OTT: వంద కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన టాలీవుడ్‌ రొమాంటిక్ థ్రిల్ల‌ర్ మూవీ ఓటీటీలోకి వ‌స్తోంది- ఐదు భాష‌ల్లో స్ట్రీమింగ్‌-thandel ott release date when and where to watch naga chaitanya sai pallavi romantic thriller movies netflix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: వంద కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన టాలీవుడ్‌ రొమాంటిక్ థ్రిల్ల‌ర్ మూవీ ఓటీటీలోకి వ‌స్తోంది- ఐదు భాష‌ల్లో స్ట్రీమింగ్‌

OTT: వంద కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన టాలీవుడ్‌ రొమాంటిక్ థ్రిల్ల‌ర్ మూవీ ఓటీటీలోకి వ‌స్తోంది- ఐదు భాష‌ల్లో స్ట్రీమింగ్‌

Nelki Naresh HT Telugu

OTT: నాగ‌చైత‌న్య, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తండేల్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి వ‌స్తోంది. మార్చి 7 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఐదు భాష‌ల్లో ఈ మూవీ విడుదల అవుతోంది. తండేల్ మూవీకి చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఓటీటీ

ఓటీటీలోకి వ‌స్తోంది. ఈ రొమాంటిక్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఆదివారం రివీలైంది. మార్చి 7 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విష‌యాన్ని నెట్‌ఫ్లిక్స్ అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేసింది. ఈ మేర‌కు ఓ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్న‌ది. తండేల్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ఐదు భాష‌ల్లో రిలీజ్ కాబోతుంది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ హిందీ భాష‌ల్లో రిలీజ్ అవుతోంది.

వంద కోట్ల క‌లెక్ష‌న్స్‌…

తండేల్ మూవీకి చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఫిబ్ర‌వ‌రి 7న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. వంద కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. నాగ‌చైత‌న్య కెరీర్‌లోనే హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ సాధించిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ ఏడాది తెలుగులో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను సాధించిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. తండేల్ మూవీకి దేవిశ్రీప్ర‌సాద్ మ్యూజిక్ అందించాడు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాసు ఈ సినిమాను నిర్మించాడు.

నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి కెమిస్ట్రీ...

మ‌త్స్య‌కారుల జీవితాల నేప‌థ్యంలో ప్రేమ‌, దేశ‌భ‌క్తి, యాక్ష‌న్ అంశాల‌తో చందూ మొండేటి తండేల్ మూవీని రూపొందించాడు. ఈ రొమాంటిక్ మూవీకి నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి యాక్టింగ్‌తో పాటు వారి కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచింది. దేవిశ్రీప్ర‌సాద్ పాట‌లు ఆక‌ట్టుకున్నాయి.

తండేల్ క‌థ ఇదే...

రాజు (నాగ‌చైత‌న్య‌), స‌త్య (సాయిప‌ల్ల‌వి) చిన్న‌నాటి నుంచి క‌లిసి పెరుగుతారు. స్నేహంతో మొద‌లైన వారి జ‌ర్నీ ప్రేమ‌గా మారుతుంది. రాజు చేప‌ల వేట కోసం ఏడాదిలో తొమ్మిది నెల‌లు స‌ముద్రంపైనే ఉంటాడు.ఆ టైమ్‌లో వేట‌కు వెళ్లిన రాజుకు ఏం జ‌రుగుతుందోన‌ని ప్ర‌తిక్ష‌ణం భ‌య‌ప‌డుతూ బ‌తుకుతుంటుంది స‌త్య. ప్రియురాలి బాధ‌, భ‌యం చూసిన రాజు మ‌ళ్లీ వేట కోసం స‌ముద్రంపైకి వెళ్ల‌న‌ని స‌త్య‌కు మాటిస్తాడు.

కానీ స‌త్య‌కు ఇచ్చిన మాట త‌ప్పుతాడు రాజు. త‌న‌కు తండేల్ ముఖ్య‌మ‌ని స‌ముద్రంలోకి వెళ‌తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? చేపల వేట‌కు వెళ్లిన రాజు పాకిస్థాన్ కోస్ట్ గార్డ్స్‌కు ఎలా దొరికిపోయాడు? పాకిస్థాన్ జైలులో రాజుకు ఎలాంటి క‌ష్టాలు ఎదుర‌య్యాయి?

స‌త్య‌కు ఇచ్చిన ప్రామిస్‌ను రాజు నిల‌బెట్టుకోలేక‌పోవ‌డానికి కార‌ణం ఏమిటి? రాజుపై కోపంతో అత‌డిని కాద‌ని మ‌రొక‌రితో స‌త్య పెళ్లికి ఎందుకు సిద్ధ‌ప‌డింది? రాజు జైలు నుంచి విడుద‌ల‌య్యాడా? లేదా? అన్న‌దే తండేల్ మూవీ క‌థ‌.

ల‌వ్ స్టోరీ త‌ర్వాత‌...

ల‌వ్ స్టోరీ త‌ర్వాత నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన మూవీ ఇది. తండేల్ కంటే ముందు నాగ‌చైత‌న్య‌తో చందూ మొండేటి స‌వ్య‌సాచి అనే సినిమా చేశాడు. తండేల్ త‌ర్వాత విరూపాక్ష ద‌ర్శ‌కుడు కార్తీక్ వ‌ర్మ‌తో ఓ థ్రిల్ల‌ర్ మూవీ చేయ‌బోతున్నాడు నాగ‌చైత‌న్య‌. సుకుమార్ రైటింగ్స్‌, శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర సంస్థ‌లు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం