The Elephant Whisperers Oscar: ఆస్కార్‌తో ది ఎలిఫెంట్ విస్పరర్స్ బొమ్మన్ దంపతులు.. నెట్టింట ఫొటో వైరల్-the elephant whisperers bomman and belli finally pose with the oscar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  The Elephant Whisperers Oscar: ఆస్కార్‌తో ది ఎలిఫెంట్ విస్పరర్స్ బొమ్మన్ దంపతులు.. నెట్టింట ఫొటో వైరల్

The Elephant Whisperers Oscar: ఆస్కార్‌తో ది ఎలిఫెంట్ విస్పరర్స్ బొమ్మన్ దంపతులు.. నెట్టింట ఫొటో వైరల్

Maragani Govardhan HT Telugu
Mar 23, 2023 12:30 PM IST

The Elephant Whisperers Oscar: ది ఎలిఫెంట్ విస్పరర్స్ షార్ట్ ఫిల్మ్‌లో కనిపించిన నిజ జీవిత జంతు పోషకులు బొమ్మన్, బెల్లి దంపతులు ఆస్కార్‌తో ఫొటోలు దిగారు. కార్తికి గోన్సాల్వేస్ ఈ ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఆస్కార్ ట్రోఫీతో ది ఎలిఫెంట్ విస్పరర్స్ బొమ్మన్, బెల్లి
ఆస్కార్ ట్రోఫీతో ది ఎలిఫెంట్ విస్పరర్స్ బొమ్మన్, బెల్లి

The Elephant Whisperers Oscar: ఇటీవల జరిగిన 95వ ఆస్కార్ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్‌తో పాటు ది ఎలిఫెంట్ విస్పరర్స్ అనే డాక్యూమెంటరీ షార్ట్ ఫిల్మ్‌కు అకాడమీ లభించిన విషయం తెలిసిందే. ఒకే ఏడాది భారతీయ నిర్మాణ సంస్థలకు రెండు ఆస్కార్లు రావడంతో సర్వత్రా ప్రశంసల వర్షం కురిపిసింది. బెస్ట్ డాక్యూమెంటరీ షార్‌ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ దక్కించుకున్న ది ఎలిఫెంట్ విస్పరర్స్‌ను గునీత్ మోంగా నిర్మించగా.. కార్తికి గోన్స్‌లేవ్స్ తెరకెక్కించారు. బొమ్మన్, బెల్లి అనే దంపతులు ఓ ఏనుగును చేరదీసి పెంచడాన్ని అద్భుతంగా తెరకెక్కించిన కార్తికి ఆస్కార్ గెల్చుకున్నారు. తాజాగా ఈ షార్ట్ ఫిల్మ్‌లో నటించిన బొమన్, బెల్లి అందుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ పిక్చర్‌ను కార్తికి తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

"మనం విడిపోయి నాలుగు నెలలైంది. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నట్లు భావిస్తున్నాను." అంటు కార్తికి తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్టు పెట్టారు. అంతేకాకుండా బొమన్, బెల్లి ఆస్కార్‌తో దిగిన ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం కార్తికి పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోపై నెటిజన్లే కాకుండా సెలబ్రెటీలు సైతం విశేషంగా స్పందిస్తున్నారు. ఈ చిత్రంపై బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ స్పందిస్తూ ఎప్పటికైనా నా ఫేవరెట్ ఆస్కార్ పిక్చరే ఇదే అని స్పందించగా.. ఇషా గుప్తా రెడ్ హార్ట్ ఎమోజీలను పోస్ట్ చేసింది.

తమిళనాడు నీలగిరి జిల్లాలో బొమ్మన్, బెల్లి దంపతులు తప్పిపోయిన ఓ ఏనుగును చెరదీసి తమ జీవితంలో భాగంగా దాన్ని పెంచుతున్నారు. ఆ ఏనుగుతో వారికున్న అనుబంధాన్ని, ప్రేమను ది ఎలిఫెంట్ విస్పరర్స్ అనే షార్ట్ ఫిల్మ్ రూపంలో తెరకెక్కించారు కార్తికి.

ఉత్తమ డాక్యూమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్ గెలిచి 95వ అకాడమీ అవార్డుల్లో చరిత్ర సృష్టించారు. దీంతో మార్చి 15న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. బొమ్మన్, బెల్లిని సత్కరించారు. ఒక్కొక్కరి ఒక రూ.1 లక్ష చెక్కులు, ఓ షీల్డును అందజేశారు. ఇటీవల సీఎం స్టాలిన్ కార్తికి కోటి రూపాయల చెక్కును అందించారు. ఆమెకు జ్ఞాపిక, ప్రశంస పత్రాన్ని అందించి సత్కరించారు. అంతేకాకుండా ఆస్కార్ గెలుచుకున్నందుకు ఆమెను అభినందించారు.

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్