ఓటీటీలోకి తెలుగు కంటెంట్ సినిమాలు ఎక్కువగానే వస్తున్నాయి. ఫ్యామిలీ డ్రామా, ఎమోషనల్, లవ్ రొమాంటిక్ వంటి జోనర్స్‌తోపాటు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే థ్రిల్లర్స్ కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలా తాజాగా ఇవాళ (అక్టోబర్ 12) ఓటీటీ రిలీజ్ అయిన తెలుగు సస్పెన్స్ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా మాస్క్.
నివాస్ అనే వ్యక్తి డెలివరి ఏజెంట్‌గా పని చేస్తాడు. బతకడం కష్టంగా మారడంతో ఓ వృద్ధ జంట ఉన్న ఇంట్లోకి దొంగతనానికి వెళ్తాడు నివాస్. కానీ, తీరా దొంగతనానికి వెళ్లిన నివాస్‌కు అక్కడ ఆడ శవం కనిపిస్తుంది. దాంతో భయంతో వణికిపోయి ఆమెను లేపడానికి ట్రై చేస్తాడు. కానీ, ఊహించని విధంగా శవంతో నివాస్ ఉన్న రూమ్‌కి లాక్ పడుతుంది.
అర్ధరాత్రి నుంచి తెల్లారే వరకు ఆడ శవంతో గదిలో ఇరుక్కుపోతాడు నివాస్. మరుసటి రోజు ఉదయం నివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఆ తర్వాత ఏమైంది? ఆ మహిళను చంపింది ఎవరు? అసలు ఆ జంట ఇంట్లో డబ్బు ఉందని నివాస్‌కు ఎలా తెలిసింది? వారి ఇంటికే ఎందుకు వెళ్లాడు? నివాస్ ఎవరి ట్రాప్‌లో పడ్డాడు? హత్య నేరం నుంచి బయట పడ్డాడా? అనేవి మాస్క్ సినిమాలోని ట్విస్టులు.
మాస్క్ సినిమాకు కొత్తపల్లి సురేష్ దర్శకత్వం వహించడంతోపాటు నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు. అలాగే, విశాల్ భరద్వాజ్ సంగీతం అందించిన మాస్క్ సినిమాను కథగాని పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించారు. మాస్క్ సినిమాలో రావణ్ రెడ్డి నిట్టూరే, శ్రీనివాస్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్ ప్రధాన పాత్రలు పోషించారు.
35.54 నిమిషాల రన్ టైమ్ ఉన్న మాస్క్ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈటీవీ విన్ కథా సుధా వీక్లీ సిరీస్‌లో భాగంగా ఇవాళ మాస్క్ ఓటీటీ రిలీజ్ అయింది. అయితే, మాస్క్‌తోపాటు మరో మూడు సినిమాలను వారం వారం ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారు.
ఈటీవీ విన్ 4 టేల్స్‌లో భాగంగా ది మాస్క్, రిధి, ఘటన, రైడర్ సినిమాలను ఓటీటీ రిలీజ్ చేయనున్నారు. వీటిలో మొదటగా మాస్క్ సినిమాను డిజిటల్ ప్రీమియర్ చేశారు. అక్టోబర్ 12 అర్థరాత్రి నుంచే ఈటీవీ విన్‌లో ది మాస్క్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
సంబంధిత కథనం
టాపిక్