Priyanka Chopra : సెట్‌లో నా అండర్‌వేర్ తీయమని చెప్పాడు డైరెక్టర్
Priyanka Chopra : ప్రియాంక చోప్రాపై గతంలో కొంతమంది విమర్శలు గుప్పించారు. దీనిపై అప్పుడే ఆమె స్పందించింది. ఇప్పుడు ఓ హిందీ దర్శకుడి గురించి షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చింది ప్రియాంక.
నటి ప్రియాంక చోప్రా(Priyanka Chopra) ప్రస్తుతం హాలీవుడ్‌లో బిజీగా ఉంది. బాలీవుడ్‌కి తిరిగి వచ్చే ఆలోచనలో లేదు. బాలీవుడ్(Bollywood)లో ఎదురవుతున్న సమస్యల గురించి చాలా సార్లు ఓపెన్ గా మాట్లాడింది ఆమె. మొదట్లో చాలా మంది ఆమె చర్మం రంగుపై విమర్శలు గుప్పించారు. ఈ విషయంపై ఆమె గతంలోనే మాట్లాడింది. ఇప్పుడు ఓ హిందీ దర్శకుడి గురించి షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చింది. ఆమె ప్రకటన సంచలనం సృష్టించింది.
ట్రెండింగ్ వార్తలు
'అప్పుడే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాను. నేను ఒక సినిమా అంగీకరించాను. అందులో డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. అప్పుడు దర్శకుడు నా దగ్గరకు వచ్చి డ్యాన్స్ చేసేటప్పుడు నీ లోదుస్తులన్నీ తీసేయాలి అన్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. అండర్ వేర్ చూపించమని అడిగితే ఏం చెప్పాలో తోచలేదు. కానీ ఒప్పుకోలేదు. ఆ మరుసటి రోజే నేను ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాను. ఇందులో నాకు నటించడం ఇష్టం లేదు.' అంటూ ప్రియాంక చోప్రా పాత సంఘటనను గుర్తు చేసుకుంది.
షూటింగ్ సెట్‌లో నా అండర్‌వేర్‌ని తొలగించమని అడిగిన దర్శకుడి(Director)ని నేను ఏమీ అనలేదని ప్రియాంక చెప్పింది. అతనికి వ్యతిరేకంగా మాట్లాడలేదని కూడా తెలిపింది. నిరసన తెలిపేందుకు భయపడ్డానని చెప్పుకొచ్చింది. ఈ విషయంపై చాలా బాధపడినట్టుగా ప్రియాంక వెల్లడించింది.
'ఆ రోజు నేను ఆ సినిమా నిర్మాత ఆఫీసు నుండి బయలుదేరాను. ఇది నిజంగా షాక్. ఆ రోజు నేను అలాంటి సంఘటనను చూశానా? అని ఇప్పటికీ అనిపిస్తుంది. మీరు చెప్పేది తప్పు అని వారికి గట్టిగా చెప్పాలి. ఆ క్షణంలో భయపడి మౌనంగా వెళ్లిపోయాను. అదే నేను చేసిన అతి పెద్ద తప్పు.' అని ప్రియాంక అన్నారు. పాప్ సింగర్ నిక్ జోనాస్‌తో ప్రియాంకకు వివాహమైంది.
కొన్ని రోజుల కిందట కూడా ఓ విషయాన్ని వెల్లడించింది ప్రియాంక. ఒకప్పుడు ప్రియాంక ఏ విషయాన్నైనా బయటకు చెప్పేందుకు ఇబ్బంది పడేదంట. అమెరికా(America) వెళ్లిన కొత్తలో అయితే పక్కవారితో ఎలా స్నేహంగా ఉండాలో తెలిసేది కాదట. ఈ విషయాన్ని స్వయంగా ప్రియాంక చోప్రానే తెలిపింది.
'హైస్కూల్ విద్య కోసం అమెరికాకు వెళ్లినప్పుడు కొత్తలో నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అక్కడ ఆడవారితో ఎలా స్నేహంగా ఉండాలో మొదట అర్థం కాలేదు. క్యాంటీన్‌కు వెళ్లి ఫుడ్ ఎలా తీసుకోవాలో అప్పట్లో నాకు తెలియదు. వెండింగ్ మిషన్ నుంచి స్నాక్స్ తీసుకొని ఎవరూ చూడకుండా బాత్రూమ్‌లోకి వెళ్లి తినేసి క్లాస్ రూమ్‌కు వెళ్లేదాన్ని. అలా చాలా రోజుల పాటు వేరే వాళ్లతో కలిసి తిరగలేదు. నాకున్న భయంతో అలా ఉండాల్సి వచ్చేది.' అని ప్రియాంక చోప్రా గతంలో వెల్లడించింది.
సంబంధిత కథనం