Thandel Trailer: తండేల్ అంటే లీడర్.. లవ్ స్టోరీకి దేశభక్తిని జోడించి వచ్చేసిన ట్రైలర్.. చైతూ, సాయి పల్లవి జోడీ అదుర్స్-thandel trailer released thandel means leader naga chaitanya sai pallavi movie love story with patriotism ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thandel Trailer: తండేల్ అంటే లీడర్.. లవ్ స్టోరీకి దేశభక్తిని జోడించి వచ్చేసిన ట్రైలర్.. చైతూ, సాయి పల్లవి జోడీ అదుర్స్

Thandel Trailer: తండేల్ అంటే లీడర్.. లవ్ స్టోరీకి దేశభక్తిని జోడించి వచ్చేసిన ట్రైలర్.. చైతూ, సాయి పల్లవి జోడీ అదుర్స్

Hari Prasad S HT Telugu
Jan 28, 2025 07:17 PM IST

Thandel Trailer: తండేల్ ట్రైలర్ వచ్చేసింది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ క్యూట్ లవ్ స్టోరీ కమ్ దేశభక్తి మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కానుండగా.. మంగళవారం (జనవరి 28) ట్రైలర్ రిలీజ్ చేశారు.

తండేల్ అంటే లీడర్.. లవ్ స్టోరీకి దేశభక్తిని జోడించి వచ్చేసిన ట్రైలర్.. చైతూ, సాయి పల్లవి జోడీ అదుర్స్
తండేల్ అంటే లీడర్.. లవ్ స్టోరీకి దేశభక్తిని జోడించి వచ్చేసిన ట్రైలర్.. చైతూ, సాయి పల్లవి జోడీ అదుర్స్

Thandel Trailer: తండేల్ అంటే లీడర్.. అంటూ మోస్ట్ అవేటెడ్ మూవీ ఆఫ్ ఇయర్ తండేల్ ట్రైలర్ వచ్చేసింది. నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య అదిరిపోయిన కెమెస్ట్రీకి తోడు కాస్త దేశభక్తిని కూడా జోడించి డైరెక్టర్ చందూ మొండేటి తీసుకొస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

yearly horoscope entry point

తండేల్ ట్రైలర్ రిలీజ్

నాగ చైతన్య తండేల్ మూవీ ట్రైలర్ మంగళవారం (జనవరి 28) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. వైజాగ్ లోని రామా టాకీస్ రోడ్ లో ఉన్న శ్రీరామా పిక్చర్ ప్యాలెస్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. సాయంత్రం 5 గంటల నుంచి ఈ ఈవెంట్ ప్రారంభం అయింది.

నిజానికి సాయంత్రం 6.03 గంటలకు ట్రైలర్ రావాల్సి ఉన్నా.. గంట ఆలస్యంగా వచ్చింది. అయితే ట్రైలర్ మాత్రం అభిమానుల అంచనాలను తగినట్లుగానే సాగింది. చైతూ, సాయి పల్లవి మధ్య కెమెస్ట్రీ అదిరిపోయింది. ముఖ్యంగా ఈ ఇద్దరి నోటా ఉత్తరాంధ్ర యాస బాగా పలికింది.

తండేల్ అంటే లీడర్

చాలా మందికి ఈ మూవీ టైటిల్ తండేల్ అని చెప్పిన తర్వాత అసలు దీని అర్థం ఏంటన్నది తెలియలేదు. ఈ ట్రైలర్ ద్వారా మేకర్స్ ఆ అర్థమేంటో కూడా చెప్పారు. తండేల్ అంటే లీడర్ అనే ఓ డైలాగ్ కూడా ట్రైలర్లో వినిపిస్తుంది.

రాజూ.. ఊళ్లో అందరూ మన గురించి ఏటేటో మాటాడుకుంటున్నారు రా అనే సాయి పల్లవి డైలాగుతో ట్రైలర్ మొదలవుతుంది. వాళ్లు అనుకుంటున్నదే నిజం చేసేద్దామని ఆమె అనగానే ఇద్దరి లవ్ స్టోరీ మొదలవుతుంది. అయితే తరచూ చేపల వేటకు వెళ్లే అతడు.. ఆమెకు దూరమవుతూ ఉంటాడు. కానీ ఓసారి పాకిస్థాన్ సరిహద్దుకు వెళ్లి అక్కడే చిక్కుకుపోతాడు. 

అక్కడితో ట్రైలర్ కాస్తా లవ్ ట్రాక్ నుంచి దేశభక్తి  వైపు వెళ్తుంది. మా దేశంలోని ఊరకుక్కలన్నీ ఉత్తరం వైపు తిరిగి పోస్తే.. ప్రపంచ పటంలో పాకిస్థాన్ లేకుండా పోతుంది.. మా యాసను మాత్రం ఎటకారం చేస్తే రాజులమ్మ జాతరే అని రెండు పవర్ ఫుల్ డైలాగులు చైతూ నోటి వెంట వినిపిస్తాయి.

Whats_app_banner