తమ్ముడుకు తొలిరోజు దారుణమైన కలెక్షన్స్.. నితిన్ కెరీర్‌లోనే అత్యంత తక్కువ టికెట్ సేల్స్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?-thammudu day 1 box office collection worldwide thammudu has lowest ticket sales in nithin career ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  తమ్ముడుకు తొలిరోజు దారుణమైన కలెక్షన్స్.. నితిన్ కెరీర్‌లోనే అత్యంత తక్కువ టికెట్ సేల్స్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?

తమ్ముడుకు తొలిరోజు దారుణమైన కలెక్షన్స్.. నితిన్ కెరీర్‌లోనే అత్యంత తక్కువ టికెట్ సేల్స్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Sanjiv Kumar HT Telugu

హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన తమ్ముడు సినిమాకు తొలి రోజు దారుణమైన కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. అయితే, మొదటి రోజు 27 వేల వరకు నితిన్ మూవీ టికెట్స్ అమ్ముడుపోయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తమ్ముడు ఓపెనింగ్ కలెక్షన్స్‌లోకి వెళితే..!

తమ్ముడుకు తొలిరోజు దారుణమైన కలెక్షన్స్.. నితిన్ కెరీర్‌లోనే అత్యంత తక్కువ టికెట్ సేల్స్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని యంగ్ హీరోల్లో నితిన్ ఒకరు. గత కొంతకాలంగా మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. మాచర్ల నియోజకవర్గం, ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్, రాబిన్‌హుడ్ సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఫ్యామిలీ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన తమ్ముడు సినిమాపై నితిన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.

తమ్ముడుకు నెగెటివ్ టాక్

అయితే, జులై 4న థియేటర్లలో విడుదలైన తమ్ముడు సినిమాకు కూడా నెగెటివ్ టాక్ వస్తోంది. ఆ ప్రభావం తమ్ముడు కలెక్షన్స్‌పై పడింది. తొలి రోజున తమ్ముడు సినిమాకు దారుణమైన కలెక్షన్స్ వచ్చాయి. ఇండియాలో మొదటి రోజు తమ్ముడు సినిమాకు రూ. 2 కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే వచ్చినట్లు సక్నిల్క్ సంస్థ తెలిపింది.

తమ్ముడు వరల్డ్ వైడ్ కలెక్షన్స్

అలాగే, వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద తమ్ముడు మూవీకి రూ. 3 నుంచి 4 కోట్ల రేంజ్‌లోనే గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అంటే, షేర్ కలెక్షన్స్ కోటిన్నర రూపాయలు కూడా దాటాయో లేదో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నిపుణులు.

కోటిన్నర మాత్రమే షేర్ కలెక్షన్స్

మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా నితిన్ మూవీ తమ్ముడుకు రూ. 1.3 నుంచి 1.5 కోటి వరకు షేర్ కలెక్షన్స్ వచ్చే అవాకాశం ఉందని తెలుస్తోంది. అలాగే, ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ చూసిన అంతగా అంచనాలను అందుకోవడం లేదని సమాచారం.

ప్రీ బుకింగ్స్-టికెట్ సేల్స్

వరల్డ్ వైడ్‌గా తమ్ముడు సినిమా 950 వరకు థియేటర్లలో విడుదలైంది. తమ్ముడు సినిమాకు ప్రీ బుకింగ్స్‌లో 8.5 వేల రేంజ్‌లో టికెట్స్ సేల్ కాగా తొలి రోజున ఈ మూవీకి కేవలం 27 వేల లోపే టికెట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం. ఈ లెక్కన నితిన్ రీసెంట్ టైమ్ కెరీర్‌లోనే అత్యంత తక్కువ టికెట్స్ సేల్స్ అయి అభిమానులను తమ్ముడు నిరాశపరిచినట్లు అయింది.

తమ్ముడు మూవీ టీమ్

ఇకపోతే తమ్ముడు సినిమాకు వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. తమ్ముడు మూవీలో వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ హీరోయిన్స్‌గా చేశారు. అలాగే, సీనియర్ హీరోయిన్ లయ, మలయాళ భామ స్వాసిక ఇంపార్టెంట్ రోల్స్ చేశారు. దిల్ రాజు, శిరీష్ కలిసి తమ్ముడు సినిమాను నిర్మించారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం