Thandel Collection: మైల్‍స్టోన్‍కు చేరువైన తండేల్ సినిమా.. 8 రోజుల్లో ఎన్ని రూ.కోట్లంటే..
Thandel 8 days Box office Collection: తండేల్ మూవీ ఓ మైల్‍స్టోన్‍ను సమీపించింది. ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబడుతోంది. రెండో వారంలోకి అడుగుపెట్టిన ఈ మూవీ జోష్ చూపిస్తోంది.

తండేల్ సినిమా కలెక్షన్లలో దూకుడు చూపిస్తోంది. యువ సామ్రాట్ నాగచైతన్య, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మంచి అంచనాలతో వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజ్ కాగా.. మొదటి నుంచి మంచి వసూళ్లను రాబడుతోంది. బాక్సాఫీస్ వద్ద జోరు కనబరుస్తోంది. దీంతో తండేల్ మూవీ ఓ మేజర్ మైల్‍స్టోన్‍కు చేరువైంది.
8 రోజుల కలెక్షన్లు ఇవే
తండేల్ సినిమా 8 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.95.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు (ఫిబ్రవరి 15) అధికారికంగా వెల్లడించింది. ఈ లెక్కలతో ఓ పోస్టర్ కూడా రివీల్ చేసింది. వాలెంటైన్ వీక్‍లో తండేల్ అదరగొట్టిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
రూ.100కోట్లకు చేరువలో..
తండేల్ సినిమా రూ.100కోట్లకు అత్యంత చేరువలోకి వచ్చేసింది. సుమారు మరో రూ.5కోట్లు సాధిస్తే.. ఆ మార్క్ దాటేస్తుంది. ఈ వీకెండ్ మరో రెండు రోజుల్లో ఈ మార్క్ దాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో నాగచైతన్య కెరీర్లో ఇదే తొలి రూ.100కోట్ల మూవీ కానుంది. ఈ వారం రిలీజైన లైలా, బ్రహ్మా ఆనందం చిత్రాలకు మిక్స్డ్ టాకే వచ్చింది. ఇది కూడా తండేల్‍కు ప్లస్‍గా ఉంది.
తండేల్ మూవీ టీమ్ సక్సెస్ ఈవెంట్లు వరుసగా నిర్వహిస్తోంది. హైదరాబాద్ తర్వాత శ్రీకాకుళంలోనూ ఈవెంట్ జరిగింది. ఈ మూవీని మరింత ప్రమోట్ చేసేందుకు కూడా టీమ్ ప్లాన్ చేస్తోంది. బ్లాక్‍బస్టర్ లవ్ సునామీ పేరుతో సక్సెస్ ఈవెంట్లు నిర్వహిస్తోంది.
తండేల్ చిత్రాన్ని నిజజీవిత ఘటనలతో తెరకెక్కించారు డైరెక్టర్ చందూ మొండేటి. పాకిస్థాన్‍లోని చెరలో కొన్ని నెలల పాటు ఉండి ఇండియాకు తిరిగొచ్చిన శ్రీకాకుళం మత్య్యకారుల రియల్ లైఫ్ స్టోరీతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో మత్స్యకారుడు రాజు పాత్రలో నాగచైతన్య నటించారు. బుజ్జితల్లి (సత్య) క్యారెక్టర్లో సాయిపల్లవి చేశారు. ప్రేమకథ ప్రధానంగా ఉన్న ఈ మూవీలో దేశభక్తి కూడా ఓ అంశంగా ఉంటుంది. ఎమోషనల్ లవ్ స్టోరీగా సాగుతుంది. చైతూ, పల్లవి యాక్టింగ్ ప్రేక్షకులను మెప్పించింది. ఈ చిత్రానికి మొదటి నుంచి పాజిటివ్ టాకే వచ్చింది.
తండేల్ చిత్రానికి దేవీప్రసాద్ సంగీతం అందించారు. ఈ మూవీని గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు ప్రొడ్యూజ్ చేశారు. సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరించారు. ఈ చిత్రంలో నాగచైతన్య, సాయి పల్లవితో పాటు ప్రకాశ్, కరుణాకరన్, ఆడుకాలం నరేన్, పృథ్విరాజ్, చరణ్‍దీప్ కీరోల్స్‌లో కనిపించారు.
సంబంధిత కథనం