The Ghost Twitter Review: ది ఘోస్ట్ ట్విటర్ రివ్యూ.. కింగ్ నాగార్జున హిట్ కొట్టినట్లే
The Ghost Twitter Review: ది ఘోస్ట్ మూవీ ట్విటర్ రివ్యూ చెబుతున్నది ఒకటే కింగ్ నాగార్జున హిట్ కొట్టినట్లే. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా దసరా (అక్టోబర్ 5) సందర్భంగా ప్రేక్షకులు ముందుకు వచ్చింది.
The Ghost Twitter Review: టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున నటించిన ది ఘోస్ట్ మూవీ దసరా రోజు అంటే బుధవారం (అక్టోబర్ 5) ప్రపంచవ్యాప్తంగా రిలీజైన విషయం తెలిసిందే. ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్, తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుఝామున వేసిన షోస్ చూసిన ఫ్యాన్స్ ట్విటర్‌లో తమ రివ్యూలు రాస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు
అయితే ఎటు చూసినా ఘోస్ట్ మూవీకి పాజిటివ్ రివ్యూలే వస్తుండటం విశేషం. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసినట్లు రివ్యూలు చూస్తే అర్థమవుతోంది. ప్రవీణ్ సత్తారు టేకింగ్, యాక్షన్ సీక్వెన్స్‌లో కింగ్ నాగార్జున నటన, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కి చాలా మంది అభిమానులు ఫిదా అవుతున్నారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుందని, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో తీసిన సినిమా ది ఘోస్ట్ అని కొందరు అభిమానులు ట్వీట్ చేశారు.
ఇక సెకండాఫ్, క్లైమ్యాక్స్ కూడా చాలా మంది ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. యాక్షన్ సీక్వెన్స్‌లో మరో లెవల్లో ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. ఇంటర్వెల్ సీన్స్, సెకండాఫ్ పిచ్చెక్కించేలా ఉన్నాయని ఓ అభిమాని తన రివ్యూ రాశాడు. ఒక బాష, ఒక విక్రమ్, ఒక ఘోస్ట్ అంటూ ఇంతకుముందు బ్లాక్‌బస్టర్ మూవీలతో పోల్చాడు మరో అభిమాని.
చాలా రోజులుగా సక్సెస్ కోసం చూస్తున్న నాగార్జునకు ది ఘోస్ట్ మూవీతో విజయం దక్కినట్లే కనిపిస్తోంది. ఈ మూవీలో కింగ్ మొత్తం 12 స్టంట్స్ చేయడం విశేషం. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు టేకింగ్, స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు బలం కానున్నాయి. ఇక ఈ మూవీ కోసం నాగార్జున కూడా బాగానే చెమటోడ్చాడు. ఇందులోని యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రత్యేకంగా గన్స్, కత్తులతో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడు.