Thandel: సరిగమప 16 గ్రాండ్ ఫినాలే- నాగ చైతన్య, సాయి పల్లవి గెస్టులు- టైటిల్ బరిలో ముగ్గురు- విజేత ప్రైజ్ మనీ ఎంతంటే?-thandel team naga chaitanya sai pallavi allu aravind guest to zee telugu saregamapa season 16 grand finale ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thandel: సరిగమప 16 గ్రాండ్ ఫినాలే- నాగ చైతన్య, సాయి పల్లవి గెస్టులు- టైటిల్ బరిలో ముగ్గురు- విజేత ప్రైజ్ మనీ ఎంతంటే?

Thandel: సరిగమప 16 గ్రాండ్ ఫినాలే- నాగ చైతన్య, సాయి పల్లవి గెస్టులు- టైటిల్ బరిలో ముగ్గురు- విజేత ప్రైజ్ మనీ ఎంతంటే?

Sanjiv Kumar HT Telugu
Published Feb 06, 2025 01:42 PM IST

Naga Chaitanya Sai Pallavi Guest To Saregamapa 16 Grand Finale: తండేల్ మూవీ హీరో హీరోయిన్స్ నాగ చైతన్య, సాయి పల్లవి బుల్లితెరపై సందడి చేయనున్నారు. జీ తెలుగు సరిగమప సీజన్ 16 ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్ గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథులుగా తండేల్ టీమ్ హాజరుకానుంది.

సరిగమప 16 గ్రాండ్ ఫినాలే- నాగ చైతన్య, సాయి పల్లవి గెస్టులు- టైటిల్ బరిలో ముగ్గురు- విజేత ప్రైజ్ మనీ ఎంతంటే?
సరిగమప 16 గ్రాండ్ ఫినాలే- నాగ చైతన్య, సాయి పల్లవి గెస్టులు- టైటిల్ బరిలో ముగ్గురు- విజేత ప్రైజ్ మనీ ఎంతంటే?

Thandel Team Guests To Saregamapa 16 Grand Finale: తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదం అందించే జీ తెలుగు ఈ ఆదివారం (ఫిబ్రవరి 9) మరింత వినోదం అందించేందుకు సిద్ధమైంది. ఆరంభం నుంచి మనసుని హత్తుకునే పాటలు, అద్భుతమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు పాపులర్ షో సరిగమప సీజన్​ 16‌‌- ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్ గ్రాండ్​ ఫినాలేకు చేరుకుంది.

సరిగమప సీజన్ -16 ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్ గ్రాండ్​ ఫినాలే

మట్టిలోని మాణిక్యాలను వెలికితీస్తూ అత్యంత ప్రేక్షకాదరణతో కొనసాగుతున్న సరిగమప 16 సీజన్​ చివరి అంకానికి చేరుకుంది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య గెస్ట్‌లుగా నాగచైతన్య, సాయిపల్లవి విచ్చేశారు. ఉత్కంఠగా సాగిన ఈ సరిగమప సీజన్ -16 ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్ గ్రాండ్​ ఫినాలే ఫిబ్రవరి 9 ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు టీవీ ఛానెల్‌లో ప్రసారం కానుంది.

మూడు జట్లుగా పోటీ

ఈ సీజన్​కి ప్రముఖ యాంకర్​ శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు కోటి, గాయని ఎస్పీ శైలజ, పాటల రచయిత కాసర్ల శ్యామ్​ న్యాయనిర్ణేతలుగా బాధ్యతలు చేపట్టారు. సరిగమప సీజన్ 16లో ఎంపికైన గాయనీగాయకులు విలేజ్​ వోకల్స్​, సిటీ క్లాసిక్స్​, మెట్రో మెలొడీస్​ మూడు జట్లుగా పోటీపడ్డారు.

టైటిల్​ బరిలో ముగ్గురు

ఈ జట్లకు ప్రముఖ గాయకులు రేవంత్​, రమ్య బెహర, అనుదీప్​ దేవ్​ మెంటర్లుగా వ్యవహరించారు. మెంటర్స్ మార్గదర్శకత్వంలో సోలో, డ్యూయెట్, గ్రూప్ యాక్ట్స్ వంటి క్లిష్టమైన రౌండ్లను ఎదుర్కొని ఆరుగురు కంటెస్టెంట్స్​ గ్రాండ్​ ఫినాలేకు చేరుకున్నారు. ఆరంభం నుంచి అద్భుతమైన ప్రదర్శనలతో రాణిస్తున్న సాత్విక్, మేఘన, వైష్ణవి, మోహన్, అభిజ్ఞ, మానస ఫినాలేకు చేరుకుని టైటిల్​ బరిలో నిలిచారు.

నాగ చైతన్య-సాయి పల్లవి-విశ్వక్ సేన్

ఈ ఆరుగురు సరిగమప 16-ది నెక్ట్స్​ సింగింగ్​ యూత్​ ఐకాన్​ టైటిల్​ కోసం పోటీపడనున్నారు. ఉత్కంఠగా సాగనున్న ఈ గ్రాండ్ ఫినాలేకు తండేల్ చిత్ర బృందం నుంచి హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి, నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంతేకాదు సీనియర్ నటి రాధ, హీరో విశ్వక్ సేన్ ఈ ఫినాలే ఎపిసోడ్​కి హాజరై ఫైనలిస్ట్​ల్లో ఉత్సాహం నింపారు.

రసవత్తరంగా సాగే

ప్రముఖ గాయని మంగ్లీ ప్రత్యేక ప్రదర్శన ఇవ్వగా, సీరియల్​ నటులు నిసర్గ గౌడ, ప్రీతి శర్మ, అభినవ్, సంగీత, పృథ్వీ, సాయికిరణ్ హాజరై ఫైనలిస్టులకు తమ మద్దతు తెలిపారు. రసవత్తరంగా సాగే ఈ గ్రాండ్ ఫినాలేలో ఫైనలిస్టులు పలు మ్యూజికల్ రౌండ్లలో పోటీపడి ప్రేక్షకులను అలరిస్తారు.

విజేత ప్రైజ్‌ మనీ

ఈ గ్రాండ్​ ఫినాలేలో గెలిచిన కంటెస్టెంట్​ సరిగమప 16-ది నెక్ట్స్ ​సింగింగ్ యూత్​ ఐకాన్​ టైటిల్​తోపాటు​ రూ. పది లక్షల నగదుని కూడా గెలుచుకోనున్నారు. హోరాహోరీగా సాగే ఈ సంగీత సమరంలో నిలిచి గెలిచేదెవరో తెలుసుకోవాలంటే జీ తెలుగులో ఆదివారం ప్రసారమయ్యే సరిగమప 16- ది నెక్ట్స్ ​సింగింగ్ యూత్​ ఐకాన్ గ్రాండ్​ ఫినాలే చూడాల్సిందే.

Whats_app_banner

సంబంధిత కథనం