ఫ్యాన్స్‌కు ర‌ష్మిక మంధాన ప్రామిస్‌.. ది గ‌ర్ల్‌ఫ్రెండ్ మూవీ ఆల‌స్యంపై అప్‌డేట్‌.. ఏం చెప్పిందంటే?-the girlfriend movie update what rashmika mandanna says delay for better out put rahul ravindran ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఫ్యాన్స్‌కు ర‌ష్మిక మంధాన ప్రామిస్‌.. ది గ‌ర్ల్‌ఫ్రెండ్ మూవీ ఆల‌స్యంపై అప్‌డేట్‌.. ఏం చెప్పిందంటే?

ఫ్యాన్స్‌కు ర‌ష్మిక మంధాన ప్రామిస్‌.. ది గ‌ర్ల్‌ఫ్రెండ్ మూవీ ఆల‌స్యంపై అప్‌డేట్‌.. ఏం చెప్పిందంటే?

ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ ఆలస్యంపై హీరోయిన్ రష్మిక మంధాన రియాక్టయింది. మూవీ బెటర్ గా వచ్చేందుకు ట్రై చేస్తున్నామని, ఫ్యాన్స్ కు అదే తన ప్రామిస్ అని ఆమె పేర్కొంది.

ది గర్ల్‌ఫ్రెండ్ మూవీలో రష్మిక మంధాన

అప్పుడెప్పుడో రష్మిక మంధాన హీరోయిన్ గా తన డైరెక్షన్ లో ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ అనౌన్స్ చేశాడు రాహుల్ రవీంద్రన్. అయిదు నెలల క్రితమే టీజర్ కూడా రిలీజ్ చేశాడు. కానీ ఆ తర్వాత మూవీ గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. ఏ చప్పుడు లేదు. దీని గురించే ఫ్యాన్స్ ప్రశ్నిస్తే తాజాగా రష్మిక మంధాన రియాక్టయింది. మూవీ ఆలస్యంపై ఆన్సర్ ఇచ్చింది.

ట్రెండింగ్ లో

రష్మిక మంధాన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దీంతో రీసెంట్ గా ఎక్స్ లో"#ReleaseTheGirlfriend" ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో మూవీపై డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్, హీరోయిన్ రష్మిక మంధాన రియాక్టయ్యారు. ఎక్స్ లో రాహుల్ రవీంద్రన్ పోస్టును షేర్ చేస్తూ రష్మిక ఫ్యాన్స్ కు ప్రామిస్ చేసింది. ‘‘త్వరలోనే అప్ డేట్ వస్తుంది. ప్రామిస్. కాస్త ఓపికతో ఉండండి’’ అని రవీంద్రన్ పోస్టు చేశాడు.

వెయిట్ చేయిస్తున్నామని

"హాయ్.. మై లవ్లీస్. మిమ్మల్ని వెయిట్ చేయిస్తున్నామని నాకు తెలుసు. ఇప్పుడు మీ ట్రెండ్ మాకెంతో ప్రత్యేకం. నన్ను నమ్మండి. బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చేందుకు రాహుల్ రవీంద్రన్ కష్టపడుతున్నాడు. ఇదో స్పెషల్ సినిమాగా నిలిచిపోనుంది. సాధారణంగా పెద్దగా మాట్లాడుకోని విషయాల గురించి ఈ మూవీలో మేం మాట్లాడబోతున్నాం. ఇది పూర్తిగా క్యారెక్టర్ బేస్డ్ మూవీ. అదే ఈ సినిమాకు అందం’’ అని రష్మిక మంధాన రాసుకొచ్చింది.

బెస్ట్ ఇవ్వాలని

‘‘మీకు బెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాం. అదే మా ప్రామిస్. మీ వెయిటింగ్ కు తగ్గట్లు మూవీ ఉంటుంది. మీరు చూపిస్తున్న ప్రేమ కోసం మేం ప్రాసెస్ లో స్పీడ్ పెంచి, త్వరలోనే మీకు అందిస్తాం’’ అని రష్మిక పోస్టు చేసింది. దీనికి రవీంద్రన్ స్పందించాడు. ‘‘మా సినిమాకు ఆత్మ, వెన్నెముక ఈ అమ్మాయి. రష్మికకు బిగ్గెస్ట్ హగ్. మీకు మంచి అనుభవాన్ని అందించేందుకు మేం కష్టపడుతున్నాం’’ అని రాహుల్ పేర్కొన్నాడు.

ఇంటెన్సివ్ లవ్ స్టోరీ

ది గర్ల్‌ఫ్రెండ్ మూవీని ఇంటెన్సివ్ లవ్ స్టోరీగా రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు రైటర్ కూడా అతనే. కాలేజీలోకి ఎంటర్ అవుతున్న అమ్మాయిగా రష్మిక కనిపించగా.. బ్యాక్ గ్రౌండ్ లో విజయ్ దేవరకొండ వాయిస్ తో వచ్చిన టీజర్ ఫ్యాన్స్ ను మెప్పించింది.

ఈ మూవీని ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినీడి నిర్మించారు. హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించగా, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రం యొక్క టీజర్ గత సంవత్సరం విడుదలైంది. ఈ వీడియోలో దీక్షిత్ శెట్టిని ఆమె ప్రియుడిగా పరిచయం చేశారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం