ఆ హీరోయిన్‌లా పేరు తెచ్చుకోవాలి, రియల్ లైఫ్‌లో నేను అలా కాదు.. తమ్ముడు బ్యూటీ వర్ష బొల్లమ్మ కామెంట్స్-thammudu movie heroine varsha bollamma comments on nithya menon acting and says she is example ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఆ హీరోయిన్‌లా పేరు తెచ్చుకోవాలి, రియల్ లైఫ్‌లో నేను అలా కాదు.. తమ్ముడు బ్యూటీ వర్ష బొల్లమ్మ కామెంట్స్

ఆ హీరోయిన్‌లా పేరు తెచ్చుకోవాలి, రియల్ లైఫ్‌లో నేను అలా కాదు.. తమ్ముడు బ్యూటీ వర్ష బొల్లమ్మ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు. ఈ సినిమాలో హీరోయిన్స్‌గా వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ నటించారు. జులై 4న థియేటర్లలో విడుదలైన తమ్ముడు సినిమాకు పాజిటివ్ టాక్ రావడం లేదు. ఇక తమ్ముడు విడుదలకు ముందు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్ష బొల్లమ్మ మరో హీరోయిన్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ఆ హీరోయిన్‌లా పేరు తెచ్చుకోవాలి, రియల్ లైఫ్‌లో నేను అలా కాదు.. తమ్ముడు బ్యూటీ వర్ష బొల్లమ్మ కామెంట్స్

టాలీవుడ్ బ్యూటి వర్ష బొల్లమ్మ తెలుగులో అనేక సినిమాలతో అలరించింది. స్వాతిముత్యం, మిడిల్ క్లాస్ మెలోడీస్, స్టాండప్ రాహుల్, ఊరు పేరు భైరవకోన వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న వర్ష బొల్లమ్మ లేటెస్ట్‌గా నటించిన సినిమా తమ్ముడు.

జులై 4న థియేటర్లలో

నితిన్ హీరోగా తెరకెక్కిన తమ్ముడు సినిమాలో వర్ష బొల్లమ్మతో పాటు సప్తమి గౌడ మరో హీరోయిన్‌గా నటించింది. జులై 4న థియేటర్లలో విడుదలైన తమ్ముడు సినిమాకు పాజిటివ్ టాక్ రావడం లేదు. అయితే, ఈ సినిమా విడుదలకు ముందు పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో మరో హీరోయిన్‌పై తమ్ముడు బ్యూటి వర్ష బొల్లమ్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

వారి మధ్య ఉన్న రిలేషన్

"హీరో నితిన్ క్యారెక్టర్ జైకు చిత్ర డ్రైవింగ్ ఫోర్స్‌లా ఉంటుంది. జై కు అన్ కండిషనల్‌గా సపోర్ట్ చేస్తుంది చిత్ర. వారి మధ్య ఉన్న రిలేషన్ చాలా బాగుంటుంది. ఈ సినిమా కోసం నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా" అని వర్ష బొల్లమ్మ చెప్పింది.

మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని

"రియల్ లైఫ్‌లో కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఉండేది. అది ఈ సినిమాతో కుదిరింది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడాన్ని ఎంజాయ్ చేశాను. ఏదైనా చేయాలనుకుంటే వెంటనే అడుగువేసే క్యారెక్టర్ చిత్రది. నా రియల్ లైఫ్‌లో నేను అలా కాదు" అని వర్ష బొల్లమ్మ తెలిపింది.

గౌరవంగానే చూసుకున్నారు

"ఎస్వీసీ సంస్థలో మరోసారి నటించడం హ్యాపీగా ఉంది. జాను మూవీ చేసినప్పుడు నేను కొత్త నటిని. అయినా నాకు మంచి రెస్పెక్ట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా అలా గౌరవంగానే చూసుకున్నారు" అని వర్ష బొల్లమ్మ చెప్పుకొచ్చింది.

తేడాలు చూడాలనుకోవడం

"నేను హీరోయిన్‌గా పలు చిత్రాలు చేశా. హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టు.. ఇలాంటి తేడాలు చూడాలని అనుకోవడం లేదు. వర్ష బాగా పర్‌ఫార్మ్ చేసింది అనే పేరు తెచ్చుకుంటే చాలు" అని హీరోయిన్ వర్ష బొల్లమ్మ పేర్కొంది.

ఛాలెంజింగ్‌గా ఉందని

"తమ్ముడు కథ విన్నప్పుడు ఇది కొత్తగా ఉంది, ఛాలెంజింగ్‌గా ఉందనిపించింది. అందుకే నటించాను. హీరోయిన్ నిత్యా మీనన్‌ను ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే తనకు పర్‌ఫార్మర్‌గా పేరుంది. నేనూ అలాగే పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నా" తమ్ముడు బ్యూటీ వర్ష బొల్లమ్మ కామెంట్స్ చేసింది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం