Thandel Box office Collections: రూ.100కోట్ల మార్క్ చేరిన తండేల్ సినిమా.. నాగచైతన్యకు తొలిసారి-thandel box office collections naga chaitanya enters 100 crore club for the first time ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thandel Box Office Collections: రూ.100కోట్ల మార్క్ చేరిన తండేల్ సినిమా.. నాగచైతన్యకు తొలిసారి

Thandel Box office Collections: రూ.100కోట్ల మార్క్ చేరిన తండేల్ సినిమా.. నాగచైతన్యకు తొలిసారి

Thandel Box office Collections: తండేల్ సినిమా ముఖ్యమైన మైల్‍స్టోన్ దాటేసింది. రూ.100కోట్ల మార్క్ చేరింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది.

Thandel Collections: రూ.100కోట్ల మార్క్ చేరిన తండేల్ సినిమా.. నాగచైతన్యకు తొలిసారి

నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన తండేల్ చిత్రం అదరగొడుతోంది. ఫిబ్రవరి 7న రిలీజైన ఈ మూవీ ఆరంభం నుంచి మంచి కలెక్షన్లతో సత్తాచాటుతోంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అందుకు తగ్గట్టే వసూళ్లను రాబడుతోంది. ఈ మూవీకి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. తండేల్ సినిమా ఎట్టకేలకు ఓ ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది.

రూ.100కోట్ల మార్క్

తండేల్ సినిమా 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.100కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటేసింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు (ఫిబ్రవరి 16) అధికారికంగా వెల్లడించింది. “బాక్సాఫీస్ దుళ్లకొట్టేశారు. థియేటర్లకు జాతర తెచ్చేశారు. బ్లాక్‍బస్టర్ తండేల్.. ప్రపంచవ్యాప్తంగా రూ.100కోట్ల గ్రాస్ దాటేసింది” అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

నాగచైతన్య కాలర్ ఎగరేస్తున్న పోజ్‍తో రూ.100కోట్ల పోస్టర్ తీసుకొచ్చింది మూవీ టీమ్. 100కోట్ల తండేల్ జాతర అంటూ హ్యాష్‍ట్యాగ్ పెట్టింది. ఈ చిత్రం రూ.100కోట్లు కొట్టడం ఖాయమంటూ నిర్మాత బన్నీవాసు ఇటీవలే చెప్పగా.. అది 9 రోజుల్లోనే సాధ్యమైంది.

నాగచైతన్య తొలిసారి

రూ.100కోట్ల కలెక్షన్ల మైలురాయిని నాగచైతన్య తొలిసారి సాధించారు. తండేల్ చిత్రంతో తొలిసారి ఆ క్లబ్‍లో అడుగుపెట్టారు. అక్కినేని హీరో రూ.100కోట్లు సాధించడం కూడా ఇదే తొలిసారి. కింగ్ అక్కినేని నాగార్జున, అఖిల్ కూడా ఇంకా ఆ మార్క్ సాధించలేదు. అక్కినేని కుటుంబం నుంచి రూ.100కోట్ల క్లబ్‍లో అడుగుపెట్టిన తొలి హీరోగా చైతూ నిలిచారు.

తండేల్ సినిమాలో మత్స్యకారుడు రాజు పాత్రలో నాగచైతన్య మెప్పించారు. ఎమోషనల్ సీన్లలోనూ ఆకట్టుకున్నారు. సాయిపల్లవి మరోసారి మ్యాజిక్ చేశారు. నిజజీవిత ఘటనలతో ఈ చిత్రాన్ని చందూ మొండేటి తెరకెక్కించారు. లవ్ స్టోరీ ప్రధానంగా ఈ మూవీని తీసుకొచ్చారు. పాకిస్థాన్ జైలులో నెలల పాటు కష్టాలను అనుభవించి భారత్‍కు తిరిగి వచ్చిన మత్స్యకారుల ఆధారంగా ఈ చిత్రాన్ని రాసుకున్నారు. ప్రేక్షకులు మెచ్చేలా ప్రేమకథను హైలైట్ చేస్తూ ఈ స్టోరీ చూపించారు.

తండేల్ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా చాలా ప్లస్ అయింది. పాటలు, బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో కరుణాకరన్, ప్రకాశ్ బెలవాది, ఆడుకాలం నరేన్, పృథ్విరాజ్, చరణ్‍దీప్, కల్పలత కీలకపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీవాసు ప్రొడ్యూజ్ చేయగా.. అల్లు అరవింద్ సమర్పించారు. ముందు నుంచి ఈ సినిమా సక్సెస్‍పై టీమ్ నమ్మకంతో ఉంది. ఇది నెరవేరింది. పాజిటివ్ రెస్పాన్స్ సహా కలెక్షన్లు జోరుగా వచ్చాయి. చైతూ కెరీర్లో బిగెస్ట్ హిట్‍గా నిలిచింది.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం