Thandel Third Single: తండేల్ నుంచి మరో లవ్ సాంగ్ హైలెస్సో హైలెస్సా వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ ఇదే-thandel third single hilesso hilessa to release on thursday 23rd january ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thandel Third Single: తండేల్ నుంచి మరో లవ్ సాంగ్ హైలెస్సో హైలెస్సా వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ ఇదే

Thandel Third Single: తండేల్ నుంచి మరో లవ్ సాంగ్ హైలెస్సో హైలెస్సా వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ ఇదే

Hari Prasad S HT Telugu
Jan 21, 2025 10:34 PM IST

Thandel Third Single: తండేల్ మూవీ నుంచి మరో లవ్ సాంగ్ లోడ్ అవుతోంది. హైలెస్సో హైలెస్సా అంటూ సాగనున్న ఈ థర్డ్ సింగిల్ రిలీజ్ డేట్ ను మంగళవారం (జనవరి 21) మూవీ టీమ్ తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వెల్లడించింది.

తండేల్ నుంచి మరో లవ్ సాంగ్ హైలెస్సో హైలెస్సా వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ ఇదే
తండేల్ నుంచి మరో లవ్ సాంగ్ హైలెస్సో హైలెస్సా వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ ఇదే

Thandel Third Single: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తండేల్ మూవీ నుంచి థర్డ్ సింగిల్ వచ్చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన బుజ్జి తల్లి సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో మనకు తెలుసు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈజ్ బ్యాక్ అంటూ ఆ పాట విన్న అభిమానుల తేల్చేశారు. ఇక ఇప్పుడు హైలెస్సో హైలెస్సా అంటూ థర్డ్ సింగిల్ రాబోతోంది.

తండేల్ థర్డ్ సింగిల్ హైలెస్సో హైలెస్సా

తండేల్ మూవీ కోసం మరోసారి తనలోని పాత డీఎస్పీని చూపిస్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. మనసుకు హత్తుకునే మెలోడీలతో అలరిస్తున్నాడు. ఇప్పటికే బుజ్జి తల్లి పాటతో అతడు ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు హైలెస్సో హైలెస్సా అంటూ మరో లవ్ సాంగ్ అందించబోతున్నాడు. "ఈ పాట మీకు బాగా నచ్చుతుంది. మీ ప్లేలిస్ట్ లో ఇది కచ్చితంగా ఉంటుంది. తండేల్ థర్డ్ సింగిల్ హైలెస్సో హైలెస్సా జనవరి 23న రాబోతోంది.

ఎ రాక్‌స్టార్ డీఎస్పీ స్పెషల్. శ్రేయా ఘోషాల్, అజీజ్ నకాష్ మ్యాజికల్ వాయిస్‌లలో ఈ పాట వస్తోంది" అనే క్యాప్షన్ తో తండేల్ టీమ్ తన ఎక్స్ అకౌంట్ ద్వారా సాంగ్ రిలీజ్ విషయం తెలిపింది. ఈ సందర్భంగా నాగ చైతన్య, సాయి పల్లవికి చెందిన ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. అందులో సాయి పల్లవి డ్యాన్స్ చేస్తుండగా.. చైతూ అలా చూస్తూ ఉండిపోతాడు.

తండేల్ మూవీ గురించి..

నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటిస్తున్న రెండో సినిమా ఇది. లవ్ స్టోరీ తర్వాత ఈ జంట మరోసారి తండేల్ ద్వారా ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి వస్తోంది. ఈ సినిమాను చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్నాడు. పాకిస్థాన్ కు చిక్కిన శ్రీకాకుళం జాలర్ల నిజ జీవిత ఘటన ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది.

లవ్ స్టోరీకి దేశభక్తిని జోడించి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఫిబ్రవరి 7న మూవీ రిలీజ్ కాబోతోంది. అంతకుముందే మ్యూజికల్ గా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం మేకర్స్ చేస్తున్నారు. ఇప్పటికే బుజ్జి తల్లి అనే మెలోడీ సాంగ్ ఎంతగానో ఆకట్టుకుంది. మరి ఈ హైలెస్సో హైలెస్సా అనే లవ్ సాంగ్ ఏం చేస్తుందో చూడాలి.

Whats_app_banner