రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న నెక్ట్స్ మూవీ ది రాజా సాబ్. మారుతి డైరెక్షన్ లో హారర్ కామెడీ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ సోమవారం (జూన్ 16) రిలీజైన విషయం తెలిసిందే. మూవీ రిలీజ్ కానున్న ఐదు భాషల్లోనూ టీజర్ వచ్చింది. అన్నింట్లో కలిపి తొలి 24 గంటల్లోనే 59 మిలియన్ ప్లస్ వ్యూస్ సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు.
ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో నిజంగానే ది రాజా సాబ్ అనాలేమో. అతడు ఏ సినిమాలో నటించినా అది బాక్సాఫీస్ రికార్డులనే కాదు.. అంతకుముందు టీజర్, ట్రైలర్ లాంటి రికార్డులను కూడా తిరగరాస్తోంది. తాజాగా వచ్చిన ది రాజా సాబ్ టీజర్ కూడా తొలి 24 గంటల్లోనే ఐదు భాషల్లో కలిపి 59 మిలియన్లకుపైగా వ్యూస్ సంపాదించినట్లు ఆ సినిమా మేకర్స్ వెల్లడించారు. ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ ఎవర్ హారర్ ఫ్యాంటసీ అంటూ ఈ మూవీని మేకర్స్ ప్రమోట్ చేస్తున్నారు.
మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ లో నంబర్ వన్ కావడం విశేషం. “ఇది ది రాజా సాబ్ యుగం.. మనం అందులోనే జీవిస్తున్నాం. ఇది అతని స్టేట్‌మెంట్” అనే క్యాప్షన్ తో మూవీ టీమ్ మంగళవారం (జూన్ 17) ఓ ట్వీట్ చేసింది. 59 మిలియన్లకుపైగా వ్యూస్ సాధించినట్లు కూడా ఓ స్పెషల్ పోస్టర్ కూడా పోస్ట్ చేసింది. తెలుగులోనూ 14 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, నిధి అగర్వాల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ ది రాజా సాబ్. ఈ ఏడాది డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానుంది. కల్కి 2898 ఏడీ తర్వాత ప్రభాస్ నటిస్తున్న మూవీ కావడంతో ది రాజా సాబ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ మారుతి డైరెక్షన్ కావడంతో ఈ ఇద్దరి కాంబినేషన్ ఆసక్తి రేపుతోంది. అందుకు తగినట్లే టీజర్ ఉండటంతో దీనికి యూట్యూబ్ లో ఎక్కడ లేని రెస్పాన్స్ వస్తోంది.
కొన్నేళ్లుగా ప్రభాస్ ను సీరియస్ రోల్స్ లో చూస్తున్న అభిమానులకు ది రాజా సాబ్ లో మరోసారి వింటేజ్ ప్రభాస్ కనిపిస్తున్నాడు. తన స్టైల్ కామెడీ ఎలా ఉంటుందో టీజర్లోనే అతడు చూపించాడు. దీనికితోడు మారుతి మార్క్ హారర్ కూడా థ్రిల్ పంచింది. దీంతో ఈ సినిమా కూడా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుందని భావిస్తున్నారు.
సంబంధిత కథనం