The Marvels Trailer: మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న మరో మచ్ అవేటెడ్ మూవీ ది మార్వెల్స్. ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం (జులై 21) రిలీజైంది. మార్వెల్ మూవీస్ అంటేనే ఫుల్ యాక్షన్, అడ్వెంచర్ అని తెలుసు కదా. ఈ ది మార్వెల్స్ మూవీ కూడా అందుకు అతీతమేమీ కాదు. తాజాగా వచ్చిన ట్రైలర్ చూస్తుంటే అదే స్పష్టమవుతోంది.
మార్వెల్ కు చెందిన ముగ్గురు సూపర్ హీరోలు ఒకే సినిమాలో కనిపించబోతుండటంతో ది మార్వెల్స్ పై ఎక్కడ లేని అంచనాలు ఏర్పడ్డాయి. కెప్టెన్ మార్వెల్, మిస్ మార్వెల్, కెప్టెన్ మోనికా రాంబ్యూలను ఒకేసారి సిల్వర్ స్క్రీన్ పై చూసి థ్రిల్ అవడానికి ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ది మార్వెల్స్ ట్రైలర్ వాళ్ల అంచనాలను అందుకునేలానే ఉంది.
ఈ ముగ్గురు మార్వెల్ సూపర్ హీరోలు చేసే స్టంట్స్ తో ట్రైలర్ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ గా సాగిపోయింది. ఈవిల్స్ నుంచి ప్రపంచాన్ని కాపాడటానికి ముగ్గురూ కలవాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. ది మార్వెల్స్ మూవీలో బ్రీ లార్సన్, టెయోనా పారిస్, ఇమాన్ వెల్లానీ, శామ్యూల్ జాక్సన్ నటిస్తున్నారు. నియా డకోస్టా డైరెక్ట్ చేస్తుండగా.. కెవిన్ ఫీజ్ మూవీని నిర్మించారు.
ది మార్వెల్స్ మూవీ ఇంగ్లిష్ తోపాటు తెలుగు, హిందీ, తమిళంలాంటి భారతీయ భాషల్లోనూ రిలీజ్ కానుంది. ఈ సినిమా ఈ ఏడాది దీపావళి సందర్భంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.
టాపిక్