The Great Indian Kitchen Review: ది గ్రేట్ ఇండియ‌న్ కిచెన్ మూవీ రివ్యూ - ఐశ్వ‌ర్య రాజేష్ సినిమా ఎలా ఉందంటే-the great indian kitchen movie telugu review aishwarya rajesh drama movie review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  The Great Indian Kitchen Movie Telugu Review Aishwarya Rajesh Drama Movie Review

The Great Indian Kitchen Review: ది గ్రేట్ ఇండియ‌న్ కిచెన్ మూవీ రివ్యూ - ఐశ్వ‌ర్య రాజేష్ సినిమా ఎలా ఉందంటే

Nelki Naresh Kumar HT Telugu
Mar 05, 2023 05:52 AM IST

The Great Indian Kitchen Review: ఐశ్వ‌ర్య‌రాజేష్‌, రాహుల్ ర‌వీంద్ర‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన సినిమా ది గ్రేట్ ఇండియ‌న్ కిచెన్‌. మ‌ల‌యాళ రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా జీ5 ఓటీటీలో రిలీజైంది.

ఐశ్వ‌ర్య‌రాజేష్‌, రాహుల్ ర‌వీంద్ర‌న్
ఐశ్వ‌ర్య‌రాజేష్‌, రాహుల్ ర‌వీంద్ర‌న్

The Great Indian Kitchen Review: 2021లో మ‌ల‌యాళంలో రూపొందిన ది గ్రేట్ ఇండియ‌న్ కిచెన్ సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకున్న‌ది. ఈసినిమాను అదే పేరుతో త‌మిళంలో ఐశ్వ‌ర్య‌రాజేష్(Aishwarya Rajesh) హీరోయిన్‌గా ఈ ఏడాది రీమేక్ చేశారు. ఈ సినిమాకు క‌ణ్ణ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. రాహుల్ ర‌వీంద్ర‌న్(Rahul Ravindran) కీల‌క పాత్ర పోషించాడు. ఇటీవ‌ల జీ5 (Zee5 OTT) ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే...

The Great Indian Kitchen Story -వంటింటి క‌థ‌...

ఐశ్వ‌ర్య‌రాజేష్ క్లాసిక‌ల్ డ్యాన్స్ నేర్చుకుంటుంది. డ్యాన్స్ టీచ‌ర్‌గా ప‌నిచేయాల‌ని క‌ల‌లు కంటుంది. ఆమెకు ఓ స్కూల్‌లో టీచ‌ర్‌గా ప‌నిచేసే రాహుల్ ర‌వీంద్ర‌న్‌తో పెళ్ల‌వుతుంది. రాహుల్ ర‌వీంద్ర‌న్ ఫ్యామిలీ సంప్ర‌దాయాల‌కు ఎక్కువ‌గా ప‌ట్టింపునిస్తుంటారు. ఆడ‌వాళ్లు ఇంటికే ప‌రిమితం కావాల‌ని న‌మ్ముతుంటారు.

ఇంటి ప‌నులు చేయ‌డ‌మే ఆడ‌వాళ్ల బాధ్య‌త అని రాహుల్ ర‌వీంద్ర‌న్‌తో పాటు అత‌డి తండ్రి చెబుతుంటారు. ఎన్నో క‌ల‌ల‌తో కొత్త జీవితాన్ని మొద‌లుపెట్టిన ఐశ్వ‌ర్య‌రాజేష్ అత్తింటి క‌ట్టుబాట్ల కార‌ణంగా వంటింటికే ప‌రిమిత‌మ‌వుతుంది.

కాలం చెల్లిన భ‌ర్త ఆలోచ‌న విధానాల వ‌ల్ల‌ ఐశ్వ‌ర్య‌రాజేష్ ఎలాంటి సంఘ‌ర్ష‌ణ‌ను ఎదుర్కొన్న‌ది? భ‌ర్త‌, మామ‌ల‌కు ఆమె ఎలా బుద్దిచెప్పింది? త‌న క‌ల‌ల సాకారం కోసం ఐశ్వ‌ర్య రాజేష్ తీసుకున్న నిర్ణ‌య‌మేమిట‌న్న‌దే(The Great Indian Kitchen Review) ది గ్రేట్ ఇండియ‌న్ కిచెన్ క‌థ‌.

హోమ్ మినిస్ట‌ర్‌...

ఆడ‌వాళ్ల‌ను హోమ్ మినిస్ట‌ర్ అని పిలుస్తుంటారు. కుటుంబ బాధ్య‌త‌ల్నిఆడ‌వాళ్ల‌కు అప్ప‌చెప్పి వారిని ఇంటికే ప‌రిమితం చేయ‌డమే హోమ్ మినిస్ట‌ర్ అంటే అర్థ‌మా అని ద‌ర్శ‌కుడు క‌ణ్ణ‌న్ సూటిగా ఈ సినిమా ద్వారా స‌మాజాన్ని ప్ర‌శ్నించారు.

