Thandel OTT Release Date: తండేల్ ఓటీటీ రిలీజ్ అప్పుడే.. వచ్చే వారమే అనౌన్స్‌మెంట్!
Thandel OTT Release Date: తండేల్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఈ నెల 7న థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించిన ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ పై ఇప్పుడు ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

Thandel OTT Release Date: తండేల్ ఓటీటీ రిలీజ్ పై ఇప్పుడు బజ్ నెలకొంది. ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ అనౌన్స్‌మెంట్ వచ్చే వారమే అంటూ వార్తలు వస్తున్నాయి. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ప్లాట్‌ఫామ్ మూవీ రిలీజ్ పై ఎప్పుడు ప్రకటన చేస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
తండేల్ ఓటీటీ రిలీజ్ డేట్
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన మూవీ తండేల్. ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజై.. ఇప్పటికే రూ.100 కోట్ల గ్రాస్ దాటి దూసుకెళ్తున్న సినిమా ఇది. చైతన్య కెరీర్లోనే అత్యధిక వసూళ్లు ఇప్పటికే సాధించింది. అయితే ఈ మూవీ మార్చి 6వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మార్చి రెండో వారం నుంచి రావచ్చని సోషల్ మీడియాలో మరో ప్రచారం కూడా నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వారమే వస్తుందని కూడా చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకూ దీనిపై అటు మేకర్స్ కానీ, ఇటు నెట్‌ఫ్లిక్స్ కానీ ఏమీ మాట్లాడటం లేదు.
తండేల్ ఓటీటీ హక్కులు
తండేల్ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ హక్కులను అమ్మడం ద్వారానే మూవీ బడ్జెట్ లో 80 శాతం వరకు వచ్చేసినట్లూ చెబుతున్నారు. సుమారు రూ.45 కోట్లు వెచ్చించినట్లు సమాచారం.
థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత మూవీ డిజిటల్ ప్రీమియర్ ఉంటుందనీ భావిస్తున్నారు. ఆ లెక్కన మార్చి తొలి లేదా రెండో వారంలో ఈ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
తండేల్ బాక్సాఫీస్ రిపోర్ట్
తండేల్ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కాగా.. 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది. నాగ చైతన్య కెరీర్లో ఏ సినిమాకైనా ఇదే అత్యధిక కలెక్షన్లు కావడం విశేషం. ఇప్పటికీ తెలుగులో తండేల్ కు గట్టి పోటీ ఇచ్చే మూవీ లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర బలంగానే ఉంది. ఇండియాలో 12 రోజుల్లో నెట్ కలెక్షన్లు రూ.60 కోట్ల వరకూ ఉన్నాయి.
తండేల్ మూవీని ఓ నిజజీవిత ఘటన ఆధారంగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. శ్రీకాకుళానికి చెందిన కొందరు జాలర్లు గుజరాత్ తీరంలో చేపల వేటకు వెళ్లి అక్కడి పాకిస్థాన్ నేవీకి చిక్కి, వాళ్ల జైళ్లలో మగ్గిన తీరును ఈ మూవీలో చూపించారు. ప్రేమ కథకు దేశభక్తిని జోడించిన తీసిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
సంబంధిత కథనం