ఓటీటీ హారర్ థ్రిల్లర్స్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. రొటీన్ స్టోరీ అయిన టేకింగ్ ఎంత థ్రిల్లింగ్‌గా, భయపెట్టేలా ఉంటే అంత హిట్ అవుతాయి. ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్, ఎప్పుడు చూడని సన్నివేశాలతో మలిస్తే ఆ హారర్ మూవీకి వచ్చే రెస్పాన్స్ మరోలా ఉంటుంది.
అలాంటి హారర్ థ్రిల్లర్ సినిమానే ది మంకీ. ఇది ఒక అమెరికన్ డార్క్ కామెడీ హారర్ థ్రిల్లర్ సినిమా. కానీ, ఇందులో ఎక్కువగా హారర్ అంశాలే ఎక్కువగా ఉంటాయి. ఒక కోతి బొమ్మ చుట్టూ ఈ సినిమా అంత సాగుతుంది. ఒక ఫ్యామిలీలో ఓ కోతి బొమ్మ ఉంటుంది. అది డ్రమ్ వాయించే కోతి బొమ్మ.
ఆ బొమ్మకు కీ ఇస్తే డ్రమ్ వాయిస్తుంది. కానీ, కొన్నిసార్లు ఎలాంటి కీ ఇవ్వకుండానే డ్రమ్ వాయిస్తుంది. అలా చేసిందంటే ఒకరు అతి ఘోరంగా, ఊహించని విధంగా చనిపోతారు. ఇది హీరో కుటుంబానికి శాపంగా ఉంటుంది. ఆ కోతి బొమ్మ వల్ల తన ఫ్యామిలీలో ఒక్కొక్కరిగా చనిపోతుంటారు.
ఆ కోతి బొమ్మను పాతిపెట్టిన, నరికినా, దూరంగా విసిరేసిని తిరిగి మళ్లీ హీరో కుటుంబానికే వచ్చి చేరుకుంటుంది. దాంతో హీరో ఏం చేయలేక ఆ కోతి బొమ్మ దగ్గర మనుషులు ఉండకుండా చూసుకుంటాడు. కానీ, ఎంత ప్రయత్నించినా ఎవరో ఒకరు చనిపోతుంటారు. మరి హీరో తన కుటుంబంలో ఎంతమందిని కాపాడుకోగలిగాడు?, ఆ శాపాన్ని విముక్తి చేసుకోగలిగాడా? అనేదే ది మంకీ మూవీ స్టోరీ.
ఇలాంటి ది మంకీ ఓటీటీలో అందుబాటులో ఉంది. అలాగే, ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. అమెజాన్ ప్రైమ్‌లో ది మంకీ ఓటీటీ రిలీజ్ అయింది. జూన్ 21 నుంచి ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళం వంటి నాలుగు భాషల్లో ది మంకీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
కేవలం గంట 38 నిమిషాలు ఉన్న ది మంకీ సినిమాకు ఓజ్ పెర్కిన్స్ (ఓస్‌గుడ్ పెర్కిన్స్) దర్శకత్వం వహించారు. స్టిఫెన్ కింగ్ రాసిన ది మంకీ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. యూనైటెడ్ స్టేట్స్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైన ది మంకీ మంచి కలెక్షన్స్ సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది.
డిఫరెంట్ హారర్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు భాషలో కూడా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్నది మంకీపై లుక్కేయొచ్చు.
సంబంధిత కథనం