ఉద్యోగాలు చేయ‌డం మ‌గ‌వాళ్ల బాధ్య‌త ఇంటిని చ‌క్క‌దిద్ద‌డం ఆడ‌వాళ్ల ప‌ని అంటూ స‌మాజంలో పేరుకుపోయిన పురాత‌న‌ క‌ట్టుబాట్లు సంప్ర‌దాయాల కార‌ణంగా మ‌హిళ‌లు ఎలాంటి వివ‌క్ష‌ను ఎదుర్కొంటున్నారో(The Great Indian Kitchen Review) ఈ సినిమాలో ఆలోచ‌నాత్మ‌కంగా చూపించారు.

కాలం మారుతోన్న కొంద‌రు మాత్రం ఇప్ప‌టికీ ఈ క‌ట్టుబాట్ల పేరుతో మ‌హిళ‌ల క‌ల‌ల్ని ఎలా కాల‌రాస్తున్నారో సందేశాత్మ‌కంగా ఆవిష్క‌రించారు. వంట‌గ‌ది నుంచే మ‌హిళ‌ల‌పై వివ‌క్ష మొద‌ల‌వుతుంద‌నే పాయింట్‌ను చ‌ర్చిస్తూ సినిమాను రూపొందించారు.

క‌ల‌లో కూడా...

రాహుల్ ర‌వీంద్ర‌న్‌, ఐశ్వ‌ర్య‌రాజేష్ పెళ్లిచూపుల‌తో ఈసినిమా మొద‌ల‌వుతుంది. పెళ్లి చేసుకొని అత్తారింట్లో అడుగుపెట్టిన ఐశ్వ‌ర్య‌రాజేష్‌ భ‌ర్త తో పాటు మామ‌కు వండిపెడుతూ వంటింటికే ఎలా ప‌రిమిత‌మైంద‌న్న‌ది చూపిస్తూ క థ‌ను ముందుకు న‌డిపించారు ద‌ర్శ‌కుడు.

చివ‌ర‌కు క‌ల‌లో కూడా వంటిల్లే క‌నిపించేంత‌గా అదే ఆమె లోకంగా ఎలా మారిపోయిందో రియ‌లిస్టిక్‌గా చూపించారు. వంటింటి బంధిఖానా నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి దారితీసిన స‌న్నివేశాల్ని వాస్త‌విక కోణంలో స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేసిన‌ విధానం బాగుంది.ఈ సినిమాలో హీరోహీరోయిన్ల‌తో పాటు మిగిలిన పాత్ర‌ల‌కు పేర్లు పెట్ట‌లేదు డైరెక్ట‌ర్‌.

అదే మైన‌స్‌...

సినిమా మొత్తం వంటింటికే ప‌రిమితం కావ‌డం సినిమాకు మైన‌స్‌గా మారింది. చూపించిన సీన్స్‌నే మ‌ళ్లీ మ‌ళ్లీ చూపిస్తూ బోర్ కొట్టించారు. భార్య‌ను భ‌ర్త ద్వేషించే సీన్స్‌లో కొన్ని కావాల‌నే క్రియేట్ చేసిన‌ట్లుగా ఉన్నాయి.

రియ‌లిస్టిక్ యాక్టింగ్‌...

ఇంటి బాధ్య‌త‌ల పేరుతో అనుక్ష‌ణం వివ‌క్ష‌కు లోన‌య్యే యువ‌తిగా ఐశ్వ‌ర్య రాజేష్ న‌ట‌న బాగుంది. త‌న క‌ల‌ల‌కు వాస్త‌వ జీవితానికి మ‌ధ్య నిరంత‌రం సంఘ‌ర్ష‌ణ‌ను ఎదుర్కొనే పాత్ర‌లో ఎమోష‌న్స్ ప‌డించిన తీరు మోప్పిస్తుంది. మూఢ‌న‌మ్మ‌కాల్ని, ఆచారాల్ని పాటించే ఉన్న‌త విద్యావంతుడైన భ‌ర్త‌గా రాహుల్ ర‌వీంద్ర‌న్ క‌నిపించాడు. వీరిద్ద‌రి పాత్ర‌ల నేప‌థ్యంలోనే ఈసినిమా సాగుతుంది.

The Great Indian Kitchen Review:-మంచి సందేశం...

ది గ్రేట్ ఇండియ‌న్ కిచెన్ చ‌క్క‌టి సందేశంతో రూపొందిన సినిమా. మ‌ల‌యాళ సినిమాను సీన్ టూ సీన్ కాపీ చేయ‌డం వ‌ల్ల క‌మ‌ర్షియాలిటీ దూరంగా సాగిన ఫీలింగ్ క‌లుగుతుంది. కానీ సినిమాలో చ‌ర్చించిన అంశం మాత్రం ఆలోచ‌న‌ను రేకెత్తిస్తుంది.

రేటింగ్ 2.5/5

IPL_Entry_Point