ఓటీటీలో ఎన్నో రకాల సినిమాలు ఎప్పటికప్పుడు వస్తూ అలరిస్తుంటాయి. ఇక ప్రతి వారం విభిన్న జోనర్స్‌లలో సినిమాలు ఓటీటీ రిలీజ్ అవుతూ మూవీ లవర్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తాయి. వాటిలో థియేట్రికల్ మూవీస్‌తోపాటు డైరెక్ట్ స్ట్రీమింగ్ సినిమాలు ఉంటాయి.
అయితే, థియేటర్లలో సూపర్ హిట్ అయిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఒకటి ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. ఆ సినిమానే ది అకౌంటాంట్ 2. 2016లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ది అకౌంటాంట్‌కు సీక్వెల్‌గా ది అకౌంటాంట్ 2 మూవీ వచ్చింది.
భారీ అంచనాల నడుమ ది అకౌంటాంట్ 2 చిత్రం మొదటగా సౌత్‌వెస్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇదే ఏడాది మార్చి 8న ప్రదర్శించారు. అక్కడ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ది అకౌంటాంట్ 2 సినిమా యూనైటెడ్ స్టేట్స్‌లో ఏప్రిల్ 25న థియేట్రికల్ రిలీజ్ అయింది.
సుమారు 80 మిలియన్ డాలర్ల (ఇండియన్ కరెన్సీలో దాదాపుగా రూ. 664 కోట్లు) బడ్జెట్‌తో తెరకెక్కిన ది అకౌంటాంట్ 2 మూవీ బాక్సాఫీస్ వద్ద 107.1 మిలియన్ డాలర్స్ గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. అంటే, ఇండియన్ కరెన్సీ ప్రకారం 872 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది ది అకౌంటాంట్ 2 మూవీ.
ఇలా బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ది అకౌంటాంట్ 2 ఇవాళ (జూన్ 5) ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఆరు భాషల్లో. అమెజాన్ ప్రైమ్‌లో నేటి నుంచి ది అకౌంటాంట్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం వంటి ఆరు భాషల్లో ది అకౌంటాంట్ 2 ఓటీటీ రిలీజ్ అయింది.
అంతేకాకుండా తెలుగుతోపాటు చాలా భాషల్లో సబ్ టైటిల్స్‌తో కూడా ది అకౌంటాంట్ 2 డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. బ్యాట్ మ్యాన్ ఫేమ్ బెన్ అఫ్లెక్ హీరోగా చేసిన ది అకౌంటాంట్ 2 సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి పదికి 7 రేటింగ్ వచ్చింది. అయితే, ఇది మొదటి పార్ట్ కంటే తక్కువే అని చెప్పొచ్చు.
మొదటి భాగం ది అకౌంటాంట్ సినిమాకు ఐఎమ్‌డీబీ సంస్థ 10కి 7.3 రేటింగ్ ఇచ్చింది. అలాగే, 44 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ది అకౌంటాంట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద 155 మిలియన్ డాలర్స్ కొల్లగొట్టింది. అంటే, సీక్వెల్‌గా వచ్చిన ది అకౌంటాంట్ 2 కంటే మొదటి పార్ట్ ది అకౌంటాంట్ ఎక్కవ కలెక్షన్స్, రేటింగ్ సాధించింది.
ఈ రెండు సినిమాలను అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారు ఈ రెండింటిన అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయొచ్చు.
సంబంధిత కథనం