Best OTT Movies Of Today Release: వీకెండ్ రాగానే ఓటీటీల్లో ఏ సినిమాలు, వెబ్ సిరీసులు ఉన్నాయని సెర్చ్ చేస్తుంటారు మూవీ లవర్స్, సాధారణ ప్రేక్షకులు. అలాంటి వారికి మరింత సులభతరం చేసేందుకే ఇవాళ ఓటీటీ రిలీజ్ అయిన వాటిలో ది బెస్ట్ 6.. అది కూడా తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న సినిమాలు, వెబ్ సిరీసులను ఇక్కడ తెలియజేశాం. మరి అవేంటో ఓ లుక్కేయండి.
టాలెంటెడ్ యంగ్ హీరో సుహాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. సెప్టెంబర్ 20న థియేటర్లలో విడుదలైన సుహాస్ గొర్రె పురాణం సినిమా ఇవాళే ఓటీటీలోకి వచ్చేసింది. కొన్ని వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన గొర్రె పురాణం ఆహా ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత 20 రోజుల్లోనే గొర్రె పురాణం ఓటీటీలోకి రావడం విశేషంగా మారింది.
ఇటీవల తెలుగులో విడుదలైన లవ్ కామెడీ సినిమా పైలం పిలగా. ఆనంద్ గుర్రం దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 20న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం అయితే ఐఎమ్‌డీబీ నుంచి 10కి 9 రేటింగ్ ఉన్న పైలం పిలగా సినిమా ఈటీవీ విన్లో నేటి నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా సాయి తేజ కల్వకోట, పావని కరణం నటించారు.
డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ తత్వ. హిమ దాసరి, ఉస్మాన్ గని, పూజా రెడ్డి మెయిన్ లీడ్ రోల్స్‌లో నటించిన తత్వ చిత్రానికి రిత్విక్ యెలగరి దర్శకత్వం వహించారు. కేవలం గంటపాటు రన్ టైమ్ ఉన్న తత్వ మూవీ కూడా ఈటీవీ విన్ ఓటీటీలో అక్టోబర్ 10 నుంచి డిజిటల్ ప్రీమియర్ అవుతోంది.
బాలీవుడ్ హంక్ జాన్ అబ్రహం, శార్వరి వాఘ్, అభిషేక్ బెనర్జీ, ఆశిష్ విద్యార్థి ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ వేదా. మిల్కీ భామ తమన్నా భాటియా గెస్ట్ రోల్ చేసిన ఈ సినిమా ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా థియేటర్లలో విడుదలైంది. ఇవాళ్టి నుంచి జీ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్లో వేదా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.
6.6 ఐఎమ్‌డీబీ రేటింగ్ సంపాదించుకున్న వేదాను నిఖిల్ అద్వానీ తెరకెక్కించారు. వేదా సినిమా హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది.
డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయిన హాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సిటాడెల్: డయానా. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సూపర్ హిట్ ఓటీటీ వెబ్ సిరీస్ సిటాడెల్కు సీక్వెల్‌గా తెరకెక్కింది సిటాడెల్: డయానా. అమెజాన్ ప్రైమ్‌లో అక్టోబర్ 10 నుంచి సిటాడెల్: డయానా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక సిటాడెల్కు ప్రీక్వెల్‌గా సమంత నటించిన సిటాడెల్ హనీ బన్నీ నవంబర్‌లో ఓటీటీ రిలీజ్ కానుంది.
ఐఎమ్‌డీబీలో 7.5 రేటింగ్ అందుకున్న కొరియన్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్ జోసన్ అటార్నీ ఏ మొరాలిటీ. 2023లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు ఇండియాలో స్ట్రీమింగ్ అవుతోంది. జోసన్ అటార్నీ ఏ మొరాలిటీ మొదటి సీజన్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. అది కూడా కొరియన్తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఓటీటీ రిలీజ్ అయింది.
టాపిక్