Thandel Movie Ticket Prices: ఏపీలో తండేల్ మూవీ టికెట్ల ధర పెంపుకు అనుమతి.. ఎంత పెంచారంటే?
Thandel Movie Ticket Prices: తండేల్ మూవీ టికెట్ల ధరలను పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం (ఫిబ్రవరి 4) ఉత్తర్వులు జారీ చేసింది.
Thandel Movie Ticket Prices: నాగ చైతన్య, సాయి పల్లవి నటిస్తున్న తండేల్ మూవీ టికెట్ల ధరలు ఏపీలో పెరగనున్నాయి. ఈ మూవీ వచ్చే శుక్రవారం (ఫిబ్రవరి 7) రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. తెలంగాణలో దీనికి అవకాశం లేకపోవడంతో మేకర్స్ ఇక్కడి ప్రభుత్వాన్ని కోరలేదు. అయితే ఏపీలో మాత్రం వారం రోజుల పాటు టికెట్ల ధరలను పెంచుకోవడానికి అనుమతి లభించింది.

పెరిగిన తండేల్ టికెట్ల ధరలు
తండేల్ మూవీ కోసం టికెట్ల ధరలను పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ మంగళవారం (ఫిబ్రవరి 4) ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్లలో ఒక్కో టికెట్ పై ధరలను రూ.50 చొప్పున, మల్టీప్లెక్స్ లలో రూ.75 చొప్పున పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఈ పెంపు తొలి వారం రోజుల పాటు ఉండనుంది.
శుక్రవారం (ఫిబ్రవరి 7) తండేల్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. నాగ చైతన్య, సాయి పల్లవి జోడీ ఏదో మ్యాజిక్ చేస్తుందని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. ముఖ్యంగా చందూ మొండేటి డైరెక్షన్ కావడంతో తండేల్ హిట్ కొడుతుందని చైతూ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
తండేల్ మూవీ గురించి..
తండేల్ మూవీలో నాగ చైతన్య.. రాజు అనే ఓ మత్స్యకారుని పాత్రలో నటించాడు. తండేల్ అంటూ ఓనర్ కాదు లీడర్ అంటూ మూవీ టైటిల్ కు అర్థమేంటో కూడా ట్రైలర్లోనే మేకర్స్ వివరించే ప్రయత్నం చేశారు. ఇదొక నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా.
శ్రీకాకుళానికి చెందిన కొందరు జాలర్లు గుజరాత్ తీరంలో చేపలు పడుతూ పాకిస్థాన్ నేవీకి చిక్కుతారు. ఈ పాయింట్ కు దేశభక్తితోపాటు లవ్ స్టోరీని కూడా జోడించి చందూ మొండేటి ఈ తండేల్ మూవీని తెరకెక్కించాడు.
తండేల్ రెమ్యునరేషన్లు
తండేల్ కోసం నాగచైతన్య తన రెమ్యునరేషన్‌ను పెంచినట్లు సమాచారం. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కోసం నాగచైతన్య ఇరవై కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు తీసుకునే అతడు.. ఈ సినిమాకు మాత్రం దానిని రెట్టింపు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అటు సాయి పల్లవికి కూడా ఈ సినిమా ద్వారా భారీగానే అందినట్లు తెలుస్తోంది. ఆమె రెమ్యునరేషనల్ రూ.5 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు.
సంబంధిత కథనం