Nani Srikanth Odela The Paradise Release In 365 Days: నేచురల్ స్టార్ నాని అటు హీరోగా ఇటు నిర్మాతగా వరుసపెట్టి హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే కోర్ట్ సినిమాను సమర్పించిన నాని బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అలాగే, త్వరలో హిట్ 3 ది థర్డ్ కేస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేయనున్నాడు.
అంతకుముందు హీరోగా దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో వరుసగా హిట్లు అందుకున్నాడు. ఇప్పుడు హిట్ 3 సినిమాతో పాటు ది ప్యారడైజ్ సినిమాను కూడా లైన్‌లో పెట్టాడు నాని. దసరాతో రా అండ్ రస్టిక్ హిట్ కొట్టిన నాని మరోసారి అదే మూవీ దర్శకుడి సినిమాలో నటించాడు. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని చేస్తున్న సినిమానే ది ప్యారడైజ్ మూవీ.
నాని, శ్రీకాంత్ ఓదేల కాంబినేషన్‌లో దసరా తర్వాత వస్తున్న రెండో సినిమా ఇది. ఇదివరకు రిలీజ్ అయిన ది ప్యారడైజ్ టీజర్ అదిరిపోయింది. ఏ హీరోను చూపించనటువంటి కొత్తగా డైరెక్టర్ నానిని చూపిస్తే.. ఎవరు చేయలేనంత సాహసాన్ని నేచురల్ స్టార్ చేశాడు. దసరాకు మించిన రా సినిమాగా వచ్చిన ది ప్యారడైజ్ మూవీ టీజర్ గ్రిప్పింగ్‌గా అందరి దృష్టిని ఆకర్షించింది.
హిట్ 3లో మోస్ట్ వయోలెంట్ ఆఫీసర్ అర్జున్ సర్కార్‌గా కనిపించిన నాని దానికి మించిన రేంజ్‌లో ది ప్యారడైజ్‌లో దర్శనమిచ్చాడని కామెంట్స్ వినిపించాయి. దీంతో ది ప్యారడైజ్ గ్లింప్స్ టీజర్ రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ సాధించింది. ఇదిలా ఉంటే, ఆ గ్లింప్స్ టీజర్‌లోనే ది ప్యారడైజ్ రిలీజ్ డేట్‌ను అధికారికంగా అనౌన్స్ చేశారు మేకర్స్.
వచ్చే సంవత్సరం మార్చి 26న ది ప్యారడైజ్ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. అయితే, రీసెంట్‌గా 2025 మార్చి 26 మంగళవారం నాడు ది ప్యారడైజ్ నుంచి నాని పవర్‌ఫుల్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. "మార్చి 26, 2026న సరిగ్గా 365 రోజుల్లో ది ప్యారడైజ్ తెరపైకి రానుంది. భారతీయ సినిమా ఈ మ్యాడ్‌నెస్‌ను చూడటానికి సరిగ్గా ఏడాది ఉంది" అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఇలా సరిగ్గా 365 రోజులు ఉన్నాయంటూ ది ప్యారడైజ్ సినిమాకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయినట్లుగా మేకర్స్ నాని పోస్టర్ రిలీజ్ చేశారు అందులో పేలుళ్లు, వార్ బ్యాక్ డ్రాప్‌లో తుపాకీని పట్టుకుని నాని పవర్‌ఫుల్ కొత్త లుక్‌లో కనిపించాడు. ఈ ఇంటెన్స్ పోస్టర్ ది ప్యారడైజ్ సినిమా ఒక యాక్షన్-ప్యాక్‌డ్ జర్నీ అని సూచిస్తోంది.
హైదరాబాద్ హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో సెట్ చేయబడిన ది ప్యారడైజ్ సినిమాలో నానిని మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్‌లో ప్రజెంట్ చేశారు. ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ది ప్యారడైజ్ సినిమాను అత్యున్నత స్థాయి నిర్మాణ విలువలతో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, జీకే విష్ణు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. కాగా, ది ప్యారడైజ్ సినిమా ఇంగ్లీష్, స్పానిష్ సహా 8 భాషలలో విడుదల కానుంది.
సంబంధిత కథనం
టాపిక్