ఆ ఓటీటీలోకే నితిన్ తమ్ముడు మూవీ.. నిజం చెప్పేసిన నిర్మాత దిల్ రాజు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?-thammudu ott streaming on netflix producer dil raju revealed nithin thammudu movie ott release platform ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఆ ఓటీటీలోకే నితిన్ తమ్ముడు మూవీ.. నిజం చెప్పేసిన నిర్మాత దిల్ రాజు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఆ ఓటీటీలోకే నితిన్ తమ్ముడు మూవీ.. నిజం చెప్పేసిన నిర్మాత దిల్ రాజు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Sanjiv Kumar HT Telugu

హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు. డైరెక్టర్ శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లయ కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాకు దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా ఉన్నారు. జూలై 4న ఈ మూవీ రిలీజ్ సందర్భంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో తమ్ముడు ఓటీటీ ప్లాట్‌ఫామ్ చెప్పేశారు దిల్ రాజు.

ఆ ఓటీటీలోకే నితిన్ తమ్ముడు మూవీ.. నిజం చెప్పేసిన నిర్మాత దిల్ రాజు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు. సీనియర్ హీరోయిన్ లయ ఈ మూవీలో నితిన్‌కు అక్కగా కీలక పాత్ర పోషించింది. అలాగే, తమ్ముడు సినిమాలో వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ హీరోయిన్స్‌గా చేశారు. మలయాళ బ్యూటి స్వాసిక మరో కీలక పాత్రలో అలరించేందుకు డెబ్యూ ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

తమ్ముడు ఓటీటీ ప్లాట్‌ఫామ్

డైరెక్టర్ శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన తమ్ముడు సినిమా జూలై 4న థియేటర్లలో విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో తమ్ముడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తో సహా పలు ఇంట్రెస్టింగ్ విశేషాలను పంచుకున్నారు నిర్మాత దిల్ రాజు.

ఐదారు యాక్షన్ ఎపిసోడ్స్

-తమ్ముడు మూవీ మొదటి 20 నిమిషాల తర్వాత మిగిలిన కథంతా ఒక్కరోజులో జరుగుతుంది. ఐదారు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. వాటిలో రెండు యాక్షన్ ఎపిసోడ్స్ వైలెంట్‌గా ఉన్నాయని ఏ సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ వాళ్లు చెప్పారు. ఆ రెండు ఎపిసోడ్స్ తీసేస్తే యు బై ఏ ఇస్తామని చెప్పారు.

సంక్రాంతికి వస్తున్నాం లాంటి

-ఈ సినిమాను థియేటర్ ఎక్సిపీరియన్స్ కోసమే చేశాం కాబట్టి ఆ ఫైట్ సీక్వెన్సులు తీసేయకుండా ఎ సర్టిఫికెట్‌కు అంగీకరించాం. ఇది సంక్రాంతికి వస్తున్నాం లాంటి ఎంటర్‌టైనర్ అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ రండి అని చెబుతాం.

యాక్షన్ ఓరియెంటెడ్

-తమ్ముడు మూవీ యాక్షన్ ఓరియెంటెడ్ కంటెంట్ ఉన్న మూవీ. థియేటర్స్‌కు వచ్చిన వాళ్లనైనా సంతృప్తి పరచాలి కదా అని ఎ సర్టిఫికెట్ తీసుకున్నాం. ఈ చిత్రాన్ని 150 రోజులు చిత్రీకరించారు. 80 పర్సెంట్ మూవీ అడవిలో ఉంటుంది. విజువల్స్, సౌండింగ్ హై క్వాలిటీతో ఉంటూ థియేటర్‌లో ఎంజాయ్ చేసేలా రూపొందించారు దర్శకుడు శ్రీరామ్ వేణు.

తమ్ముడు ప్రీమియర్స్

"తమ్ముడు సినిమాకు ప్రీమియర్స్ వేసే విషయం ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ప్రీమియర్స్ కోసం ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి. నేను ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా ఒక హోదాలో ఉన్నాను కాబట్టి అన్నీ చూసుకుని చేయాలి. తమ్ముడు మూవీని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వాళ్లు చూసి నచ్చి తీసుకున్నారు" అని దిల్ రాజు చెప్పారు.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో

కాబట్టి, నెట్‌ఫ్లిక్స్‌లో తమ్ముడు ఓటీటీ స్ట్రీమింగ్ కానుందన్నమాట. అది థియేట్రికల్ రిలీజ్ అయిన నెల రోజుల తమ్ముడు ఓటీటీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదా బాక్సాఫీస్ కలెక్షన్స్, పబ్లిక్ రెస్పాన్స్‌ను బట్టి నితిన్ తమ్ముడు ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్ మారే అవకాశం ఉంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం