Sobhita Dhulipala: మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ - భర్తపై శోభిత పోస్ట్ - చైతూ క్యూట్ రిప్లై!
Sobhita Dhulipala తండేల్ రిలీజ్ సందర్భంగా భర్త నాగచైతన్యను ఉద్దేశించి శోభిత ధూళిపాళ్ల ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఫైనల్లీ గడ్డం షేవ్ చేస్తావు. మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది శోభిత ధూళిపాళ్ల.

తండేల్ రిలీజ్ సందర్భంగా నాగచైతన్యను ఉద్దేశించి అతడి భార్య శోభిత ధూళిపాళ్ల పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫైనల్లీ గడ్డం షేవ్ చేస్తావు. మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది శోభిత ధూళిపాళ్ల. అంతే కాకుండా తండేల్ సినిమా చేసేటప్పుడు నువ్వు ఎంత ఫోకస్డ్‌గా, పాజిటివ్‌గా ఉన్నావో ప్రత్యక్షంగా చూశానని, ఈ ఎక్స్‌ట్రార్డినరీ లవ్‌స్టోరీని థియేటర్లలో చూసేందుకు ఆడియెన్స్‌తో పాటు తాను ఎగ్జైటెడ్‌గా ఉన్నట్లు ఈ పోస్ట్‌లో శోభిత పేర్కొన్నది.
శోభిత పోస్ట్‌కు థాంక్యూ బుజ్జితల్లి అంటూ నాగచైతన్య రిప్లై ఇచ్చాడు. శోభిత పోస్ట్, నాగచైతన్య రిప్లై సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. పెళ్లి తర్వాత రిలీజ్ అవుతోన్న నాగచైతన్య ఫస్ట్ మూవీ ఇదే కావడం గమనార్హం.
ఆ రెండు సినిమాలు ఇష్టం...
తండేల్ ప్రమోషన్స్‌లో భార్య శోభితపై నాగచైతన్య ప్రశంసలు కురిపించాడు. శోభిత నటించిన సినిమాల్లో మేడిన్ హెవెన్, మేజర్ సినిమాలకు తనకు ఎంతో ఇష్టమని నాగచైతన్య అన్నాడు. శోభిత తెలుగు పరిజ్ఞానం అమోఘమని, భాష విషయంలో తన సలహాలు, సూచనలే తీసుకుంటానని చెప్పాడు.
శోభిత ప్లానింగ్…
తమ పెళ్లికి సంబంధించిన ప్లానింగ్ మొత్తం శోభితనే చూసుకుందని, తెలుగు సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం పెళ్లి జరిగేలా డిజైన్ చేసిందని నాగచైతన్య అన్నాడు. శోభతను ఉద్దేశించి అతడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
గత రెండుమూడేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట డిసెంబర్ 4న పెళ్లి పీటలెక్కారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో వీరి పెళ్లి జరిగింది.
తండేల్‌కు పాజిటివ్ టాక్...
మరోవైపు తండేల్ నాగచైతన్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీస్‌లో ఒకటిగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రేమకథకు దేశభక్తిని జోడించి దర్శకుడు చందూ మొండేటి ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ ఓవర్‌సీప్ ప్రీమియర్స్‌కు పాజిటివ్ టాక్ లభిస్తోంది. నాగచైతన్య, సాయిపల్లవి లవ్‌స్టోరీ, కెమిస్ట్రీ అద్భుతమంటూ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తోన్నారు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్‌గా నిలిచిందని అంటున్నారు.
విరూపాక్ష దర్శకుడితో…
తండేల్ తర్వాత విరూపాక్ష దర్శకుడు కార్తీక్ వర్మతో ఓ మూవీ చేయబోతున్నాడు నాగచైతన్య. ఈ పాన్ ఇండియన్ మూవీని ఎస్‌వీసీసీ బ్యానర్‌తో కలిసి సుకుమార్ రైటింగ్స్ సంస్థ ప్రొడ్యూస్ చేస్తోంది.