హీరో నితిన్ కి ఈ మధ్య బాక్సాఫీస్ దగ్గర సరైన టైమ్ నడవడం లేదు. వరుసగా ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడ్డ నితిన్.. కొత్త సినిమా ‘తమ్ముడు’పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. కానీ వకీల్ సాబ్ ఫేమ్ శ్రీరామ్ వేణు డైరెక్షన్ లో వచ్చిన తమ్ముడు సినిమా కు సోషల్ మీడియాలో నెగెటివిటీ వస్తోంది. మూవీ బాలేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో నితిన్ మళ్లీ డిసప్పాయింట్ మెంట్ తప్పేలా లేదు. శుక్రవారం (జూలై 4) థియేటర్లలో రిలీజైంది తమ్ముడు మూవీ.
తమ్ముడు సినిమా చూసిన చాలా మంది అభిమానులు ఇలాంటి స్క్రిప్ట్ ను ఎంచుకున్నందుకు నితిన్ పై అసహనం వ్యక్తం చేశారు. ఒక ఎక్స్ యూజర్ ఇలా రాశాడు.. "తమ్ముడు చెత్త! ప్రీమియర్ నైట్ షోలో ఆయన సినిమాలు చూసే మూర్ఖుడిని నేను అని పదేపదే గుర్తు చేస్తున్న నితిన్ కు ధన్యవాదాలు. ఈ సినిమాలో వారు 'హామీ ఇచ్చినట్లు' ఎమోషనల్ డ్రామా కానీ, యాక్షన్ కానీ లేవు’’ అని తీవ్రమైన నిరాశ వ్యక్తం చేశాడు.
"క్షమించండి నితిన్, శ్రీరామ్ వేణు. ఈ బృందం 2005 నుండి కనీసం 2020 వరకు టైమ్ ట్రావెల్ ను పరిగణనలోకి తీసుకోవాలి. టీమ్ ని తిట్టడం కాదు కానీ మినిమమ్ గ్యారెంటీ సినిమా అందేలా చూసుకోండి. స్లోగా సాగే, ఊహించదగ్గ సన్నివేశాలున్నాయి. నటీనటులు బాగా నటించారు కానీ 1.5 రేటింగ్ మాత్రమే’’ అని ఓ యూజర్ ఎక్స్ లో రాసుకొచ్చాడు. 'నితిన్ కు మరో డిజాస్టర్ ఇది అర్ధ దశాబ్ద కాలంగా కొనసాగుతోంది' అని ఓ ఎక్స్ యూజర్ ట్వీట్ చేశాడు.
‘‘ఆశలన్నీ ఎల్లమ్మ మీదే ఉన్నాయి. శ్రీరామ్, నితిన్ ప్రయత్నించి విఫలమయ్యారు’’ అని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. సారీ నితిన్ అన్న నెక్ట్స్ సినిమాకు గుడ్ లక్ అని మరో యూజర్ అన్నాడు. ‘‘తమ్ముడు మొదటి నుంచి చివరి వరకు మీ సహనాన్ని పరీక్షిస్తుంది’’, "దర్శకుడు వేణు శ్రీరామ్ ఆసక్తికరమైన నేపథ్యంతో ఒక ప్రత్యేకమైన యాక్షన్-అడ్వెంచర్ చిత్రాన్ని అందించడంలో పూర్తిగా విఫలమయ్యాడు’’ అని ఆడియన్స్ అంటున్నారు. ‘‘విలన్ క్యారెక్టరైజేషన్ కొంత ప్రత్యేకంగా ఉన్నా.. కానీ క్లిక్ పాయింట్ కాదు. దాని ఎగ్జిక్యూషన్ ఫన్నీగా ఉంది’’ అని మరో యూజర్ పేర్కొన్నాడు.
మరొకరు ‘‘ఫస్ట్ హాఫ్ సూపర్బ్. సెకండాఫ్ లో అద్భుతమైన ఫైట్ సీక్వెన్స్ లు. ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఆ ఫైట్ సీక్వెన్స్. ఓవరాల్ గా మంచి సినిమా. ఒకసారి చూడండి. థియేటర్స్ లో తప్పక చూడాలి’’ అని, తమ్ముడులో నితిన్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని మరో అభిమాని అన్నాడు. ‘‘సాలిడ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో మంచి ఎమోషనల్ రైడ్ - 3/5. ప్రధానంగా యూత్ స్టార్ నితిన్ మంచి కమ్ బ్యాక్ సినిమాతో కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దర్శకుడు శ్రీరామ్ వేణు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సబ్జెక్ట్ ని చాలా బాగా హ్యాండిల్ చేశాడు’’ అని ఫ్యాన్ రాసుకొచ్చాడు.
సంబంధిత కథనం