ఓటీటీలో ఎన్నో రకాల కంటెంట్ వస్తూనే ఉంటోంది. ఎప్పటికప్పుడు ప్రతివారం డిఫరెంట్ జోనర్లలో ఓటీటీ సినిమాలను వివిధ ప్లాట్‌ఫామ్స్ స్ట్రీమింగ్ చేస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని మాత్రమే ఓటీటీ ఆడియెన్స్ ఆదరణ పొందుతుంటాయి. అయితే, వీటిలో థియేట్రికల్ రిలీజ్ తర్వాత కాకుండా నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు సైతం ఉన్నాయి.
అలాంటి వాటిలో ఒకటే ది ఓల్డ్ గార్డ్. 2020లో అమెరికన్ సూపర్ హీరో అడ్వెంచర్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది ఈ ది ఓల్డ్ గార్డ్ సినిమా. 2020 జులై 10న డైరెక్ట్‌గా ది ఓల్డ్ గార్డ్ ఓటీటీ రిలీజ్ అయి సూపర్ హిట్ సాధించింది. ఐఎమ్‌డీబీ నుంచి పదికి 6.7 రేటింగ్ సాధించగా.. 80 శాతం వరకు ఫ్రెష్ కంటెంట్‌గా పేరు తెచ్చుకుంది.
అలాంటి ది ఓల్డ్ గార్డ్ మూవీకి సీక్వెల్‌గా ఐదేళ్ల తర్వాత వచ్చిన సినిమానే ది ఓల్డ్ గార్డ్ 2. అదే సూపర్ హీరో అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ది ఓల్డ్ గార్డ్ కూడా నేరుగా ఓటీటీ రిలీజ్ అయింది. జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ది ఓల్డ్ గార్డ్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అంటే, థియేట్రికల్ రిలీజ్ లేకుండానే మొదటి సినిమా తరహాలో రెండో భాగం ది ఓల్డ్ గార్డ్ 2 కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయంది.
అది కూడా నేరుగా ఇంగ్లీషుతోపాటు తెలుగులో ది ఓల్డ్ గార్డ్ 2 ఓటీటీ స్టీమింగ్ అవుతోంది. అయితే, 2020లో ది ఓల్డ్ గార్డ్ నేరుగా తెలుగులో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాలేదు. ఈ ఏడాది నుంచే మొదటి పార్ట్ ది ఓల్డ్ గార్డ్ తెలుగులో అందుబాటులోకి వచ్చింది. ఇక దీనికి సీక్వెల్‌గా తెరకెక్కిన ది ఓల్డ్ గార్డ్ 2 మాత్రం నేరుగా తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది.
అంతేకాకుండా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయిన జులై 2వ రోజునాడే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ సినిమాల జాబితాలోకి వచ్చేసింది ది ఓల్డ్ గార్డ్ 2. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ సినిమాల్లో ది ఓల్డ్ గార్డ్ 2 మూడో స్థానంలో దూసుకుపోతోంది. ఇంగ్లీష్, తెలుగు రెండు భాషల్లో ది ఓల్డ్ గార్డ్ 2 ఓటీటీ ట్రెండింగ్‌లో నిలిచి సత్తా చాటింది.
అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్, ఊహించని ట్విస్టులతో సాగే ది ఓల్డ్ గార్డ్ 2 సినిమాలో ఇద్దరు లేడి అమరుల మధ్య పోటీ పడుతుంది. హీరోయిన్, లేడి విలన్ ఇద్దరికి అమరత్వం ఉంటుంది. అంటే, వారు ఎప్పటికీ చనిపోరు. వారిని ఇందులో ఓల్డ్ గార్డ్‌గా పిలుస్తారు.
మరి అలాంటి అమరత్వం ఉన్న ఇద్దరు ఓల్డ్ గార్డ్స్ పోటీ పడగా ఎవరు గెలుస్తారన్నది ఆసక్తిగా ఉంటుంది. మరి ది ఓల్డ్ గార్డ్ 2 మూవీని తెలుగులో ఎంచక్కా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో వీక్షించవచ్చు.
సంబంధిత కథనం