The Night Manager Season 2: ది నైట్ మేనేజర్ సీజన్ 2 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఇదే-the night manager season 2 streaming date announced by disney plus hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  The Night Manager Season 2 Streaming Date Announced By Disney Plus Hotstar

The Night Manager Season 2: ది నైట్ మేనేజర్ సీజన్ 2 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Hari Prasad S HT Telugu
May 05, 2023 11:16 AM IST

The Night Manager Season 2: ది నైట్ మేనేజర్ సీజన్ 2 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అనౌన్స్ చేసింది. ఫస్ట్ పార్ట్ కు మంచి రెస్పాన్స్ రావడంతో పార్ట్ 2 కోసం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ది నైట్ మేనేజర్ పార్ట్ 2 వచ్చేస్తోంది
ది నైట్ మేనేజర్ పార్ట్ 2 వచ్చేస్తోంది

The Night Manager Season 2: ది నైట్ మేనేజర్ మళ్లీ వస్తున్నాడు. ఈసారి పార్ట్ 2తో ఆడియెన్స్ ను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అయిన తొలి పార్ట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో రెండో పార్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ రెండో సీజన్ స్ట్రీమింగ్ డేట్ ను హాట్‌స్టార్ అనౌన్స్ చేసింది.

ది నైట్ మేనేజర్ రెండో సీజన్ జూన్ 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్ ఇందులో నటించారు. అనిల్ కపూర్ ఆయుధాల డీలర్ గా, ఆదిత్య గవర్నమెంట్ తరఫున ఏజెంట్ గా నైట్ మేనేజర్ పాత్రలో కనిపించారు. ఫస్ట్ పార్ట్ ను మేకర్స్ ఉత్కంఠభరితంగా ముగించడంతో రెండో పార్ట్ కోసం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ ది నైట్ మేనేజర్ గురించి అనిల్ కపూర్ స్పందించాడు. "ది నైట్ మేనేజర్ పై అభిమానులు చూపించిన ప్రేమ, మద్దతు నన్ను చాలా ఆనందానికి గురి చేస్తోంది. ఇది మాపై మరింత బాధ్యతను పెంచింది. రెండో పార్ట్ లో ఉన్న ట్విస్టులను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తుంటే చూడాలని ఉంది. షెల్లీ (షోలో అనిల్ పాత్ర) అత్యుత్తమంగా కనిపిస్తాడు" అని అనిల్ కపూర్ చెప్పాడు.

ది నైట్ మేనేజర్ ఫస్ట్ పార్ట్‌లో ఏం జరిగిందంటే?

2016లో రూపొందిన బ్రిట‌న్‌ వెబ్ సిరీస్ ది నైట్ మేనేజ‌ర్‌కు ఇండియ‌న్ అడాప్ష‌న్‌గా క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ఈ సిరీస్ తెర‌కెక్కింది. అనిల్ క‌పూర్‌, ఆదిత్య‌రాయ్ క‌పూర్‌, శోభిత ధూళిపాళ్ల వంటి స్టార్స్ న‌టించ‌డంతో ఈ బాలీవుడ్ వెబ్‌సిరీస్ అంద‌రిలో ఆస‌క్తిని రేకెత్తించింది.

ఈ సిరీస్‌కు ప్రియాంక ఘోష్‌, సందీప్ మోడీ, రుక్ న‌బీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. భిన్న నేప‌థ్యాలు క‌లిగిన ముగ్గురు వ్య‌క్తుల జీవితాల్ని లింక్ చేస్తూ క‌థ‌ను రాసుకున్న విధానం బాగుంది.

సెకండ్ ఎపిసోడ్‌లో అనిల్ క‌పూర్ ఎంట్రీ ఇవ్వ‌డంతోనే సిరీస్ ఆస‌క్తిక‌రంగా మారుతుంది. షెల్లీ చేసే ఇల్లీగ‌ల్ బిజినెస్‌కు సంబంధించి త‌న తెలివితేట‌ల‌ను ఉప‌యోగించి షాన్‌ స‌మాచారాన్ని సేక‌రించే సీన్స్ ఆస‌క్తిని పంచుతాయి.

షెల్లీ టీమ్‌లో చేర‌డానికి లిపిక‌తో క‌లిసి షాన్‌వేసే ఎత్తుల‌ను డైరెక్ట‌ర్స్ ఇంట్రెస్టింగ్‌రాసుకున్నారు. ది నైట్ మేనేజ‌ర్ ఇన్వేస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్ సినిమాల్ని ఇష్ట‌ప‌డేవారిని త‌ప్ప‌కుండా మెప్పిస్తుంది. ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్, యాక్టింగ్ సినిమాల‌కు ధీటుగా ఉండ‌టం ప్ల‌స్‌.

IPL_Entry_Point

సంబంధిత కథనం