Thandel Twitter Review: తండేల్ మూవీకి టాక్ ఇలా.. హైలైట్స్ ఇవే.. అదొక్కటే మైనస్!
Thandel Twitter Review: తండేల్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ మూవీ ఎర్లీ షోస్ చేసిన కొందరు ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పోస్ట్ చేస్తున్నారు. చిత్రం తమకు ఎలా అనిపించిందో వెల్లడిస్తున్నారు. అవి ఇక్కడ చూడండి.

చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూసిన ‘తండేల్’ చిత్రం వచ్చేసింది. యువ సామ్రాట్ నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సాయిపల్లవి జోడీగా నటించిన ఈ సినిమా నేడు (ఫిబ్రవరి 7) థియేటర్లలో రిలీజైంది. శ్రీకాకుళం మత్స్యకారుడి నిజజీవిత కథతో డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించిన ఈ చిత్రంపై ఆరంభం నుంచి ఆసక్తి ఎక్కువగా ఉంది. పాకిస్థాన్ జైలులో కొన్ని నెలల పాటు చిత్ర హింసలు అనుభవించి మళ్లీ భారత దేశానికి తిరిగి వచ్చిన శ్రీకాకుళం మత్య్సకారుల రియల్ స్టోరీ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. నేడు ఈ మూవీని చూసిన కొందరు నెటిజన్లు సోషల్ మీడియా ప్లాట్‍ఫామ్ ఎక్స్ (ట్విట్టర్)లో తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ చిత్రానికి టాక్ ఎలా వస్తోందంటే..
నాగచైతన్య, మ్యూజిక్, దేశభక్తి సీన్స్.. హైలెట్స్ ఇవే
తండేల్ సినిమాలో నాగచైతన్య యాక్టింగ్ అదిరిపోయిందని చాలా మంది పోస్టులు చేస్తున్నారు. సాయిపల్లవి ఎప్పటిలాగే చాలా బాగా నటించారని చెబుతున్నారు. సాధాణంగా పల్లవి ఉంటే ఆమె గురించే ఎక్కువ చర్చ ఉంటుందని, కానీ ఈ మూవీలో మాత్రం నాగచైతన్య యాక్టింగ్ హైలైట్‍గా నిలిచిందని అంటున్నారు. గత చిత్రాలతో పోలిస్తే చైతూ యాక్టింగ్ ఈ మూవీలో సూపర్ అంటున్నారు. మత్య్సకారుడిగా నాగచైతన్య మేకోవర్, నటన, శ్రీకాకుళం యాసలో డైలాగ్ డెలివరీ చాలా బాగున్నాయని రాసుకొస్తున్నారు. ఆయన పడిన కష్టం తెరపై కనిపిస్తోందని అంటున్నారు. నటుడిగా చైతూకి తండేల్ మూవీ మంచి పేరు తీసుకొస్తుందని చెబుతున్నారు. సాయిపల్లవి మరోసారి తన మార్క్ మ్యాజిక్ చేశారని ట్వీట్లు చేస్తున్నారు. చైతూ, పల్లవి మధ్య కెమిస్ట్రీ మరోసారి బాగా కుదిరిందని చెబుతున్నారు.
తండేల్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్ ఇచ్చిన పాటలు ఇప్పటికే పాపులర్ అయ్యాయి. అయితే, పాటలే కాకుండా బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా దేవీ చాలా బాగా అందించారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మ్యూజిక్ ఈ మూవీకి పెద్ద బలంగా నిలిచిందని అభిప్రాయపడుతున్నారు. పాటల పిశ్చరైజేషన్ కూడా బాగుందని అంటున్నారు.
తండేల్ సినిమాలో ఇంటర్వెల్ సీక్వెన్స్, దేశభక్తి పోర్షన్, క్లైమాక్స్ అదిరిపోయానని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా సెకండాఫ్ చాలా బాగుందని అంటున్నారు. డైరెక్టర్ చందూ మొండేటీ.. ఈ రియల్ లైఫ్ స్టోరీని చూపించడంలో చాలా వరకు సక్సస్ అయ్యారని చాలా మంది పోస్టులు చేస్తున్నారు. తప్పకుండా చూడాల్సిన చిత్రం అంటూ కొందరు అంటున్నారు.
ఈ ఒక్కటే మైనస్.. మిగతా అంతా సూపర్
తండేల్ చిత్రం విషయంలో ఒకటే మైనస్ అంటూ చాలా మంది పోస్టులు చేస్తున్నారు. అదే ఈ సినిమా మొదటి 30 నిమిషాలు ఆసక్తికరంగా లేదని అంటున్నారు. లవ్ స్టోరీ బేసిక్‍గా ఉందని, స్లోగా అనిపిస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఆ అర గంట సినిమాకు పెద్దగా కనెక్ట్ కాలేదని చెబుతున్నారు. అక్కడకక్కడా చిత్రానికి డ్రాగ్ చేసినట్టు అనిపించిందని చెబుతున్నారు. అయితే, ఆ తర్వాతి నుంచి మూవీ బాగుందని పోస్టులు చేస్తున్నారు.
ఇంటర్వెల్ సూపర్.. ఆ తర్వాత కూడా..
తండేల్ చిత్రంలో ఇంటర్వెల్ చాలా బాగుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇంటర్వెల్ బాగా పండిందని చెబుతున్నారు. సెకండాఫ్ కూడా ఆకట్టుకునేలా ఉందని కామెంట్లు చేస్తున్నారు. సెకండాఫ్‍లో వచ్చిన దేశభక్తి సీన్లు బలంగానే ఉన్నాయని అంటున్నారు. అయితే, భారత్, పాకిస్థాన్ కొన్ని సీన్లు కాస్త ఆర్టిఫిషియల్‍గా ఉన్నాయని కొందరు చెబుతున్నారు. అయినా, ఈ సీన్లు మంచి ఇంపాక్ట్ చూపించాయని అభిప్రాయపడుతున్నారు. సినిమా అంతటా నాగచైతన్య పర్ఫార్మెన్స్ మాత్రం చాలా పరిణితితో ఉందని అంటున్నారు. సెకండాఫ్‍లో ఎక్కువ భాగంతో పాటు క్లైమాక్స్ కూడా ఆకట్టుకుంటుందని ట్వీట్లు చేస్తున్నారు. ఎమోషనల్ సీన్లు కూడా బాగున్నాయని చెబుతున్నారు.
మొత్తంగా తండేల్ సినిమాకు ఎక్కువగా పాజిటివ్ విషయాలే ఇప్పటి వరకు బయటికి వచ్చాయి. ఫస్టాఫ్ తొలి అరగంటపైనే కాస్త అసంతృప్తిని కొందరు నెటిజన్లు వ్యక్తం చేశారు. మిగిలిన చిత్రమంతా ఆకట్టుకుందని చెబుతున్నారు. మొత్తంగా థియేటర్లలో చూడాల్సిన సినిమానే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
సంబంధిత కథనం
టాపిక్