Thandel Songs: యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న తండేల్ సాంగ్స్.. 10 కోట్ల వ్యూస్‌తో రికార్డు
Thandel Songs: తండేల్ మూవీ సాంగ్స్ యూట్యూబ్ లో దుమ్ము రేపుతున్నాయి. ఇప్పటి వరకూ ఈ మూవీ నుంచి మూడు పాటలు ప్రేక్షకుల ముందుకు రాగా.. ఇవన్నీ కలిపి 10 కోట్ల వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం.
Thandel Songs: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తండేల్ మూవీ రిలీజ్ కు ముందే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా నుంచి వచ్చిన మూడు పాటలూ యూట్యూబ్ లో ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నాయి. తాజాగా ఈ మూడూ కలిపి 100 మిలియన్ల వ్యూస్ మార్క్ దాటినట్లు మూవీ టీమ్ అనౌన్స్ చేసింది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే.

తండేల్ సాంగ్స్ సూపర్ హిట్
తండేల్ మూవీ నుంచి ఇప్పటికే మూడు సాంగ్స్ రిలీజ్ అయిన సంగతి తెలుసు కదా. బుజ్జి తల్లి, నమో నమ: శివాయ, హైలెస్సో హైలెస్సా సాంగ్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటలకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ మూడు పాటలూ కలిపి 100 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం.
ఈ విషయాన్ని సోమవారం (జనవరి 27) మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. "10 కోట్ల వ్యూస్.. బ్లాక్‌బస్టర్ తండేల్ ఆల్బమ్ మూడు పాటలతోనే 100 మిలియన్ల వ్యూస్ మ్యాజికల్ మార్క్ అందుకుంది. రాక్ స్టార్ డీఎస్పీ అందించిన ప్రతి పాటా మళ్లీ మళ్లీ వినాలని అనిపించేలా ఉంది. మరిన్ని చార్ట్‌బస్టర్స్ లోడింగ్" అనే క్యాప్షన్ తో తండేల్ టీమ్ ట్వీట్ చేసింది.
బుజ్జి తల్లి సాంగ్ బ్లాక్‌బస్టర్
తండేల్ నుంచి వచ్చిన మూడు పాటల్లో బుజ్జి తల్లి సాంగ్ మాత్రం మరో రేంజ్ లో ఉందని చెప్పొచ్చు. ఈ మూడు పాటలు కలిపి 100 మిలియన్ల మార్క్ అందుకుంటే అందులో ఒక్క బుజ్జి తల్లి పాట మాత్రమే 57 మిలియన్లు దాటడం విశేషం. ఈ పాటను దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన తీరు, లిరిక్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. వింటేజ్ డీఎస్పీని మరోసారి ఈ పాట చూపించిందంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.
అటు ఈ మధ్యే హైలెస్సో హైలెస్సా అనే మరో సాంగ్ కూడా వచ్చింది. ఈ లవ్ సాంగ్ ప్రస్తుతం మ్యూజిక్ లో నంబర్ 1 ట్రెండింగ్ సాంగ్ గా ఉంది. ఇప్పటికే ఈ పాటకు 6.5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇది కూడా మెలోడీ సాంగే. ఇక మూడు వారాల కిందట తండేల్ సెకండ్ సింగిల్ గా వచ్చిన నమో నమ: శివాయ సాంగ్ కు ఇప్పటి వరకూ 8.2 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం.
తండేల్ మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో మిగిలిన భాషలన్నీ కలిపి ఈ మూడు పాటలకు వచ్చిన వ్యూస్ 100 మిలియన్ల మార్క్ దాటింది. మరిన్ని చార్ట్‌బస్టర్స్ రావడానికి సిద్ధంగా ఉన్నాయని మేకర్స్ చెప్పడం చూస్తుంటే.. తండేల్ రిలీజ్ కు ముందే పెద్ద మ్యూజిక్ హిట్ అయ్యేలా ఉంది. తండేల్ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.