The Goat Life Advance Bookings: ది గోట్ లైఫ్ అడ్వాన్స్ బుకింగ్స్.. దుమ్మురేపిన పృథ్వీరాజ్ సుకుమారన్ మూవీ.. గంటల్లోనే..-the goat life advance bookings prithviraj sukumaran movie hits 1 crore mark in kerala in just 13 hours malayalam movies ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  The Goat Life Advance Bookings Prithviraj Sukumaran Movie Hits 1 Crore Mark In Kerala In Just 13 Hours Malayalam Movies

The Goat Life Advance Bookings: ది గోట్ లైఫ్ అడ్వాన్స్ బుకింగ్స్.. దుమ్మురేపిన పృథ్వీరాజ్ సుకుమారన్ మూవీ.. గంటల్లోనే..

Hari Prasad S HT Telugu
Mar 25, 2024 07:21 AM IST

The Goat Life Advance Bookings: పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ది గోట్ లైఫ్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. తొలి రోజు కొన్ని గంటల్లోనే కేరళలో ఈ మూవీ రూ.కోటి మార్క్ అందుకుంది.

ది గోట్ లైఫ్ అడ్వాన్స్ బుకింగ్స్.. దుమ్మురేపిన పృథ్వీరాజ్ సుకుమారన్ మూవీ.. గంటల్లోనే..
ది గోట్ లైఫ్ అడ్వాన్స్ బుకింగ్స్.. దుమ్మురేపిన పృథ్వీరాజ్ సుకుమారన్ మూవీ.. గంటల్లోనే..

The Goat Life Advance Bookings: మలయాళం నుంచి మరో సర్వైవల్ థ్రిల్లర్ మూవీ రాబోతోంది. ఈ సినిమా పేరు ది గోట్ లైఫ్ (ఆడుజీవితం). స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఈ సినిమా గురువారం (మార్చి 28) ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే ఆదివారం (మార్చి 24) నుంచి మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

ది గోట్ లైఫ్‌ అడ్వాన్స్ బుకింగ్స్

ది గోట్ లైఫ్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. కేరళలో బుకింగ్స్ మొదలైన కొన్ని గంటల్లోనే రూ.కోటి మార్క్ అందుకోవడం విశేషం. తొలి 13 గంటల్లోనే ఈ మూవీ 63 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. తొలి రోజే రూ.1.5 కోట్లు వచ్చాయంటే ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ మలయాళంతోపాటు వివిధ భాషల్లో రిలీజ్ కానుంది.

ఎప్పుడో 2008లో అనుకున్న ఈ సినిమా మొత్తానికి 16 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా ట్రైలర్ తోపాటు ప్రమోషన్లకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. బ్లెస్సీ డైరెక్ట్ చేసిన ది గోట్ లైఫ్ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ నిజజీవితంలో సౌదీ అరేబియాలో బానిసగా ఉన్న నజీబ్ అనే కేరళకు చెందిన వ్యక్తి పాత్రను పోషించాడు.

అసలేంటి ది గోట్ లైఫ్ స్టోరీ?

90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథను వాస్తవ ఘటనల ఆధారంగా "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం)లో చూపించబోతున్నాడు డైరెక్ట‌ర్ బ్లెస్సీ..

ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటించారు. గోట్‌లైఫ్ మూవీ మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ మధ్యే పృథ్వీరాజ్ సుకుమారన్ అండ్ టీమ్ హైదరాబాద్ కూడా వచ్చింది. ఈ సందర్భంగా అతడు మూవీ గురించి స్పందించాడు. "ఇటీవల వరదరాజ మన్నార్ అనే కింగ్ క్యారెక్టర్ లో సలార్ తో మీ ముందుకు వచ్చాను.

ఇప్పుడు "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం) సినిమాతో నజీబ్ అనే స్లేవ్ క్యారెక్టర్ తో తెరపైకి రాబోతున్నాను. వరదరాజ మన్నార్ పూర్తిగా ప్రశాంత్ నీల్ ఇమాజినేషన్. కానీ ఈ సినిమా వాస్తవంగా జరిగిన కథ. నజీబ్ మన మధ్యే సజీవంగా ఉన్నాడు" అని సుకుమారన్ అన్నాడు.

ది గోట్ లైఫ్ రన్‌టైమ్

ది గోట్ లైఫ్ మూవీ ర‌న్ టైమ్ రివీలైంది. రెండు గంట‌ల న‌ల‌భై ఒక్క నిమిషాల నిడివితో గోట్‌లైఫ్ తెలుగులో రిలీజ్ అవుతోంది. రెండు గంట‌ల యాభై రెండు నిమిషాల లెంగ్త్‌తో సినిమాను రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. అయితే సెన్సార్ స‌భ్యులు కొన్ని సీన్స్‌కు అభ్యంత‌రాలు చెప్పిన‌ట్లు తెలిసింది. దాంతో ప‌ద‌కొండు నిమిషాలు పైనే సినిమాను ట్రిమ్‌ చేసి రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ మూవీకి సెన్సార్ నుంచి యూ ఏ స‌ర్టిఫికెట్ వ‌చ్చింది.

IPL_Entry_Point