Thandel Movie Collection: తండేల్ మూవీ కలెక్షన్స్ అదుర్స్.. 3 రోజుల్లో 55 కోట్ల మాస్ జాతర.. 54 శాతం బడ్జెట్ రికవరీ!
Thandel Movie 3 Days Worldwide Box Office Collection: తండేల్ మూవీ కలెక్షన్స్ మూడో రోజు కూడా జోరందుకున్నాయి. ఆదివారం (ఫిబ్రవరి 9) ఇండియాలో తండేల్ నెట్ కలెక్షన్స్ కాస్తా పెరిగాయి. మరి మొత్తంగా నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన తండేల్ సినిమాకు మూడు రోజుల్లో వచ్చిన వసూళ్లు ఎలా ఉన్నాయో లుక్కేద్దాం.

Thandel Movie Box Office Collection Day 3: నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ చిత్రం ఫిబ్రవరి 7న విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. అయితే ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ ఆదివారం (ఫిబ్రవరి 10) ఇండియా నెట్ కలెక్షన్స్ కాస్తా పెరిగాయి.
తండేల్ మూవీ కలెక్షన్స్
ఇండియాలో మొదటి రోజు తండేల్ సినిమా రూ. 11.5 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టగా.. రెండో రోజున రూ. 12.1 కోట్లు వసూలు చేసింది. ఇక మూడో రోజున రూ. 12.25 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సక్నిల్క్ సంస్థ పేర్కొంది. రెండో రోజుతో పోలిస్తే.. మూడో రోజున భారతదేశంలో తండేల్ వసూళ్లు కాస్తా పెరిగినట్లుగా కనిపిస్తోంది. ఈ లెక్కన ఇండియాలో 3 రోజుల్లో తండేల్ సినిమాకు 35.85 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సక్నిల్క్ వెబ్ సైట్ పేర్కొంది.
తండేల్ థియేటర్ ఆక్యుపెన్సీ
ఇక చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జోడీ కట్టిన తండేల్ సినిమాకు ఆదివారం 62.07 శాతం తెలుగులో థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. వాటిలో ఉదయం 43.71 శాతం, మధ్యాహ్నాం 67.79 శాతం, సాయంత్రం 67.79 శాతం, నైట్ షోలకు 61.49 శాతంగా థియేటర్ ఆక్యుపెన్సీ వచ్చింది.
వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్
ఇక తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల్లో రూ. 26 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన తండేల్ మూవీ వరల్డ్ వైడ్‌గా 41.20 కోట్ల గ్రాస్ వచ్చినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక మూడో రోజు వచ్చేసరికి తెలుగు రాష్ట్రాల్లో రూ. 14 కోట్ల రేంజ్‌లో గ్సార్ అందుకునే అవకాశం ఉందని సమాచారం. కర్ణాటక రెస్టాఫ్ ఇండియా, హిందీ, తమిళంలో తండేల్ బాగానే రాణిస్తుంది.
తండేల్ మూడో రోజు కలెక్షన్స్
ఇక వరల్డ్ వైడ్‌గా మూడో రోజున తండేల్ సినిమా రూ. 17 నుంచి 18 కోట్లు.. ఆఫ్‌లైన్ వసూళ్లు బాగుంటే మరింతగా రూ. 18 నుంచి 19 కోట్ల రేంజ్‌లో గ్రాస్ కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల్లో తండేల్ మూవీ కలెక్షన్స్ రూ. 40 కోట్ల రేంజ్‌లో అటు ఇటుగా వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ సైట్స్ చెబుతున్నాయి.
తండేల్ 3 రోజుల వసూళ్లు
అలాగే, ప్రపంచవ్యాప్తంగా రూ. 55 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను తండేల్ అందుకోనుందని విశ్లేషిస్తున్నాయి. అంటే, 3 రోజుల్లోనే 55 కోట్ల కలెక్షన్స్‌తో తండేల్ మాస్ జాతర చేయనుందన్నమాట. మరోవైపు పెట్టిన బడ్జెట్‌లో 54 శాతం వరకు కలెక్షన్స్ రెండు రోజుల్లోనే తండేల్ మూవీ రికవరీ చేసినట్లు సమాచారం. రూ. 38 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన తండేల్ మూవీ హిట్ కొట్టాలంటే మాత్రం ఇంకా రూ. 15 కోట్ల రేంజ్‌లో షేర్ కలెక్షన్స్ వసూలు చేయాల్సి ఉంది.
సంబంధిత కథనం
టాపిక్