The Family Man Season 3: హిందీలో ఇప్పటి వరకూ వచ్చిన బెస్ట్ వెబ్ సిరీస్ లలో ఒకటి ది ఫ్యామిలీ మ్యాన్. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. తొలి సీజన్ లో ఢిల్లీపై ఉగ్రదాడి, రెండో సీజన్ లో ఎల్టీటీఈ ఫైట్ ను చూపించిన ఈ సిరీస్ ఇక ఇప్పుడు మూడో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.,తెలుగు వాళ్లయిన రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ను డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ మూడో సీజన్ పై ఫ్యామిలీ మ్యాన్ మనోజ్ బాజ్‌పేయి మంగళవారం (ఫిబ్రవరి 7) కీలకమైన అప్‌డేట్ ఇచ్చాడు. ఓ వీడియో ద్వారా సీజన్ 3పై నేరుగా కాకపోయినా ఓ హింట్ ఇవ్వడం విశేషం. దీంతో ప్రేక్షకులు ఈ సీజన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.,"హలో. ఎలా ఉన్నారు అందరూ? చాలా కాలం అయింది కదా? నా మాట జాగ్రత్తగా వినండి. ఈ హోలీకి మీ ఫ్యామిలీ కోసం వస్తున్నాను. నా ఫ్యామిలీని తీసుకొని" అని మనోజ్ ఆ వీడియోలో చెప్పాడు. ఫ్యామిలీని తీసుకొని వస్తున్నా అని అతడు అనడంతో పరోక్షంగా ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 గురించి చెబుతున్నాడని అందరికీ అర్థమైంది.,ఈ పోస్ట్ పై బాలీవుడ్, వెబ్ సిరీస్ నటి శ్రేయ ధన్వంతరితోపాటు ఎంతో మంది అభిమానులు రియాక్టయ్యారు. మనోజ్ కచ్చితంగా ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 గురించే చెప్పాడని ఫ్యాన్స్ కు అర్థమైపోయింది. ఈ సిరీస్ కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా రాజ్ అండ్ డీకే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఈ సిరీస్ ను ఎంతో థ్రిల్లింగా మార్చింది.,ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్లు సిటడెల్ సిరీస్ చేస్తున్నారు. అది పూర్తవగానే ఫ్యామిలీ మ్యాన్ 3పై పని చేస్తామని, చాలా మంది దీని గురించి అడుగుతున్నారని ఈ మధ్యే కృష్ణ డీకే చెప్పాడు. త్వరలోనే దీని గురించి గుడ్ న్యూస్ వింటారని ఆ మధ్య రాజ్ అండ్ డీకే ఇద్దరూ చెప్పారు. ఈ హిట్ వెబ్ సిరీస్ లో మనోజ్ బాజ్‌పేయితోపాటు ప్రియమణి, శరద్ కేల్కర్, నీరజ్ మాధవ్, దలీప్ తాహిల్ శ్రేయ ధన్వంతరి నటించారు.,ఇక ఫ్యామిలీ మ్యాన్ రెండో సీజన్ లో సమంత నటించిన విషయం తెలిసిందే. అందులో ఎల్టీటీఈ ఉగ్రవాదిగా సమంత నటన అందరినీ ఆకట్టుకుంది. దీంతో రాజ్ అండ్ డీకేతోనే ఆమె సిటడెల్ కూడా చేస్తోంది.,,