అదిరిపోయిన సూపర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. రాజీవ్ గాంధీ హంతకుల వేట ఎలా సాగిందో చూస్తారా.. ఈ వీకెండ్ మస్ట్ వాచ్-the hunt the rajiv gandhi assassination case web series review in telugu super thriller web series on sony liv ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  అదిరిపోయిన సూపర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. రాజీవ్ గాంధీ హంతకుల వేట ఎలా సాగిందో చూస్తారా.. ఈ వీకెండ్ మస్ట్ వాచ్

అదిరిపోయిన సూపర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. రాజీవ్ గాంధీ హంతకుల వేట ఎలా సాగిందో చూస్తారా.. ఈ వీకెండ్ మస్ట్ వాచ్

Hari Prasad S HT Telugu

ఈ వీకెండ్ మంచి సూపర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చూడాలనుకుంటున్నారా? అయితే సోనీ లివ్ ఓటీటీలో ఉన్న ది హంట్ ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్ మిస్ కాకుండా చూడండి. మాజీ ప్రధాని హంతకుల వేట ఎలా సాగిందో కళ్లకు కట్టినట్లు చూపించిన తీరు అద్భుతం.

అదిరిపోయిన సూపర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. రాజీవ్ గాంధీ హంతకుల వేట ఎలా సాగిందో చూస్తారా.. ఈ వీకెండ్ మస్ట్ వాచ్

స్వతంత్ర భారత చరిత్రలో జరిగిన పెను విషాదాల్లో ఒకటి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య. అయితే ఆ హత్య కేసులో అసలు నిందితులను కేవలం 90 రోజుల్లోనే పట్టుకోవడం అనేది మరో రికార్డు. అలా రాజీవ్ హంతకుల వేట ఎలా సాగిందో కళ్లకు కట్టడానికి ఇప్పుడు ది హంట్ ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్ ( The Hunt: The Rajiv Gandhi Assassination Case) వెబ్ సిరీస్ వచ్చింది. సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

వెబ్ సిరీస్: ది హంట్ ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్

డైరెక్టర్: నగేష్ కుకునూర్

నటీనటులు: అమిత్ సియాల్, భాగవతి పెరుమాల్, గిరీష్ శర్మ, ఆపేక్ష అయ్యర్, గౌరీ మేనన్ తదితరులు

ఓటీటీ: సోనీ లివ్

ది హంట్ ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్ స్టోరీ ఇదీ..

మే 21, 1991.. ఈ దేశం మెచ్చిన ప్రధానమంత్రుల్లో ఒకరైన రాజీవ్ గాంధీని కోల్పోయిన రోజు అది. తమిళనాడులో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఓ ఎల్టీటీఈ ఉగ్రవాది మానవ బాంబుగా మారి రాజీవ్ ను హత్య చేస్తుంది. ది హంట్ వెబ్ సిరీస్ కూడా సరిగ్గా అక్కడే మొదలవుతుంది.

ఆ తర్వాత ఏడు ఎపిసోడ్ల పాటు రాజీవ్ హంతకుల వేట ఎలా సాగింది? 90 రోజుల్లోనే ఈ కేసును ఎలా ఛేదించారు? ఈ హత్య కోసమే శ్రీలంకలోని జాఫ్నా నుంచి ఇండియాకు వచ్చిన 9 మంది ఎల్టీటీఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ పట్టుకుందా? రాజీవ్ హత్యలో మాస్టర్ మైండ్ అయిన వ్యక్తిని ప్రాణాలతో పట్టుకోలేకపోవడానికి కారణమేంటి? అన్నదే ఈ ది హంట్ ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్ వెబ్ సిరీస్ స్టోరీ.

అనిరుద్య మిత్రా రాసిన 90 డేస్: ద ట్రూ స్టోరీ ఆఫ్ ద హంట్ ఫర్ రాజీవ్ గాంధీ అసాసిన్స్ అనే బుక్ ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కించారు. ఇది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లీడ్ చేసిన కార్తికేయన్ (అమిత్ సియాల్), అతని టీమ్ సాగించిన వేటను కళ్లకు కట్టింది.

ది హంట్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

చారిత్రక ఘటనలు.. ముఖ్యంగా సంచలనం రేపిన, వివాదాలకు తావున్న కథాంశాలతో సినిమా లేదా వెబ్ సిరీస్ తెరకెక్కించడం కత్తి మీద సాములాంటిదే. కానీ ది హంట్: ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్ వెబ్ సిరీస్ తో ఆ సవాలును మన హైదరాబాదీ డైరెక్టర్ నగేష్ కుకునూర్ స్వీకరించాడు.

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసు, దానిని 90 రోజుల్లోనే పరిష్కరించిన తీరును 7 ఎపిసోడ్ల ఈ సిరీస్ లో నగేష్ కుకునూర్ అద్భుతంగా చూపించాడు. కేసు దర్యాప్తు సందర్భంగా తెర వెనుక జరిగిన రాజకీయాలు, కుట్ర సిద్ధాంతాలను సున్నితంగా చూపించే ప్రయత్నం చేశారు. ఓ గ్రిప్పింగ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లో ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి.

ఏడు ఎపిసోడ్ల థ్రిల్లర్

ది హంట్: ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్ వెబ్ సిరీస్ మే 21, 1991న రాజీవ్ గాంధీ హత్యకు కొన్ని గంటల ముందు ప్రారంభమవుతుంది. కొలంబోలోని ఇండియన్ హైకమిషన్ ఆఫీసుకు రాజీవ్ గాంధీ బతికే ఉన్నాడా అంటూ ఓ కాల్ వస్తుంది. కానీ ఆ కాల్ ను అక్కడి వాళ్లు తేలిగ్గా తీసుకుంటారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీని ఓ మానవ బాంబు హత్య చేసిన విధానం, దీనిని దర్యాప్తు చేయడానికి ఓ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ ఏర్పాటు కావడం, దీని వెనుక ఎల్టీటీఈ హస్తం ఉందని తెలుసుకోవడం, నిందితుల వేట.. ఇలా సాగిపోతుంది.

రాజీవ్ గాంధీని కాపాడుకోవడంలో జరిగిన పొరపాట్ల నుంచి చివరికి అసలు నిందితుడు శివరాసన్ ను పట్టుకోవడంలో ఎలా విఫలమయ్యారన్నది కూడా డైరెక్టర్ నగేష్ కుకునూర్ ఈ వెబ్ సిరీస్ లో చూపించాడు. మొత్తంగా 7 ఎపిసోడ్ల పాటు ఎక్కడా గాడి తప్పకుండా, సీట్లకు అతుక్కుపోయి బింజ్ వాచ్ చేసేలా ఈ సిరీస్ తెరకెక్కించారని చెప్పొచ్చు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం