The Family Man 3: అది పుకారు కాదు నిజమే..: ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ మూడో సీజన్‌లో విలన్ నేనే అంటున్న స్టార్
The Family Man 3: ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ మూడో సీజన్ మరింత రసవత్తరంగా ఉండనుంది. ఈసారి మనోజ్ బాజ్‌పాయీతోపాటు మరో ప్రముఖ నటుడు జైదీప్ అహ్లావత్ ఈ సిరీస్ లో ఉండబోతున్నాడు. ఈ విషయాన్ని అతడే కన్ఫమ్ చేశాడు.
The Family Man 3: ఓటీటీలో వచ్చిన బెస్ట్ ఇండియన్ వెబ్ సిరీస్ లో ఒకటైన ఫ్యామిలీ మ్యాన్ త్వరలోనే మూడో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలుసు కదా. తెలుగు డైరెక్టర్లు రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేస్తున్న ఈ వెబ్ సిరీస్ మూడో సీజన్లో ప్రముఖ నటుడు జైదీప్ అహ్లావత్ విలన్ పాత్ర పోషించనున్నట్లు పుకార్లు వస్తున్నాయి. అయితే అది పుకారు కాదు నిజమే అని ఇప్పుడా నటుడే కన్ఫమ్ చేయడం విశేషం.
ది ఫ్యామిలీ మ్యాన్ 3లో జైదీప్ అహ్లావత్
ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఇప్పటి వరకూ ఇండియన్ ఓటీటీలో వచ్చిన బెస్ట్ వెబ్ సిరీస్ లలో ఒకటి. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్.. మూడో సీజన్ తో రానుంది. ఇందులో తాను కూడా నటించినట్లు జైదీప్ అహ్లావత్ చెప్పాడు.
న్యూస్ 24తో మాట్లాడిన అతడు.. ఇది పుకారు కాదు నిజమే అని అనడం విశేషం. ఈ మధ్యే అతడు పాతాళ్ లోక్ సీజన్ 2 ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో అతని నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
ది ఫ్యామిలీ మ్యాన్ 3లో విలన్ జైదీప్
ఓటీటీలో పాతాళ్ లోక్ తోపాటు మరెన్నో వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన నటుడు జైదీప్ అహ్లావత్. అలాంటి నటుడు మరో హిట్ ఫ్రాంఛైజీ అయిన ది ఫ్యామిలీ మ్యాన్ తో చేతులు కలపడం ఎంతో ఆసక్తి రేపుతోంది. అందులోనూ ఈ మూడో సీజన్లో జైదీప్ విలన్ పాత్ర పోషించనుండటం విశేషం.
రెండో సీజన్లో ఈ పాత్రలో సమంత రుత్ ప్రభు కనిపించింది. ఈ వెబ్ సిరీస్ లో మనోజ్ బాజ్‌పాయీ లీడ్ రోల్లో నటించాడు. అతనితోపాటు షరీబ్ హష్మి, ప్రియమణి, ఆశ్లేషా ఠాకూర్, శ్రేయా ధన్వంతరి, శరద్ కేల్కర్, దలీప్ తాహిల్ లాంటి వాళ్లు కూడా నటించారు.
ముగిసిన షూటింగ్
ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 షూటింగ్ ఈ మధ్యే ముగిసింది. ఈ విషయాన్ని మేకర్సే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ రాప్-అప్ పార్టీలో టీమ్ తోపాటు జైదీప్ కూడా కనిపించడంతో అతడు కూడా ఇందులో ఉన్నట్లు పుకార్లు మొదలయ్యాయి. కానీ ఇప్పుడు అది పుకారు కాదు నిజమని జైదీపే చెప్పడంతో మూడో సీజన్లో అతని పాత్ర ఎలా ఉండబోతోందో అన్న ఆసక్తి నెలకొంది.
ది ఫ్యామిలీ మ్యాన్ మూడో సీజన్ ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మొదట్లో ప్రైమ్ వీడియోలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఇదే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న పాతాళ్ లోక్ వెబ్ సిరీస్ రెండు సీజన్లలోనూ జైదీప్.. హథీరాం చౌదరి అనే ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించాడు.
సంబంధిత కథనం