారు. తమన్ మ్యూజిక్ డైరెక్టర్. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ బెటర్ ఔట్ పుట్ కోసం, మెరుగైన విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా రిలీజ్ పోస్ట్ పోన్ అయింది.
మచిలీపట్నంలోని సిరి కాంప్లెక్స్ లో ప్రభాస్ తో పాటు డైరెక్టర్ మారుతీ కటౌట్ ఏర్పాటు చేశారు. దీనిపై మారుతి ఎమోషనల్ అయ్యారు. ‘‘ఇక్కడే మా తండ్రి చిన్న బండిపై అరటి పళ్లు అమ్మేవారు. ఈ థియేటర్లలో రిలీజయ్యే హీరోల సినిమాలకు బ్యానర్లు రాసేవాణ్ని. ఒక్కసారైనా నా పేరు అక్కడ చూడాలనుకున్నా. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ పక్కన నిలబడ్డా. మా తండ్రి ఉంటే ఇప్పుడెంతో గర్వపడేవారు. మిస్ యూ నాన్న’’ అని మారుతీ ఎక్స్ లో పోస్టు చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజాసాబ్ టీజర్ లాంఛ్ ను వేడుకలా నిర్వహించారు. రాజమహేంద్రవరం, కాకినాడ, గాజువాక, అమలాపురం, అనకాపల్లి, ఒంగోల్, విజయవాడ, మచిలీపట్నం, భీమవరం, ఏలురు, తెనాలి, కడప, ప్రొద్దుటూరు, గుంతకల్, మదనపల్లె, కర్నూల్, ఆదోని, బెంగళూరు, తిరుపతి, గుంటూరు, వరంగల్, నెల్లూరు, హైదరాబాద్ లో ఎంపిక చేసిన థియేటర్లలో టీజర్ లాంఛ్ ఈవెంట్లను నిర్వహించారు. హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ దగ్గర రాజాాసాబ్ కటౌట్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు.
సంబంధిత కథనం